Friday, December 31, 2010

ఆహ్వాన క్షణాలు


గుర్తొస్తున్నాయి నీతో నేను కలిసి   నడిచిన అడుగులు ..
.నీతో కలిసి పంచుకున్న సంతోషపు క్షణాలు ...
హృదయం పొంగి ప్రవహించిన ప్రేమ ఝరులు ..
నేను రాల్చిన కన్నీటి చుక్కల అర్ధాలు 
నేర్చుకున్న జీవిత పాఠాలు..
అనునయించిన విజయ సత్యాలు 
అనుభవించిన ఆనంద ఐశ్వర్యాలు .
నిట్టూర్చిన అపహాస్యపు క్షణాలు 
విజయం కోసం ఎదురుచూస్తూ అభ్యసించిన సాహసపు పాఠాలు ...
నన్ను ఆలింగనం చేసుకున్న అనురాగ ఆప్యాయతలు 
ఆవేదనకి గురి చేసిన అనుమాన అవమానాలు 
ఇంకెన్నో.. మొత్తంగా నాకిచ్చి ...
ఇప్పుడు నూతన సంవత్సరం లోకి సాగానంపుతున్న సంవత్సరమా,,
నీకు నా వీడ్కోలు ..
ఎంతో నాకై మోసుకొస్తు అందంగా ముస్తాబై వస్తున్న 
నూతన సంవత్సరమా నీకు నా ఆహ్వాన సుమాలు ... (by mercy)
గుర్తొస్తున్నాయి నీతో నేను కలిసి   నడిచిన అడుగులు ...

నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు 
***********************
వెళ్తున్న సంవత్సరం అలా నా హృదయ ఫలకం పై
తన జ్ఞాపకాలను చెక్కింది ...
నీతో నా స్నేహం ఎంత అందమైనదో 
చెప్పకనే చెప్తున్నట్టు దానికి నగిషీలు దిద్దింది ....
వస్తున్న సంవత్సరం దాన్ని ఎక్కడ మించి పోతుందో అని ఆలోచనలో 
పడింది ....
కానీ నేస్తం రోజు రోజు కూ క్రొత్తపుంతలు  తోక్కతూ   
అంతకంతకు అందంగా తయరవ్తుంటే రోజుకే 
మన స్నేహం మీద అసూయ కలుగుతుంది చూడు ...
నీ నవ్వు కుడా అందుకు సాక్ష్య మిస్తుంది ....
నేస్తమా,,
మన స్నేహపు కొమ్మకు పూసిన ఈ సంవత్సరం రాలిపోకుండా 
మనసు పుస్తకంలో చివరి పేజి కాకుండా 
చిరునామాగా  మలిచి వాడిపోనివ్వకుండా 
మన స్నేహపు శ్వాస నింపుతా..
వికసించడానికి సిద్ధంగా ఉన్న 
నూతన వత్సర పుష్పానికి 
మన స్నేహ మాధుర్యం నింపి అందమైన స్మృతుల 
మారుతాలు...
మైమరిపించే సంతోషపు గుభాలింపులు 
మనల్ని విడిచిపోకుండా 
అందరూ మనల్ని చూసి అసుయపడేలా చూస్తా ...
నన్ను నమ్ము మన స్నేహం సాక్షిగా 
నన్ను నమ్ము రానున్న సంవత్సరం సాక్షిగా .... 
(by mercy )

Wednesday, December 15, 2010


నేస్తమా నీ కోపం ...
చల్లగా నను తాకే మలయమారుతం ...
మనసును ఆహ్లాద పరిచే భ్రమరం చేసే 
ఝుంజూ  నాదం ...
అలా పశ్చిమానికి వాలే సంధ్యా రాగం ...
అందులోంచి విచ్చుకునే జాబిలీ కుసుమం 
నేస్తమా నీ కోపం ..........
(by mercy)

