Friday, November 30, 2012

ఏకాంతపు దారి
అడుగుకు అడుగుకు మధ్య
గతమై మిగులుతూ ,
మరో అడుగుతో జోడించుకుంటూ
నీవు లేని క్షణాలు మిగిలిపోని
ఏకాంతపు దారిలా .. (12/11/2012)కంటి నిండా నింపుకున్నా
ఆకాశాన్ని ..
అప్పుడు నేను
ఒంటరి
ఇప్పుడు నువ్వొచ్చావ్
ఆకాశం
కరిగిపోతూ కారుతుంది
నీలి రంగై
సిరాగా మారి రాస్తుంది
నా దారి పొడుగునా ..
నీ పేరు నా తోడై


 1/12/2012ప్రస్తుతానికి నీ తోడుని
కలిసి నడవనీ నీతో కడదాకా
అడుగుల కింద పరుచుకున్న

l ఆక్రమణ ll by Mercy Margaret

నీ పేరుపొగలు పోగలుగా నీపేరు

నా పెదాల వనాలను పలకరిస్తుంది
వింటున్నావా ?
* * * * *
జీవితపు మలుపు చివర నీ పేరే
నాకు మజిలీ అయి కనిపిస్తుంది 
* * * * * 
ఉదయం పొగ మంచులోంచి ఒక కిరణం 
నీ పేరేనా ?
నా కళ్ళను పొడుస్తూ నిన్ను వెతికేలా 
నా మెలుకువవుతుంది 
నువ్వే నా ఆలోచన ఊటవా ?
* * * * * 
నా గాయానికీ నువ్వు బాగానే పరిచయం 
నువ్వు కనబడగానే స్రవిస్తున్న రక్తంతో 
నీ పేరును కలవరిస్తుంది 
ఔషదమనా ?? లేక ఆరొపిస్తూనా ??
* * * * * * 


నా గమ్యం నువ్వేనా ?

(16/11/20)

ఒంటరితనం అంటే నువ్వే

నా ఒంటరితనపు అద్దంలో

నీ ముఖం ప్రత్యక్షమవుతూ
ఒంటరితనమంటే నువ్వు
అంటూ
క్రొత్త నిర్వచనం ఏదో నేర్పుతుంది

నన్ను నేను సరి చేసుకుంటూ
నాలో నేను తొంగిచూసుకుంటానా ...!?
నువ్వు 
ఒక నవ్వు ఎర వేసి 
నన్ను అక్కడే చిక్కుకునేలా చేసేప్పుడు 
నీ ముఖంలోని ఆనందం
నా కళ్లని నీ ప్రేమతో నింపి,
కనురెప్పలకిందే సాక్షమై కూర్చుని 
భయపెట్టే మలినాన్ని 
కడిగేస్తుంది
ఇక నేను 
ఆలోచనల్లో దారి తప్పిన ప్రతిసారి
చెవులగుండా నీ ప్రభుత్వాన్ని పంపి
నన్ను నీ అజమాయిషి కిందకి తెచ్చుకుంటావ్
అప్పుడు నీ ఆజ్ఞలు నాకు కరదీపికలవుతాయి
ఇదిగో ఇలాగే
నా చేతి గీతల్లో 
నీవై నిండిన 
నా భవిష్యత్ రాతల్లా
నా పెదాల ఉద్యానవనం ఆస్వాదించే 
నవ్వుల పొగమంచులా 
 (17/112012) 
ప్రియమైన ....

నువ్వు గుర్తొచ్చినప్పుడు 
గోడ వైపు మరలుతాను కాని 
నా కన్నీళ్లు తుడిచేందుకు గోడకి చేతులు లేవుగా
వినడం తప్ప ఏం చేయగలదు 

ఎదో రాయాలని మొదలు పెట్టిన ప్రతి సారి 
మనసు నీ ఆలోచనలని తింటూ 
మళ్ళీ నా వైపు ఎగిరిరానంటుంది


అందుకే దానితో నేను అక్కడే ఉండిపోతాను

నీ జ్ఞాపకపు ఇంటి తలుపు తడుతూ 

నువ్వు రాసిన ప్రతి పదాన్ని 
పది సార్లు చదువుతుంటాను .. 
చదివినంత సేపు నా ప్రక్కనే ఉండి రాసిన క్షణాలు 
గుర్తుచేసుకుంటూ ..

