Friday, September 23, 2011

నా మనసు కాగితం నీ ప్రేమ అక్షరాలతో నిండింది...
చెరిపి వేయలేనంతగా ....!!
నా హృదయ కలంలో అడుగంటి పోతున్న 
నీ ప్రేమ సిరాను తిరిగి ఎలా నింపుకోవాలో  తెలియక ..!!

వర్షించడానికి సముద్రమంత ప్రేమ నీ దగ్గరున్న ..
ఆ  ప్రేమ వర్షంలో తడిచే అంత అదృష్టం నాకు లేదు ...!!

నీ చిరు నవ్వు పూయించడానికి నా ఆయువు ధార పోయానా  ...
నీ ప్రేమ పొందడానికి మరో జన్మ కోసం ఎదురు చూడనా ??..... mercy

Wednesday, September 21, 2011

నీతో కాదు

నీతో కాదు 

నా ప్రాణం తీయడం నీ వల్ల కాదు ..
జ్ఞాపకాల సముద్రంలో ఏ మూలనో దాగుంది ....
నా ప్రాణం తీయాలంటే నా జ్ఞాపకాలను ఆవిరి చేయాలి ..
సముద్రమంత జ్ఞాపకాలను ఆవిరి చేయాలంటే ..
ఎన్ని ఆశల సూర్యులు ఉదయించాలో నువ్వే చెప్పూ......??!!
                     ..... (mercy)

నీ కోసం

నీ కోసం 

ఎవరికో సంబందించిన నీవు నాకు వద్దు...
నాకు చెందినా నువ్వుగా నా కోసం నువ్వుంటే చాలు ..!!

నా కన్నిటికి సమాధానం నీ చిరు నవ్వు ..
ఎడబాటు ముళ్ళ మధ్య విచుకున్న ప్రేమ సుమం నువ్వు ...!!

ఎన్నో జ్ఞాపకాల మధ్య విచుకున్న చిరునవ్వు నువ్వు ...
నీ ఒక్క జ్ఞాపకమే చాలు నాకు వేల మైళ్ళు నడువగల శక్తి నివ్వు ...!!

అందలమంత ఎతైన నిన్ను అందుకోగలనా నిన్నూ ...
అందవని తెలిసిన ఆశపడడం మాన లేను ...!! .....................(mercy)

Sunday, September 11, 2011

నువ్వు

నువ్వు 


నీ చిరు నవ్వుల రాళ్ళు వేసి,
నా మది కొలనులో తరంగాలు పుట్టించకు ,!!
నీ చూపుల తాకిడితో 
నా యెదలో గిలిగింతలు పుట్టించకు,,!!
మౌన మనే బాణం వేసి 
నా హృదయం తో మాట్లాడించకు .,
స్తబ్దుగా నా ముందు నిల్చుని 
నన్నే శిలను చేయకు ,
నీ ఊపిరి మాలలల్లి  
నన్ను మైమరిపించకు ..
నేనుగా నాలో దాగిన నన్ను,
నీ బానిసగా చేయకు ..
కాంతివై నాలోచేరి 
అలవాటుపడిన ఒంటరి తనపు చీకటిని 












....(mercy)

Saturday, June 18, 2011

నీ మౌనం


నీ మౌనం 


నీ మౌనం ఎంత పదునైనదో తెలుసా ? మాటలు రాని గొంతుని చీల్చి 
భావనలా ముత్యాలను రప్పించగలదు ....
నీ మౌనం ఎంత వెచ్చనిదో తెలుసా ? కరుడు కట్టిన 
కోపమనే మంచును ఇట్టే కరిగించ గలదు .....
నీ మౌనం ఎంత తుంటరిధో తెలుసా ? రాగం 
తెలియని పెదాల వీణపై నవ్వుల రాగం పలికించగలదు ...
నీ మౌనం ఎంత సాహసో నీకు తెలుసా ?? 
ఎంతటి పట్టుదల కొమ్మనైన ఇట్టే వంచగలదు ....
                                                         ....(mercy)