Monday, October 11, 2010

మనసు మాట
మనసు రోదన మరో మనసుకు అర్దమైతే 

మమతానురాగాలు  ఎందుకు ఏడుస్తాయి??
మంచి తనానికి ఒంటరి తనం ఎందుకుంటుంది ??
స్నేహానికి ఎడబాటు ఎందుకు మిగులుతుంది?
ఆవేదన ఆక్రోశంగా ఎందుకు రూపుదలుస్తున్ది ..?
అభిమానం అర్ధం లేనిదానిల అభాగ్యపు మాటలెందుకు 
పలుకుతుంది ??
నీ కోసం సర్వం త్యాగం చేయగలననుకునే ప్రేమ 
అవమానం పాలై దురదృష్టపు చేతుల్లో పడి శీలాన్ని 
కాపాడుకోటానికి పోరాటం ఎందుకు చేస్తుంది ...
ఆలోచించు ..!!!
మనసుకు నమ్మకమనే ఊపిరి అందించు ..
ప్రేమ గెలవడానికి నీ అభయపు 
అండనివ్వు .....నువ్వూ ...
(by mercy)

Sunday, October 10, 2010

ఏమనాలి ?నేస్తం

                                                                                                                                                                                                                                                               

నీట మునిగే కాగితపు పడవ నిజమైన పడవ కావాలనుకుంటే ఏమనాలి?
సాయంత్రం గూడుకు చేరే గువ్వ పిల్ల సూర్యుని ఆగమనడం హాస్యం కాకా ఇంకేంటి ?
వర్షపు  చినుకు చూడకుండా ఇంద్ర ధనుస్సు చూడాలనుకోవడం లో అర్దమేంటి?
పుష్పించాకుండానే  మొగ్గ  ఫలిన్చాలనుకోవడం హాస్యంకాకా ఇంకేంటి ?
నాలుగు దారుల కూడలి మద్యలో నిల్చోబెట్టి దారి కనుక్కోమనడం లో 
నీ ఉదేశ్యం ఏంటో  తెలియదు కానీ నేస్తం ....
నడిచేప్పుడు అడుగుకు అడుగై తోడు ఉంటావనుకోవడం లో నా 
స్వార్ధం ఉంది అనే మాటకి సాక్ష్యమేంటి ??      (by mercy)

Friday, August 27, 2010

miss me but let me go


When i Come to the end of the road


and the sun has set for me,

i want no rites in a gloom-filled room

Why cry for a soul set free?

Miss me a little, but not too long

And not with your head bowed low

Remember the love we once shared.

Miss me, but let me go


For this is a Journey we all must take

And each must go alone.

It's all a part of the Master's plan,

A step on the road to home.

when you are lonely and sick of heart

Go to the friend we know and bury

your sorrow in his grace

                                                                                      
Miss me but let me go..

Compiled by:
Late. Sarojini Solomon
(Found in the Naraynguda,Cemetery HYderabad,India)

Friday, July 30, 2010

my favourit love story

A girl and a boy loved each other
when ever they decided to meet boy comed late
but Girl never complained ...
.....
.....
...........
..................
one day they came to know that Girl is having brain tumor and
she is going to live just for few days......

.....
.....
next day boy committed suicide and left a letter for the girl
"" hey my love i know when ever we decided to meet ..i have been late
and you alwaz waited for me but now i have decided to meet you in
heaven but this time its my turn to wait....""

Tuesday, July 27, 2010

nireekshisthuuuu...