చూసి చూసి జ్వారానికి జాలేసింది మరి 
అందుకే నన్ను కౌగలించుకుని 
నిన్ను మరిపిస్తూ ఈ లేఖ రాయిస్తుంది 
ఎదురు చూపులతో 
అందుకోగానే సమాధానం ఇస్తావు కదూ 
-------------- by Mercy Margaret (17/11/2012 ) --------------------

నన్ను నేను తోడుకుంటూ

రెక్కలొచ్చిన సాయత్రం 
చీకటి గూటికి చేరుతుంది 
చీకటి పొదిగిన సూరీడు 
ఉదయపు కాంతులీనుతాడు 

పచ్చగా నవ్వుతుంది నేల
ఆవిరి మంచు ఉదయాన్నే తనలో చేరగానే 
ఆకు రాల్చుతూ చెట్టు


నిటారుగా నిల్చొని ప్రతి పరిస్థితి ఎదుర్కుంటూ

మళ్ళీ యవ్వనం వస్తుందని ఎదురు చూస్తూ క్రొత్త రాగం ఏదో 
అభ్యసిస్తూ 

మట్టినంతా రేణువులుగా జల్లెడ పడుతుంది చీమల దండు , 
ఏ వాసనను పసిగట్టి సంభాషిస్తూ ముందుకు కదులుతాయో
ఏదో బడిలో కూర్చుని నిర్వహణా పాఠాలు నేర్చుకున్నట్టు 

వీటన్నిటిని చూస్తూ నేను 
కొన్ని పాఠాలు నేర్చుకుంటాను 
నానుంచి నన్ను బయటికి తోడుకుంటూ 
ఎవన్నా భావాలని కాచి వడబోసి 
కాగితంపై రంగులద్దగలనా అని 
జీవితపు పరిశ్రమలో 
లాభాలతో మనసు ఖాతాని సంతోషాన్ని 
సమం చేసి ముగించాలని 


(18/11/2012) 

ఆత్రుత

అక్కడ

ఓ మూలాన కూర్చున్న ఆలోచన 
కలంలో అక్షరాలని ఒద్దికగా నింపుతుంది 

ఆ కాగితం 
తనపై పరుచుకోబోయే భావాలకై ముస్తాబవుతూ 
రెప రెపల రాగం ఆలపిస్తుంది పుస్తకం లోని నెమలీక మెల్లిగా నవ్వుతూ 

కాగితంతో సరాగాలాలపిస్తుంటే 


సన్నగా నవ్వుతూ ఆలోచన 
చేతి వేళ్ళకు అంటుకున్న అక్షరాలను తుడుచుకుంటూ 
జిడ్డుగా ఆ వేళ్ళకు అంటుకున్న వాటిని 
పరీక్షగా చూస్తుంది 

అవి 
నీపేరు లోని అక్షరాలే 
చేతి వేళ్ళకు అంటుకొని అలా వేలాడుతూ 
మరో మధుర కావ్యం నీకై బహూకరించేందుకు 
వేళ్ళతో సరసాలడుతున్నాయి ..

(18/11/2012)

ఏం చేయను ?నా నిదురెత్తుకెళ్ళి నీ కలలిచ్చి పోతావ్ 
ఏం చేయను ? 
నీ ఆలోచనల్లో జోగుతూ నేనుంటా 
ఎత్తుకెళ్ళిన నిద్రను అనుభవిస్తూ నువ్వు ..
నన్ను 
ఏదో ఒకటి మాట్లాడమంటూ నా కనురెప్పలకి 
కవితలు చదవడం నేర్పిస్తావ్ 


కవితంటే ఏంటో ఇంతవరకు నాకు తెలియనే తెలియదు 

నీతో మాట్లాడాల్సినవన్ని వరుసగా రాస్తానా ..!?
ఆ పిచ్చి రాతలే నాకు నిద్రకు బదులుగా దొరికిన 
ప్రత్యామన్యాయాలు 

అప్పుడనిపిస్తుంది . . . .