Sunday, May 8, 2011

అమ్మ ...
ఆలోచిస్తున్న ...  నేను  మాంసపు ముద్దలా నీ కడుపులో ఉన్నప్పుడు
నా కోసం నువ్వు తీసుకున్న జాగ్రత్త లూ ....
అనుక్షణం నేను బయటికి ఎప్పుడు వస్తానా అని ..
నాకోసం నువ్వు ఆలొచిస్థూ గడిపిన ఎదురుచూపులు
ఈ ప్రపంచం నాకిప్పుడు తెలిసిందేమో ..
నా  రూపం లేని శరీరాన్ని నీ కడుపులో ఉంచుకుని ఒక్కో రోజు నాకు రూపం ఇస్తూ 
నన్ను మనిషిని చేసే సమయం లో నువ్వు పడ్డ ఇబ్బందులు ...
ప్రాణాన్ని గుప్పిట బిగపట్టి అనుభవించిన మానసిక ఒత్తిడులు...
ఆలోచిస్తున్నా నన్ను ఈ లోకానికి పరిచయం చేయబోతున్న రోజున 
నీ కడుపును చీల్చి నన్ను బయటికి తీసిన రోజున ప్రాణానికి తెగించి 
నా కోసం మరణం తో నువ్వు చేసిన పోరాటాలు ....
  
















అమ్మ ..
నన్ను మొదటగా ముద్దాడిన నీ పెదవులు 
ఎమవుతుందో చెప్పలేక ఏడస్తున్న నన్ను ఎలా అర్ధం చేసుకుని ఓదార్చాలో అని
నువ్వు పడ్డ ఇక్కట్లు ...
లోకాన్ని అర్ధం చేసుకోడానికి నువ్వు నేర్పిన మాటలు 
నన్ను నన్ను గా నిలబెట్టడానికి నువ్వు నేర్పిన నడకలు ...
నన్ను అందరికన్నా ముందు ఉండమని నూరిపోసిన ఉగ్గుపాల ప్రోత్సాహాలు ...
అందరితో ప్రేమించబడే లా నాకు నేర్పిన ఆత్మీయ ఆప్యాయతలు ...
మనిషిగా నాకు ఉండాలని నువ్వు నేర్పిన సంస్కారం .. మానవత్వాలు .
నాతో పాటు సహచర్యం చేసే మనుషుల పట్ల నా  భాద్యతలు 
ఎన్ని ఎన్ని ఎలా నేర్పావ్ అమ్మ .... 
అమ్మ .... 
ఇవ్వన్ని ఏ ఉపాద్యాయుడు నేర్పుతాడు .. 
ఏ మత గురువు నేర్పుతాడు .. 
ఏ బోధకుడు నేర్పుతాడు ..?? 
అది అమ్మ గా నీకు మాత్రమే తెలిసిన విద్య 
శూన్యమైన నన్ను పూర్ణంగా మలచే  శక్తి .. యుక్తి 
నీకు తప్ప ఎవరికుంది అమ్మ ?? . 
కన్న వారికోసం  నీ సుఖాలనే పట్టించుకోనంత
త్యాగం ఎవరికుంది అమ్మ ??
...............
..........
(by..mercy)
 

Wednesday, April 20, 2011

అంధకార లోయలో నేను నడిచిన వేళ
నా కాలు జారి నేను పడబోవు వేళ 
నీ వాక్యం నా పాదములకు దీపమై నన్ను కాపాడిన వేళ 
ఏమివ్వను ఏమివ్వను ఏమివ్వనయ్యా   !! 

దేవ నా స్తుతి కీర్తన అందుకోవయా .....
వేదన శోదనలు అలలై ఎగసే 
ఈ లోకసంద్రనా నేను ఈదు వేళ 
మునిగే సమయాన నీ వాక్యపు వలవేసి నన్ను పైకి లాగి 
నీ ఓడలోకి నన్ను చేర్చుకున్న వేళ
ఏమివ్వను ఏమివ్వను ఏమివ్వనయ్యా  !!

