Wednesday, October 26, 2011

నా దృష్టిలో ప్రేమ

ప్రస్తుతం నా దృష్టిలో ప్రేమ అనే అర్ధం ఏంటంటే ...
-" నాకేం వస్తుందని అలోచించి మొదలయ్యే ..
అవకాశ పూరిత ఆకర్షణకు లోనైనా హృదయాల ..
కలయికకాక పోయిన ,కలయిక అనే పేరుతో ..
భ్రమలో వుండే ఒక స్థితి .."
అందుకే దాన్ని నా దరి చేరనివ్వదు అనుకుంటున్నా .....
(by mercy)

Tuesday, October 25, 2011

ఇక సెలవు

హృదయాన్ని కోయడం ఎలాగో నీ నుంచే 
తెలుసు కోవాలి ....!!
చెప్పే మాట  ప్రతీది హృదయం లో నుంచి 
వస్తున్దంటావు గా ...!!
మరి వచ్చే ప్రతి మాట వెనక దాని ఉద్దేశాని 
అర్ధం చేసుకోలేనంత వెర్రి దాన్ని కాదు కదా !!
ఎవరు ఆరిపోతున్న దివ్వేని వెలిగించ మన్నారు ...??
ఎవరు కలలే తెలియని నా కనులకి కలలు నేర్పించామన్నారు ??
ఎవరు నా ప్రయాణం లో నా బాటసారిగా నా వెంట రమ్మన్నారు ??
అడిగితే సమాదానం కూడా చెప్పలేని నిన్ను నేను ఎందుకు 
నా మనసులోకి అనుమతిచ్చాను ??
ఇప్పుడు బాధపడ్డం వల్ల ప్రయోజనం లేదని తెలుసు ...
కాని దిద్దుకోడాని సమయం దాటిపోలేదని అర్ధం చేస్కున్నాను ...
ఇది చెపుదామనే ఇక్కడున్నాను ...
చెప్పానుగా ఇక సెలవు తీస్కుంటున్నాను ....
నీ జీవితం నీదే ఎప్పుడైనా ... నాది చేయమని అదగలెదూ ...
కానీ నాదని చెప్పిన మనసును ఇంకేవరికోసమో ఆలోచించేట్టు 
చేయడం జీర్నిన్చుకోలేను ....అందుకే  ఇరుకైన నీ మనసునుంచి
స్వచ్చందంగా తప్పుకోవలనుకుంటూన్నాను ....

Saturday, October 22, 2011

నీ ప్రశ్న

నన్నెందుకు అని ప్రశ్నించే నువ్వు ...
నిన్ను నువ్వెందుకు ప్రశ్నిన్చుకొవూ ...??
అలా తనపై పడిన తొలి చినుకు 
చిగురును ప్రశ్నిస్తుందా...??
నిన్ను తాకగానే ఎందుకు పులకరించావని ..??
చినుకు చిగురును ప్రశ్నిస్తుందా..??
నా లోనే ఎందుకు పడ్డావని స్వాతి చినుకుని
 ముత్యపు చిప్ప ప్రశ్నిస్తుందా.. ??
నన్ను పదే పదే ఎందుకు తాకుతున్నావని..
తీరం సముద్రాన్ని ప్రశ్నిస్తుందా ..??
ఆవిరై మేఘాన్ని చేరిన నీరు, వర్షమై 
విడిపోతూ మేఘాన్ని ప్రశ్నిస్తుందా ?
ఇప్పుడెందుకు నాకు వీడ్కోలు చెప్పడానికి వచ్చావని 
ఇంద్ర ధన్నుసు వర్షం ప్రశ్నిస్తుందా ..??
నువ్వ్వెందుకు కూస్తున్నవని వసంతం కోయిలను 
ప్రశ్నిస్తుందా ,...??
నీ రాగం ఎందుకు పాడాలని కోయిల వసంతాన్ని ప్రశ్నిస్తుందా??
అన్నీప్రశ్నలతోనే ముడి పెడితే 
నీకు నేనెలా సమాధానం చెప్పేది ??
నన్ను ప్రశ్నగా మిగల్చకుండా 
సమాధానమై నాకు జంటగా నువ్వెప్పుడు నిలిచేది ??
నీవడిగే ప్రతి ప్రశ్నకి ప్రతిబింబం నువ్వే అని నేను చెప్పే సమాధానాన్ని ..
వినమని నీకెలా చెప్పేది ??.....
(by mercy ...)

Thursday, October 20, 2011

నా గాయం

నా  గాయం 

నాకు కూడా  ఒక   అంతముందని తెలుసు...

నేను కూడా  జీవితపు  చివరిమెట్టు  .. ఎక్కుతానని  

తెల్సూ ..

నా  జీవితపు  పాట చివరి  చరణపు  చివరి  అక్షం  

వరకు  

పాడుతా  నని  తెలసు...
.
నా  జీవితపు  పుస్తకపు  చివరి  పేజి   వరకు  

రాయాలని  తెలుసు  చదవాలని  తెల్సూ ..

కానీ  ఈ  నా  ప్రయాణం  లో  వెనకకి  తిరిగి  చూస్తే 

 ఏదో  ఒక  మూలాన   ..

ఏదో  ఒక  ముద్రలో  .. నీ  జ్ఞాపకాల  గుర్తులతో  నా  

గుండెలో  గాయాన్ని


గుచ్చి   గుచ్చి   భాదించి   గాయాన్ని  మననివ్వని  తెలసు 
 .
..
నువ్వు  చేసిన  గాయానికి  .. నువ్వే  మందు  అని  తెల్సి  కూడా  ... 

నీ  సహాయం  అర్దించలేని  నిస్సహాయతతో  ...