నా ఆలోచనల తెరను తీసి చూడు నేస్తమా
ఏ మూలన నీవు లేవు అనగలవు ,,,
నా ఆలోచనల అణువణువులో నీవు నిండి ఉంటే ...!!!!
నా మనసు పుస్తకం తెరచి చూడు నేస్తమా ....
ఏ పుటలో నీ ముఖ చిత్రం లేదన గలవు ...
నా మనసంతా నీవుగా నిండి వుంటే...!!!!
జ్ఞాపకాల మూట ఇదిగో విప్పి చూడు నేస్తమా ,,,
ఏ వస్తువు పై నీ ముద్రలేకుండా వుందో ..!!!
ఒక్కసారి నా కను రెప్పలను అడిగి చూడు నేస్తమా ...
ఏ రోజు నీ కల లేకుండా వుందో ...అను నిత్యం నిన్ను
చూడాలని నా కళ్ళలో నిను దాచుకుంటే..!!!
నీ మనసు చెవులను పెద్దవి చేసి విను నేస్తమా..
ఏ నిమిషం నా గుండె నీ తలపు మర్చిపోయిందో..
నా గుండె చప్పుడే నీవుగా వుండి గుర్తు చేస్తుంటే ...!!!!
నేను వదిలి వచ్చిన దారుల్ని తొంగి చూడు నేస్తమా ..
నా కన్నా నీ అడుగుల గురుతులతో ,,,
నా ప్రయాణం నిండి వుంటే.....!!!!
ఏందుకని నన్ను అడగకు ..ఇంకా అర్ధమవలేదా ,,,,,,,
నీవు లేక నేను లేనని ......!!!!!!!!!! ...........(.by mercy)