దేవ నా స్తుతి యాగం అందుకోవయా ..... 
ఏ తోడు లేక ఒంటరినై తిరుగాడగ 
లోకరణ్యంలో దారి తెన్ను గానక 
హాహాకారాలతో అపవాది నన్ను వెంటాడగా 
నీ వాక్యపు కంచవేసి సర్వాంగ కవచము నీవైన వేళ
ఏమివ్వను ఏమివ్వను ఏమివ్వనయ్యా  !!  
దేవ నా స్తోత్రర్పణ అందుకోవయా ....          ...(by ..mercy)

Tuesday, April 12, 2011

ఆహా ఏమి భాగ్యం నీ ....
ప్రేమ దొరకటం ప్రభువా ...!
ఆనవాలుగా నీ రక్తమిచ్చి 
పాపవిముక్తి చేసిన దేవా ..!!
అవని అంతా నీ దయామృతం నింపి 
అంబరం అంతా కృప చూపి 
అందులో నన్ను నిలిపితివా..!!
అమోఘం ..
అహో మహాద్భుతం నా కిచ్చిన ఈ బహుమానం ...
ఆనందించనా .. 
మరలా మరలా ఆనందించనా ...
ఆ ప్రశస్త నామ గాన మాలపించనా .. 
అభాగ్యురలైన నాకు అపూర్వ కృప చూపిన 
అద్వతీయుడా నీకు నా హృదయ పాన్పు వేయనా .. 
ఆహా మహాత్మా నా ..
హృదయ కుసుమం అర్పించనా ... !!                (by...mercy)
జ్వలించే జీవ వాక్కు చేత పట్టుకొని 
జ్యోతినై వెలుగని తామస లోకంలో 
వెలుగుతూ ఉండనిమ్మనావు దీపాలు 
పరమ తండ్రిని ప్రచురించాలన్నావు ప్రదీపాలు 
నీ అమృత వాక్కుల్ని పటించనీ 
దేహానికి దీపాలై నా కళ్ళు 
వాక్కును స్వీకరించని ఈ వాకిళ్ళు 
కుంచం తొలగించుకునే బలమివ్వు 
దీపం చక్కబెట్టుకునే వరమివ్వు 
జీవన స్థంభంపై నిల్చి వెలుగనీ ఆత్మ దీపిక 
తరుముకు వచ్చే చరమ కాలపు ఝుంఝూ మారుతంలో 
తుఫాను భీభత్సంలో 
లోకానికి వెలుగై క్రీస్తును 
ప్రకటించే మినుగురునై పరవసించనీ 
నీ మహిమాగమనపు నిరీక్షణా
శీధువు నాస్వదిస్తూ 
కళ్ళు వత్తులు చేసుకుని 
మెలుకువ కలిగి బ్రతకనీ ప్రభూ !!
వెలుగనీ స్వామీ దీపాలు ...
స్వయంభు ప్రసరించనీ
దశ దిశల సువార్త మయుఖాలు
                 by: DR. KONDEPOGU B. DAVID LIVINGSTON

Thursday, March 24, 2011

నీలా నేనెందుకు లేను 
నిన్ను చూస్తున్నప్పుడు నన్ను 
వేదిస్తున్న ప్రశ్న ,,, 
నువ్వు చేసుకున్న అదృష్టమా?
నేను చేసుకున్న దురదృష్టమా ?
అని అడగాలన్నంతగా ఎగిసే 
ఆక్రందన ?
యెద నిండా ముళ్ళున్న ఎలా నవ్వగలవని 
ముళ్లన్నీ లేక్కిన్చుకున్న భయమే లేనంత 
ధైర్యంగా ఎలా ఉండగలవని ?
రాలి పోతావని తెలిసి కూడా ఎలా 
నవ్వుతూ ఉండగాలని 
ఒక్కో రేకు రాలుతున్నా అంత ధీమా ఎక్కడ్నుంచి 
వస్తుంది అని ....   ( by mercy)

Wednesday, March 23, 2011

నీకైనా తెలుసా

కడలి లో నీటికి .....