గొంతెత్తి అరిచింది హృదయవీణ 
తన తంత్రువులను సవరించమని ....
ఆర్దత అణగారిపోయిన హృదయాలలో 
ప్రోత్సహపు చేయూత తిరిగి నింపబడాలని ...
ముందుకు కదులుతున్న వేళ అడ్డుకున్న రాళ్ళు 
రప్పలను తొలగించే ఆపన్న హస్తం కావాలని ...
అడుగంటిన ఆశలను పునరుజ్జీవింప చేయటానికి 
కనిపించని దైవమే కదలిరవాలని .....
ఎవరికోసమో ..ఎందుకోసమో ...ఏ స్వాంతన కోసమో 
ఆతురత తో ఎదురు చూస్తున్న ...
నలిగిన, విరిగిన ,కృంగిన ,కరిగిన,చెదిరిన ,
హృదయానికి నేన్నున్నాను  అనే ...
తోడు కావాలని ...
ఆ రోజు రావాలని ....
   ఎదురుచుస్తూ .............!!!!!!! (by mercy)

nannu adugu

విడిపోవటం అంటే ఏంటని..
మేఘం నుండి వర్షిస్తున్న చినుకు నడుగు ...!!
విరహం అంటే ఏంటని పుప్పొడి బరువుతో నేల కొరుగుతూ 
ఇంకా భ్రమరానికై ఎదురుచూసే పువ్వు నడుగు ..!!!
మౌనం అంటే ఏంటని 
అడవి కాసిన వెన్నల నడుగు ...!!
అమృతం  అంటే ఏంటని ఐదు రోజులుగా ఆకలితో 
ఉన్న కడుపు నడుగు...!!
ప్రేమంటే  ఏంటని చెంపలపై జారుతూ 
                                 ఓదార్పుకై ఎదురు చూసే  కన్నీరునడుగు ..!!
త్యాగమంటే ఏంటని తన శరీరాన్ని కాల్చుకునే కోవత్తి నడుగు ..!!
అనుమానం అంటే ఏంటని ...
అనుమానం అటే ఏంటని ....
ముక్కలు ముక్కలుగా పగిలి పోయిన నా హృదయాన్ని అడుగు ..!!!
(by mercy) 

Monday, July 26, 2010

nee premaa

నా ప్రాణంగా మారిన నా ప్రియతమా ..
నా జీవితానికి అర్ధం నీ ప్రేమా ...
నా కనులలో విరజిమ్మే ..
ఆనందపు కాంతికి కారణం నీ ప్రేమ....!!!
నా కలలకి రూపం నీ ప్రేమ ...
నా మెదడులోన మెదిలే ఆలోచనలు నీ ప్రేమ ...!!
నా మనసులోని భావనలకి ప్రాణం పోసింది నీ ప్రేమ ..
నన్ను నీవును చేసింది నువ్వు నా పైన చూపిన నీ ప్రేమ..
కను రెప్ప వాల్చు క్షణమైనా మరువను నేను నీ ప్రేమ ...
నా చివరి శ్వాస వదిలే వరకు కావలి నాకు నీ ప్రేమ...!!          (by mercy)

Sunday, July 25, 2010

priya nuvvekkada

            హృదయంలో అలజడి
            ప్రతి అడుగులో సవ్వడి
            ఆలోచన ప్రవాహపు ఒరవడి
            అడిగింది నువ్వేకడని ..??.!!!
            మోము పై దరహాసం
           కళ్ళలోన ఉతేజ్జం
           మనసులోని మమకారం
           వెతికాయి నువ్వేకడని ?? ...!!
           ఆలోచన మేఘాల మాటున
           ఆనందపు లోయలోన
           అగుపడని ప్రేమ తోటలోన
           వెతికి వెతికి వేసారి ..!!!
            అలసి పోయా ప్రియా ...నీ కోసం ....
            అలసి పోయా ప్రియా ..నీ కోసం ....!!!
            అగుపడగ రావా నా కోసం......
           అగుపడగ రావా నా కోసం .....!!!!(by mercy)