సరిగ్గా ఇలాగే నిదురోతున్న నీ కళ్ళవైపు చూస్తూ 
శ్వాస పలకరింపుల మధ్య 
భావాలను వెతుక్కుంటూ జోల పాట నొసటిపై నొక్కుతుంటే 
అదే నాకు కవితేమోనని 
నీ నవ్వునంతా గంధంలా నా ఒంటికి రాసుకోవడమే కవితేమోనని 

ఇంకా అర్ధాన్ని వెతుకుతూ 
నీ నిదుర తెర ఈవల నిలబడి నీ మెలకువకై 
మంచులో తడుస్తూ నిల్చున్నా 
ఒక సారి ఉదయమే నన్ను చూడు ఘనీభావింఛి పోయిన వేళ 
నాకోసం వస్తావు కదూ 
 (18/11/2012 ) 

సమ్మె చేస్తున్న గాయం

కన్నీళ్లలో కళ్లు కడుక్కున్న తరువాత 
తలపై బరువు తీసి పక్కకు పెట్టి


ఒక్కో ఆలోచనా వలయం నుండి 
మనసును దూకిస్తూ 
ఆటలాడి అలసిన 
నేను మంచుతుంపరలై కురుస్తున్న ఎడబాటులో
నీ జ్ఞాపకపు దుప్పటిని చుట్టుకుని
మనం ఎప్పుడూ కూర్చునే 
ఈ చెట్టు కిందే 
చంద్రునికి కబురులు చెబుతూ పొగ మంచు
కదిలిపొతుంటే 

నాతో 
నువ్వు వదిలి వెళ్లిన నీ నీడ
ఆ చీకట్లో కలిసి ఎక్కడుందో అని 
వెదకడానికి 
ఈ సమయంలో ఇక్కడికొచ్చా 

కళ్లు తేటగా కనిపిస్తున్నా 
పాదాలకు నీ తోడుకావాలనే
తపనెక్కువై పరుగెట్టి వస్తుంటే 
అపుడెప్పుడో నువ్వు విసిరి పారెసిన 
అనుమానపు ముల్లు 
ఇప్పుడు నా పాదంలో ఇలా
గుచ్చుకుంది 
అదే ఈ గాయం 

నీ చూపుతో నా గాయాన్ని తడిమే వరకు 
మానను అని సమ్మె చేస్తుంటే 
నీకు కబురు పంపుతున్నా
అందిన వెంటనే
వస్తావు కదూ ...
 (28/11/2012)

ఈ ఆలాపన


ll విజ్ఞప్తి ll 

-------
ఆ అద్దాల వెనక నుండి
బయటకొచ్చి చూడనీ 


ఒకటే రంగుతో  ఎంత కాలం 

లోకం ఇదే అని చూపిస్తావ్ ??
అబద్దాన్ని నిజాన్ని ఒకేలా 
ఎంత కాలం చూడమంటావ్ ??


ఈ కళ్ళను   కూడా జీవించనీ ..

-----( 29/11/2012)-----ll కొన్ని క్షణాలు ll 
--------------
కొన్ని క్షణాలను
నీ జ్ఞాపకాలలో కాల్చా 


గాలిలో పొగలుగా కలిసి 

కళ్లలో దూరి


కంటి పొరలలో దాచుకున్న

నీవైన కొన్ని చిత్రాలను తడిమి


కన్నీళ్లై

ముత్యాలు రాలుతున్నాయి


ఇవిగో నీ దొసిలి పట్టు

--- (28/11/2012)-- ll ఈ ఆలాపన ll 

-----------------

రాయి పాడుతుంధని ఆశ్చర్యమా !
ఏమి చేయను మరి ?
ఒంటరి తనపు ఉలిపై
జ్ఞాపకాల దెబ్బలు వేస్తుంటే 
గుండె శిల్పంగా మారుతూ చేస్తున్న రోదనే 
ఇధి ..