కన్నీటి అర్ధం తెలిసేనా ?

చినుకులా కరిగే మేఘానికి అశ్రువుల ఆవేదన
అర్ధమయ్యేనా ?

కరిగిపోయే స్వప్నానికి ఎందుకింత తడబాటు ?
క్షణకాలం ఇంకా ఉండాలని ఎందుకింత తొందరపాటు ?

నీతో గడిపిన ఈ క్షణం ఇలా ఉండిపోవాలనే నా తపన

పరుగెడ్తున్నసూర్యునికి అర్ధమయ్యేనా??

నా కంటూ నేను కట్టుకున్న మన కలల ప్రపంచంలో

నీవే సూత్రదారివనే విషయం అర్ధమయినా ఎందుకింత

నటన ??
(...by mercy )

Sunday, March 20, 2011

నా హృదయ కలం నుంచి .......

మౌనం మాటున దాగిన ప్రశ్న 
మాటలకందని భాదల తృష్ణ 
మనసు మేఘంలో నిండిన అశ్రువుల అన్వేషణ
మధనానికై  వేదికేటి అనుక్షణ తీక్షణ 
మెరుపై మెరిసిందిలా కళ్ళలోన 
తెలియని  కాలం ఆగేనా ఓ క్షణం 
అది ఎరుగని గమనం అందేనా మరుక్షణం 
అందించేనా గమనం బాటసారికి నేస్తం 
సహకరించేనా ప్రకృతి ఆపక తన వైపరీత్యం 
ఒక్కసారే అశ్రువుల లావా ఎగసింది 
గుండెలోని బాధలను బ్రద్దలు చేసి
కంఠంలో వేదనను ఉక్కిరి బిక్కిరి చేసి 
మౌనాన్ని చేదించాలని శబ్దాన్ని తనలో
ఇముడ్చుకొని 
ఉవ్వేతున ఎగిసింది కంఠం హద్దుల్ని అధిగమించి 
కంటి కట్టలను త్రెంచి చెంపల మృదుత్వాన్ని తాకి 
సమాధానం వెతుక్కోగా పరిష్కార పంటను పండించగా 
జీవన భూసారం పెంచ నీటి వనరై 
నవ నాడులను కదిపే చలనపు ఆజ్యమై 
జీవిత క్రోవత్తి కాధారమైన మైనమై 
జీవన పుటలలో ముద్రించుటకు 
అనుభవాల కలంలో సిరాయై 
నన్ను దాటించగ ఆవలి తీరం 
నాకు నేర్పించగా మరో అభ్యసనం .....!!
                   సుదీర్ఘం ..!!! !!......(by mercy)

Saturday, March 19, 2011

నీ కోసం

నువ్వెవరో తెలియక సతమతమౌతున్నా 
నేను నీకేమౌతనో తెలుసుకోవాలని ...!!
అప్పుడప్పుడు అలా ప్రశ్నల ప్రవాహాలు    పోట్టేతి వస్తున్నప్పుడు ...
ఎదురు నిలువలేక 
వెను చూపలేక .... !! !! 

            నిన్ను చేరుకోవాలని పరుగెడుతూ వస్తున్నా ... నా కంటూ దారి లేకపోయినా ...
అప్పుడప్పుడు అలా నీవిచ్చే  వెసలుబాటు పల్లం వైపు  
నదిలా నన్నాపు కోలేక .....!!!
నిన్ను వదులుకోలేక  !!!!

నీతో మెప్పు పొందాలని నిరీక్షిస్తున్నా ...
నాకు నీ ఇష్టాల జాబితాలో చోటు లేదని తెలిసిన ..
అప్పుడప్పుడు నీ ఇష్టానికి అనుగుణంగా నన్ను మలుచుకునే 
ప్రతిమగా ప్రయత్నిస్తున్నా ..!!!!
నీ ఎంపికల  ఉలి దెబ్బ నన్ను  గాయపరుస్తున్నా 
నగిషీలు దిద్దుకుని నీ సొంతమవ్వాలని ...!!!!!!...(by mercy)

Friday, March 18, 2011

ఎందుకిలా ??