naa aeduru chupu

నీ కోసం నా ఎదురు చూపు  నిరాశను మిగిల్చింది ..
ఎంతో ముస్తాబయి నీ కోసం వెళ్ళింది అన్నీపోగొట్టుకున్న దానిలా
మళ్లీ నా దగ్గరకొచ్చింది ....!!!
అందరికి అందని నిన్ను అందుకోవలనుకుంది ...
అందలం అందనంత ఎతునుంటుందని తెలిసి కూడా
మరిచిపోయింది..!!
ఆశల పల్లకిని నీ కోసం సిద్ధం చేసుకుంది ...
అది  ఆవిరై పోతుంటే చూసి రోదిస్తుంది ...!!
విశ్వవ్యాప్తం అనుకున్న నిన్ను హృదయంలో
ఉంచుకోవలనుకొని శ్వాసించింది...
వేడి నిట్తుర్పై బయటకు వస్తున్న నిన్ను వదిలి వేయలేక ..
ప్రాణం కోల్పోతున్నంతగా తల్లడిల్లుతుంది...
ఇక చాలు ఈ పరీక్ష దానికి...
ఇక చాలు ఈ పరీక్ష ఎదురుచుపుకి ..
జీవించేలా నీ కౌగిలినివ్వు ..జీవించేలా నీ కౌగిలి నివ్వు
నా నిరీక్షణకీ .........  (by mercy)

nee swaram

మనసు మేఘాన్ని మదించి
అమృత వర్షం కురిపిస్తుంది నీ స్వరం ....
ఒంటరి మనస్సు సంద్రానికి అలల రాగాలను నేర్పి
నిశబ్దమనే తీరాన్ని సప్త స్వరాల సాక్షిగా కనుమరుగు
చేస్తుంది నీ స్వరం ......!!!
రోజంతా రణగొణ ధ్వనులు విని అలసిన చెవులకు
పిల్లన గ్రోవిలా నాద స్వరం లా సేద తీరుస్తుంది నీ స్వరం ..!!!
అందమైన రాగామలికతో రేయి పగలుకు వారధి వేస్తుంది నీ స్వరం ..!!
అందుకే నా చెవులను చూసి కనులు అసూయ పడుతున్నాయి ...
నేస్తం ..
నన్ను నమ్ము ఇది  నిజం ....
నేస్తం నన్ను నమ్ము ఇది నిజం ఈ రాతిరి నీ స్వరానికి దాసోహం ........!!!(... by mercy)

vijayam kosam

దెబ్బలు తినాల్సివస్తుందని భయపడితే
అంత మంచి ఫలాలను వృక్షం ఇవ్వలేదు ......
ఎన్ని కొండలూ ,,లోయలూ,, రాళ్ళు ,, రప్పలూ,,,,, ,,
శరీరాన్ని సగంగా  బందిస్తున్నరూ ప్రవహిన్చనని  నది అనుకుంటే ...
జీవకోటికి మనుగడ లేదు ......
కతిరించొద్దు భాదేస్తుందని ...అరచి అడ్డగిస్తే ...అంత మంచి పుష్పాలు
మన కంట పడవు .....
సహించలేను ,,,తాలలేను,,దెబ్బలను   అని  ఉలికి భయపడి శిల అడ్డుకుంటే ...
అందరితో అలా ప్రశంసించబడలేదు ......
భరించు భాదని ఆనందంగా భావించి ...
సహించు నిరుస్త్సహాన్ని ఆశయానికి ఆజ్యమనీ .....
మొలకెత్తనీ అసహ్యన్నీ సాధించిన విజయమని ....
నవ్వనీ విజయం ....నీ గెలుపు విని .........
(...by mercy)

Thursday, July 1, 2010

ఈ రాత్రి


నిశీధిలో నేను
చీకటితో జతకట్టి ......
చంద్రుడితో రాత్రి వృక్షం క్రింద నిల్చొని
నక్షత్రపు పూలను తెంపి
నీకు పుష్పగుచ్చంగా పంపుదామని
ప్రయత్నిస్తున్నా .....
కొంచెంసేపు నీ నిదుర చెలియను నిన్ను
చేరోద్దని చెప్పు నేస్తం ....!!!!!!!!..
ఇదో శుభరాత్రి అనే బుట్టనిండా
కలల పుష్పాలను తీసుకుని జాబిలీ బయల్దేరింది
వాటిని ఆస్వాదించటం
మర్చిపోకేం ....!!!!!!! (by mercy)

రాజశేఖర రెడ్డికి అంకితం

అదో
హర్షిస్తున్న ఆకాశం
రాజ నక్షత్రం చేరికతో
ద్విగునీకృతమైన
దాని అందం ..