---- (28/11/2011)---

మరో పెట్టె

ఉదయం 
మరో ఖాళీ పెట్టెతో వచ్చింది 

మొదలు పెట్టు 
ఏమేమి ఆ పెట్టెలో 
నీకోసం ఎన్నుకొని నింపుకోబోతున్నావో 

జీవితానికి నువ్వేమి ఇవ్వబోతున్నావోజీవితం నుంచి ఏమి ఆశిస్తున్నావో 


జీవించబోతున్నావో 
జీవితాన్ని ఈడ్చుకుపోతున్నావో

జీవితపు దారిలో దొరికే ప్రతిదాన్ని 
ఎలా ఎన్నుకోబోతున్నావో ..!!?

 ( 30/11/202)

అనగనగా ...

గాలి భుజాలెక్కి
అది చెప్పే మామ కధలు వింటూ
అడుగులు లెక్కేసుకుంటూ

పగిలిన అద్దంలో ఇక తనను చూడలేక
ఎన్ని నిద్రలో వెల చెల్లిస్తే చీకటికి
ఇన్నాళ్ళకి తన చోటికి తీసుకెళ్ళింది

చలువ ముద్దలా
బోసినవ్వులు నవ్వుతూ చేయి చాపగానే
చేతి నిండా నిండిన తనని తీసుకుని
చుక్కలకి చిక్కకుండా
మేఘాలలో దాక్కుంటూ , రాలుతున్న నక్షత్రాలకు సెలవని చెబుతూ
వలస పక్షుల కళ్ళు కప్పి
మొత్తానికి ఇంటి దారి పట్టానా ..!!

వీధి మూలన ఇంట్లో
చిన్ని తల్లి
పాలబువ్వోద్దని అద్దంలో నాలాగే వెతుకుతూ

ఏడుపు మాన్పించ లేక అమ్మని, తన చేతిలోని బువ్వని
ఏడ్పిస్తుంటే
భద్రంగా ఇన్ని రోజులు నేను ప్రయాస పడి తెచ్చుకున్న
నాదే అనుకున్న నా చందమామను తన చేతుల్లో పెట్టా

ఇప్పుడు
నా దోసిలి నిండా మెరుస్తూ
" నన్ను- నాకు " మళ్ళీ పరిచయం చేసిన తన నవ్వును తీసుకొని
తన పెదాలకంటుకున్న పాల బువ్వ ఇలా నా బుగ్గలపై సంతకంగా
నా పసితనం సంపాదించుకుని తిరిగొచ్చా ..


--------------------------- by Mercy Margaret (29/11/2012)--------

Friday, November 23, 2012

చీకటిసంద్రం


చీకటి నీటిపై తేలియాడుతూ
గమ్యం ఎరుగని ఆలోచనొకటి 
ఎన్ని సంభాషణల  మూటలు నింపుకొని 
ప్రయాణమయ్యిందో 

గతం వీస్తుండగా 
ఆ  హోరు గాలిలో 
తీరం చేరే మార్గమే లేక 
సంభాషణలన్నిటిని చీకటి 
సంద్రంలోకి విసిరేస్తూ 
తనని తానూ తేలిక చేసుకునే ప్రయత్నం 
చేస్తుంది 

విధి వెలుగును చంపితే 
చీకటంతా దాన్ని పీల్చేసుకుని
ఆలోచనల్లో 
" నేను " ని కూడా వంచిస్తుంటే , మతి లేక చీకటి తోనే 
సహాజీవనం చేస్తూ 
దిక్సూచి లేక 
చీకటి సంద్రంలో చీకటికే ఆవిరైపోయే 
స్థితికొచ్చింది 