తెరలు తెరలుగా
అవే ప్రశ్నలు.. అలలవుతూ
మనిద్దరి మధ్య

నన్ను శోధిస్తాను
నిన్ను ప్రశ్నిస్తాను
తెలుసుకునే లోపే
మరోప్రశ్న ..
తెలుసనుకున్న దాన్ని
తిరిగి ప్రశ్నిస్తూ..
 












వృత్తంలా పరిచుంచిన
పట్టాల మధ్య, ఇది,
ముడులు విప్పుకుంటూ..
గుంటలు పూడ్చుకుంటూ..
పరుగనిపిస్తుంది ..
మనమధ్య దూరమిక
లేదనిపిస్తుంది.

ఈలోపల
నీ అస్థిత్వాన్నీ,
నా విశ్వాసాన్ని
ప్రశ్నిస్తూ.. మరో నెర్ర.

అతుకుల చక్రం సాగుతుంది
మరో అతుకుని ఆహ్వానిస్తూ..
మరో గుంటకు చోటు చేస్తూ............(..by mercy)

Friday, December 31, 2010

ఆహ్వాన క్షణాలు


గుర్తొస్తున్నాయి నీతో నేను కలిసి   నడిచిన అడుగులు ..
.నీతో కలిసి పంచుకున్న సంతోషపు క్షణాలు ...
హృదయం పొంగి ప్రవహించిన ప్రేమ ఝరులు ..
నేను రాల్చిన కన్నీటి చుక్కల అర్ధాలు 
నేర్చుకున్న జీవిత పాఠాలు..
అనునయించిన విజయ సత్యాలు 
అనుభవించిన ఆనంద ఐశ్వర్యాలు .
నిట్టూర్చిన అపహాస్యపు క్షణాలు 
విజయం కోసం ఎదురుచూస్తూ అభ్యసించిన సాహసపు పాఠాలు ...
నన్ను ఆలింగనం చేసుకున్న అనురాగ ఆప్యాయతలు 
ఆవేదనకి గురి చేసిన అనుమాన అవమానాలు 
ఇంకెన్నో.. మొత్తంగా నాకిచ్చి ...
ఇప్పుడు నూతన సంవత్సరం లోకి సాగానంపుతున్న సంవత్సరమా,,
నీకు నా వీడ్కోలు ..
ఎంతో నాకై మోసుకొస్తు అందంగా ముస్తాబై వస్తున్న 
నూతన సంవత్సరమా నీకు నా ఆహ్వాన సుమాలు ... (by mercy)
గుర్తొస్తున్నాయి నీతో నేను కలిసి   నడిచిన అడుగులు ...

నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు 
***********************
వెళ్తున్న సంవత్సరం అలా నా హృదయ ఫలకం పై
తన జ్ఞాపకాలను చెక్కింది ...
నీతో నా స్నేహం ఎంత అందమైనదో 
చెప్పకనే చెప్తున్నట్టు దానికి నగిషీలు దిద్దింది ....
వస్తున్న సంవత్సరం దాన్ని ఎక్కడ మించి పోతుందో అని ఆలోచనలో 
పడింది ....
కానీ నేస్తం రోజు రోజు కూ క్రొత్తపుంతలు  తోక్కతూ   
అంతకంతకు అందంగా తయరవ్తుంటే రోజుకే 
మన స్నేహం మీద అసూయ కలుగుతుంది చూడు ...
నీ నవ్వు కుడా అందుకు సాక్ష్య మిస్తుంది ....
నేస్తమా,,
మన స్నేహపు కొమ్మకు పూసిన ఈ సంవత్సరం రాలిపోకుండా 
మనసు పుస్తకంలో చివరి పేజి కాకుండా 
చిరునామాగా  మలిచి వాడిపోనివ్వకుండా 
మన స్నేహపు శ్వాస నింపుతా..
వికసించడానికి సిద్ధంగా ఉన్న 
నూతన వత్సర పుష్పానికి 
మన స్నేహ మాధుర్యం నింపి అందమైన స్మృతుల 
మారుతాలు...
మైమరిపించే సంతోషపు గుభాలింపులు 
మనల్ని విడిచిపోకుండా 
అందరూ మనల్ని చూసి అసుయపడేలా చూస్తా ...
నన్ను నమ్ము మన స్నేహం సాక్షిగా 
నన్ను నమ్ము రానున్న సంవత్సరం సాక్షిగా .... 
(by mercy )

