Thursday, March 24, 2011

నీలా నేనెందుకు లేను 
నిన్ను చూస్తున్నప్పుడు నన్ను 
వేదిస్తున్న ప్రశ్న ,,, 
నువ్వు చేసుకున్న అదృష్టమా?
నేను చేసుకున్న దురదృష్టమా ?
అని అడగాలన్నంతగా ఎగిసే 
ఆక్రందన ?
యెద నిండా ముళ్ళున్న ఎలా నవ్వగలవని 
ముళ్లన్నీ లేక్కిన్చుకున్న భయమే లేనంత 
ధైర్యంగా ఎలా ఉండగలవని ?
రాలి పోతావని తెలిసి కూడా ఎలా 
నవ్వుతూ ఉండగాలని 
ఒక్కో రేకు రాలుతున్నా అంత ధీమా ఎక్కడ్నుంచి 
వస్తుంది అని ....   ( by mercy)

Wednesday, March 23, 2011

నీకైనా తెలుసా

కడలి లో నీటికి .....

కన్నీటి అర్ధం తెలిసేనా ?

చినుకులా కరిగే మేఘానికి అశ్రువుల ఆవేదన
అర్ధమయ్యేనా ?

కరిగిపోయే స్వప్నానికి ఎందుకింత తడబాటు ?
క్షణకాలం ఇంకా ఉండాలని ఎందుకింత తొందరపాటు ?

నీతో గడిపిన ఈ క్షణం ఇలా ఉండిపోవాలనే నా తపన

పరుగెడ్తున్నసూర్యునికి అర్ధమయ్యేనా??

నా కంటూ నేను కట్టుకున్న మన కలల ప్రపంచంలో

నీవే సూత్రదారివనే విషయం అర్ధమయినా ఎందుకింత

నటన ??
(...by mercy )

Sunday, March 20, 2011

నా హృదయ కలం నుంచి .......

మౌనం మాటున దాగిన ప్రశ్న 
మాటలకందని భాదల తృష్ణ 
మనసు మేఘంలో నిండిన అశ్రువుల అన్వేషణ
మధనానికై  వేదికేటి అనుక్షణ తీక్షణ 
మెరుపై మెరిసిందిలా కళ్ళలోన 
తెలియని  కాలం ఆగేనా ఓ క్షణం 
అది ఎరుగని గమనం అందేనా మరుక్షణం 
అందించేనా గమనం బాటసారికి నేస్తం 
సహకరించేనా ప్రకృతి ఆపక తన వైపరీత్యం 
ఒక్కసారే అశ్రువుల లావా ఎగసింది 
గుండెలోని బాధలను బ్రద్దలు చేసి
కంఠంలో వేదనను ఉక్కిరి బిక్కిరి చేసి 
మౌనాన్ని చేదించాలని శబ్దాన్ని తనలో
ఇముడ్చుకొని 
ఉవ్వేతున ఎగిసింది కంఠం హద్దుల్ని అధిగమించి 
కంటి కట్టలను త్రెంచి చెంపల మృదుత్వాన్ని తాకి 
సమాధానం వెతుక్కోగా పరిష్కార పంటను పండించగా 
జీవన భూసారం పెంచ నీటి వనరై 
నవ నాడులను కదిపే చలనపు ఆజ్యమై 
జీవిత క్రోవత్తి కాధారమైన మైనమై 
జీవన పుటలలో ముద్రించుటకు 
అనుభవాల కలంలో సిరాయై 
నన్ను దాటించగ ఆవలి తీరం 
నాకు నేర్పించగా మరో అభ్యసనం .....!!
                   సుదీర్ఘం ..!!! !!......(by mercy)

Saturday, March 19, 2011

నీ కోసం

నువ్వెవరో తెలియక సతమతమౌతున్నా 
నేను నీకేమౌతనో తెలుసుకోవాలని ...!!
అప్పుడప్పుడు అలా ప్రశ్నల ప్రవాహాలు    పోట్టేతి వస్తున్నప్పుడు ...
ఎదురు నిలువలేక 
వెను చూపలేక .... !! !! 

            నిన్ను చేరుకోవాలని పరుగెడుతూ వస్తున్నా ... నా కంటూ దారి లేకపోయినా ...
అప్పుడప్పుడు అలా నీవిచ్చే  వెసలుబాటు పల్లం వైపు  
నదిలా నన్నాపు కోలేక .....!!!
నిన్ను వదులుకోలేక  !!!!

నీతో మెప్పు పొందాలని నిరీక్షిస్తున్నా ...
నాకు నీ ఇష్టాల జాబితాలో చోటు లేదని తెలిసిన ..
అప్పుడప్పుడు నీ ఇష్టానికి అనుగుణంగా నన్ను మలుచుకునే 
ప్రతిమగా ప్రయత్నిస్తున్నా ..!!!!
నీ ఎంపికల  ఉలి దెబ్బ నన్ను  గాయపరుస్తున్నా 
నగిషీలు దిద్దుకుని నీ సొంతమవ్వాలని ...!!!!!!...(by mercy)

Friday, March 18, 2011

ఎందుకిలా ??

తెరలు తెరలుగా
అవే ప్రశ్నలు.. అలలవుతూ
మనిద్దరి మధ్య

నన్ను శోధిస్తాను
నిన్ను ప్రశ్నిస్తాను
తెలుసుకునే లోపే
మరోప్రశ్న ..
తెలుసనుకున్న దాన్ని
తిరిగి ప్రశ్నిస్తూ..
 
వృత్తంలా పరిచుంచిన
పట్టాల మధ్య, ఇది,
ముడులు విప్పుకుంటూ..
గుంటలు పూడ్చుకుంటూ..
పరుగనిపిస్తుంది ..
మనమధ్య దూరమిక
లేదనిపిస్తుంది.

ఈలోపల
నీ అస్థిత్వాన్నీ,
నా విశ్వాసాన్ని
ప్రశ్నిస్తూ.. మరో నెర్ర.

అతుకుల చక్రం సాగుతుంది
మరో అతుకుని ఆహ్వానిస్తూ..
మరో గుంటకు చోటు చేస్తూ............(..by mercy)