తడుముతూ ఆ మూలాన కూర్చున్న 
"నేను " కు
ఒక మూట చేతికి తగిలి
ముడులు విప్పిన మూట నుంచి 
ఆత్మవిశ్వాసం ఒక్క సారి పేలి " నేను " వెలిగించిందిచీకటి నీటిపై ప్రజ్వలిస్తూ

ఆలోచనలకు
గమ్యం ,దారి వెతుక్కొని
చీకటిని మండించి వెలుగు సంద్రంగా మార్చింది"నేను "

లక్ష్యం ఉద్దేశం నెరవేరింది
ఆ వెలుగును చూస్తూఇంకెన్ని ఆలోచనలో
చీకటి నుండి వెలుగు వైపుకు
by -mercy margaret


Friday, November 9, 2012

ఒక పరిచయం ముగుస్తూనే


ఒక పరిచయం ముగుస్తూనే
రెండు
అపరిచిత ఆకులను కుడుతూ
పూచిన పువ్వు రాలిపోతూ
సంభందపు సుగంధాన్ని
గుర్తుగా మిగిల్చి పోతుందిఒక పరిచయం ముగుస్తూనే

పగలు నుండి రాత్రిని
వేరు చేసె కవ్వమేదో
మనసుని చిలికి 
జ్ఞాపకాల వెన్నని చేతిలో 
చంద్రుని ముద్దగా ఇచ్చి  పోతుందిఒక పరిచయం ముగుస్తూనే 

తలుపులను మూసినా 
ఖాలీ  సందులనుంచి ప్రయానిస్తూ 
ఒక రాగం మూసిన చెవుల గోడలను కూల్చుతూ 
అందమైన అందమైన ఉద్యానవనాలను 
చెవులకు వేలాడదీస్తుంది ఒక పరిచయం ముగింపు ..
ముగింపు కాదది 

మరో జన్మ కోసం 
అడుగులు వేస్తున్న ఆత్మ తపస్సు 
మూసుకు పోయిన కళ్ళ వెనక కధలు రచిస్తూ 
గాలితో జతకట్టి 
హృదయాన్ని స్పృశిస్తుంది వెలిగించిన దీపాలుఈ సాయంకాలానా 
వెలిగించిన దీపాలను వదిలి 
నీ మాటల గాలి నన్ను తాకిందని
వెతుకుతూ ఇలా
బయల్దేరివచ్చాను

కనిపించిన వెలుగుదారుల్లో
ప్రతి పువ్వుకూ 


ఒక ఉత్తరం రాస్తూ
ప్రతి దానిపై నీ పేరట నా చిరునామా
రాసి వదిలి వచ్చాను

నా ఒంటికంటుకున్న
పరిమళం
ఎక్కడో నీవు వెదజల్లుతూ వెళ్లిన ప్రేమదేనని
నా ఒంటరితనాన్ని
వెలిగించిన దీపాలకే
వదిలి వచ్చాను

ఇప్పుడైనా నా ముందుకు వస్తావా
ఇంకా బాటసారిగా మిగిలిపోలేను
మన రాక కోసం ఎదురుచూస్తున్న దీపాలకు
ఇంకా నిరీక్షణ నూనెను పోస్తూ
ఆవిరవలేను

-------by Mercy Margaret (5/11/2012)---------------

Sunday, November 4, 2012

నాకూ దోస్తులున్నారు


నేను 
ఎగురుతున్న పక్షి రెక్కల్లోని ఈకల్లోంచి 
ఒక్కొక్కటిగా రాలిపడుతున్న 
స్వేచ్చను 


ఒకేసారి కుప్పకూలను 

అలా అయితే 
పక్షికి నా మీద నమ్మకం ఉండదుగా 


అందుకే 

ఔన్సులు ఔన్సులుగా చేదును సేవిస్తూ 
ప్రేమని అన్ని పరిస్థితుల రుచులతో 
అలవాటు చేసుకుంటాను 