Wednesday, December 15, 2010


నేస్తమా నీ కోపం ...
చల్లగా నను తాకే మలయమారుతం ...
మనసును ఆహ్లాద పరిచే భ్రమరం చేసే 
ఝుంజూ  నాదం ...
అలా పశ్చిమానికి వాలే సంధ్యా రాగం ...
అందులోంచి విచ్చుకునే జాబిలీ కుసుమం 
నేస్తమా నీ కోపం ..........
(by mercy)

Monday, October 11, 2010

మనసు మాట
























మనసు రోదన మరో మనసుకు అర్దమైతే 

మమతానురాగాలు  ఎందుకు ఏడుస్తాయి??
మంచి తనానికి ఒంటరి తనం ఎందుకుంటుంది ??
స్నేహానికి ఎడబాటు ఎందుకు మిగులుతుంది?
ఆవేదన ఆక్రోశంగా ఎందుకు రూపుదలుస్తున్ది ..?
అభిమానం అర్ధం లేనిదానిల అభాగ్యపు మాటలెందుకు 
పలుకుతుంది ??
నీ కోసం సర్వం త్యాగం చేయగలననుకునే ప్రేమ 
అవమానం పాలై దురదృష్టపు చేతుల్లో పడి శీలాన్ని 
కాపాడుకోటానికి పోరాటం ఎందుకు చేస్తుంది ...
ఆలోచించు ..!!!
మనసుకు నమ్మకమనే ఊపిరి అందించు ..
ప్రేమ గెలవడానికి నీ అభయపు 
అండనివ్వు .....నువ్వూ ...
(by mercy)

Sunday, October 10, 2010

ఏమనాలి ?నేస్తం

                                                                                                                                                                                                                                                               

నీట మునిగే కాగితపు పడవ నిజమైన పడవ కావాలనుకుంటే ఏమనాలి?
సాయంత్రం గూడుకు చేరే గువ్వ పిల్ల సూర్యుని ఆగమనడం హాస్యం కాకా ఇంకేంటి ?
వర్షపు  చినుకు చూడకుండా ఇంద్ర ధనుస్సు చూడాలనుకోవడం లో అర్దమేంటి?
పుష్పించాకుండానే  మొగ్గ  ఫలిన్చాలనుకోవడం హాస్యంకాకా ఇంకేంటి ?
నాలుగు దారుల కూడలి మద్యలో నిల్చోబెట్టి దారి కనుక్కోమనడం లో 
నీ ఉదేశ్యం ఏంటో  తెలియదు కానీ నేస్తం ....
నడిచేప్పుడు అడుగుకు అడుగై తోడు ఉంటావనుకోవడం లో నా 
స్వార్ధం ఉంది అనే మాటకి సాక్ష్యమేంటి ??      (by mercy)

Friday, August 27, 2010

miss me but let me go


When i Come to the end of the road


and the sun has set for me,

i want no rites in a gloom-filled room

Why cry for a soul set free?

Miss me a little, but not too long

And not with your head bowed low

Remember the love we once shared.

Miss me, but let me go


For this is a Journey we all must take













And each must go alone.

It's all a part of the Master's plan,

A step on the road to home.

when you are lonely and sick of heart

Go to the friend we know and bury

your sorrow in his grace

                                                                                      
Miss me but let me go..

Compiled by:
Late. Sarojini Solomon
(Found in the Naraynguda,Cemetery HYderabad,India)