అదో
ప్రేమ వనంలో చోటుచేసుకున్న
విషాదం
తోటమాలి ఇక లేడే అని
విచ్చుకున్న కుసుమాలు
విలపిస్తూ చేస్తున్న గానం

అదో 
పేద హృదయ  ఆలయం
నీవు చూపిన
ప్రేమ చిహ్నంగా మారిన వైనం ...
అదో  
అభిమాని గళం
నీవెలా వెళ్లిపోగలవని
చేస్తున్న ఆర్తనాదం .....

అదో  
ఆగిన గుండెల స్వరం
నీకోసమే మేమంటూ
నీవెంటే అయినాయి పయనం .......

అదో
ఆంద్ర ప్రజల నయనం
ఆపుకోలేక
ఉప్పొంగుతున్న
శోక సంద్రం ....

అదో
నల్లమల అరణ్యం
విధికి తలవంచి నందుకు
చరిత్రలో మిగిలిపోయే అంతగా
పొందుతున్నాయి చీత్కారం ...
.
ఇదో
నా ప్రియమైన ఆదర్శం ..
ఇకపై నీవుగా
నీలా ఉండాలనే తాపత్రయం ...
అందుకే
అందుకో జోహారుల సమర్పణం
ఏమి చేయలేని నిస్సహాయులం
అందిస్తాం నీకు జల యజ్ఞ ఫలం
నీ ఆదర్శాల అడుగుల వెంటే సాగిస్తాం
ప్రయాణం
అందిస్తాం నివాళిగా ...........
హరితాంధ్ర రాష్ట్రం .......                             (by mercy)

నాలో నేను

 


                          భూమిని ముద్దాడడానికి సూర్యుడు సంధ్యారాగాన్ని ఆలపిస్తూ పశ్చిమంగా వాలుతుంటే...ఎగిరి ఎగిరి గువ్వలు గూళ్ళు చేరుతుంటే ...
అలా చీకటి దుప్పట్లోకి ప్రకృతి కాంత దూరిపోతుంటే..
విచ్చుకుంటున్న మల్లెలు గుప్పుమని సుగంధపు నవ్వులు రువ్వుతుంటే ...
జాబిలీ జిలుగులు నింపుకుని సెలయేళ్ళు అందాన్ని ఆవిష్కరిస్తుంటే ...
ఏమి తెలియని బాటసారిలా నేను మాత్రం ..
శూన్యాన్ని గమనిస్తున్నా .౧!!!!!...
స్వరాలూ తెలియక పోయినా కోయిల పాడేరాగం ..
తొలకరి వర్షం చేసే భూమి చుంబనం ..
అందమైన రంగులను తనలో నింపుకుని ఇంద్రధనసు చేసే ....హర్శగానం ..
పచ్చదనం చుట్టుకొని భూమి ముస్తబవుతున్నప్పుడు ..
ప్రక్రుత్రి ఆలపించే వసంత గానం
ఏవి వినలేక గతం తోనే సాగిస్తున్నా ,,శూన్యప్రయానమ్ ...(.by mercy)

Wednesday, June 30, 2010

నీ కోపం .......మంచు తెరను చీల్చే రవికిరణం వెచ్చదనం .....
పసరికతో పిల్లగాలి చేసే నర్తనం .....
విరబూసిన పుష్పంపై కురిసే అమృతవర్షం ....
మనసు వినువీధిలో రెక్కలు తొడిగి ఏగిరే
సంతోషపు సౌరభం
అంత అందమైనది నీ కోపమైతే
ఎందుకు చూడాలనిపించదు నేస్తమా ....
దాన్ని అనుక్షణం .....
ప్రతిక్షణం ....       (by mercy)