ఆ వీది చివర 

ఒంటరినై నిలబడకుండా 
నా చుట్టూ 
చెట్లు , చెరువు 
గూటిలో గువ్వ ,నీటిలో చేప , రాలిపడ్డ మువ్వ ,
ఎండి అల్లరి చేసే రాలిన ఆకు 
సంధ్యావేళ  చీకటి దుప్పటి నిండా నక్షత్రాలని 
నింపుకొచ్చే చంద్రుడు 

చాలు ఇక లెవ్వమంటూ నిదుర తెరను తొలగించి
సుప్రభాతం పాడే సూరీడు ,

రెప రెప లాడుతూ తరిగిపోతున్న జీవితాన్ని గుర్తు చేసే 
క్యాలెండరు ,
సరిదిద్దుకో మరో అవకాశం వచ్చిందంటూ పిలిచే 
అద్దం ,
గుర్ర్ మంటూ నీ ఒంటరి పాటను వినే శ్రోతని నేనే అని 
అరిచే అటక మీద కిటకీ వెనకే ఉండే పావురం 
ఇవ్వన్నీ నా నేస్తాలే 


తెరచి ఉన్న పుస్తకంలో

నేను నీలాగే ఏకాకిని స్నేహం చేద్దాం రా 
ఇవ్వాల్టి  నిన్ను ఈ పుస్తకం పై ఆవిష్కరించుకో 
అంటూ పిలిచే కలం 
అది నా ప్రియమైన నేస్తం 


అప్పుడప్పుడనిపిస్తుంది 

నేను నా కలం ఒకటేనేమో అని 
సిరా లాంటి ఆత్మతో నన్ను నేను లిఖించుకుంటూ 
ఉంటానని .... 

Friday, November 2, 2012

సాహసమే కదూ ...
కన్నీళ్లన్నీ
ఆకాశాన్ని చేరి
నక్షత్రాలలోని నిన్ను వెతుకుతూ
అమావాస్యనాటి చీకట్లను కడిగి
నిన్ను వెతికి తెస్తాయట
సాహసమే చేస్తున్నాయి కదూ ....!!

నాది స్వార్ధమేనాఎప్పటినుంచో వెంటతీసుకెళ్లాలనీ
నాతో ఉంచేసుకోవాలని
చిన్నతనం నుంచే తనంటే ప్రేమ మరీ
కానీ .. తనకి నాతో
రావడం .....????

అందుకే కబుర్లన్ని చెపుతున్నా
ఎమన్నా అంటేప్రేమలో పక్షపాతం ఉందనిఅదో ఆ పత్తి రైతు పిలుస్తున్నాడంటూ


-"ప్రేమిస్తున్నా
నీరాకకై ఎదురుచూస్తున్నానంటూ"..
ఎన్ని అక్షరాల పూలు కలిపి
భావాల దారంతో
కవితల మాలల్లి
బహూకరించే ప్రయత్నం చేస్తున్నానో
అయినా రాదే!?

నీలాంటి ప్రేమికులు నాకెక్కువే
వారి ప్రేమ ఘాడతని తూకమేసినా
ప్రశ్నల త్రాసు త్రాళ్లు
తెగిపోయెలా ఉన్నాయి
ఏం చేయను ??
అని సమాధానం ఇస్తుంది

నువ్వూ నిందించు పర్లేదు

-" ఏంచేయను మరి
నోటిని పలకరింఛే ఆ అయిదు వేళ్లంటే
నాకిష్టం
భూమిని తల్లినిగా భావించి ఆకలి కడుపులకై
ఆలోచించే ఆ గుండెలు నాకిష్టం
ప్రకృతికి హాని చేయకుండా పచ్చదనం ఇష్టపడే
పసితనపు హృదయాలిష్టం
సర్వజనుల క్షేమం కోరి నన్ను ప్రేమగా
పిలిచే వారి స్వరాలిష్టం  "..
ఎలా రాను అంటూ ??

గబ గబా
కురవడానికి  నన్నిలాగే వదిలి 
బయలుదేరింది
వర్షం