Saturday, December 29, 2012

"అమానత్ " స్వరం



ఏంటి ఏంటి ఏంటి 
ఈ శబ్దం ??
ఏంటి ఏంటి ఏంటి 
ఈ మూలుగు ??
ఏంటి ఏంటి ఏంటి 
ఎక్కడిది ఈ రోదన ??

ఏడుస్తూ మొరపెడుతున్న  రక్తం 
ఆవేదనతో ఆక్రందనతో 
బస్సు సాక్షిగా 
మండుతున్న ఆత్మతో 
విలపిస్తున్న రక్తం 

పోగేసుకున్న ఆశలు 
కట్టుకున్న భవిష్యత్ కలలు 
కామాందుల చేతుల్లో కాలి బూడిడైతే 
ఆ బూడిదలోని అణువణువునుంచి 
వినిపిస్తున్న ఆత్మ రోదనం 

నరకాసురులు  
నలుదిక్కులనుంచి వచ్చి పడతారని తెలియక 
ఆడపిల్లగా పుట్టించినందుకు 
ఆ క్షణం 
ఆ క్షణం 
దేవుణ్ణి ప్రశించకుండా ఆగలేక పోయిన 
అభాగ్యురాలి స్వరం 

ఆడపిల్లంటే దేహమే చూసి 
రాక్షసుల్నుండి అత్యాచారంతో పాటు చావు చేతుల్లో చిక్కి  

ఒక్కో అవయవం పని మానుకుంటూ చావు కౌగిల్లో 
బిగుసుకుంటుంటే 
చావుతో పోరాడుతూ న్యాయం కోసం 
తనకు సంసోనులా ఒక అవకాశం ఇమ్మని 
విన్నవిన్చుకుందేమో దీనంగా ఆ స్వరం 

ఇక ఇప్పుడు రాలిన తన కన్నీరు 
ఆయుదాలై మొలకెత్తితే 
కామంతో నిండిన ప్రతి కన్నుబూడిదయ్యే వరకు 
వదలదు 
అసభ్య సామాజన్ని సరి చేసే వరకు విడువదు 
కామపిశాచుల గుహ్యవయవాలను ఖండించేవరకు 
ఊరుకోదిక ఆ  కన్నీటిలోని ప్రతి  రక్తపు అణువు 

ఇప్పుడు 
కన్నీరు కార్చి అయ్యో అనకండి
మా అక్కో చెల్లో  తల్లో  కాదు కదాని తప్పుకు పోయే సమయం కాదిది 
తల్లి దండ్రులారా  
వీలయితే మీ కొడుకులకు  స్త్రీలను గౌరవించడం నేర్పండని  
ఎలుగెత్తి ఏడుస్తూ ఉద్ఘోషిస్తన్నట్టుంది 
"అమానత్ " స్వరం 


(డిల్లి గ్యాంగ్ రేప్ తర్వాత వైద్యం పొందుతూ సింగపూర్ హాస్పిటల్ లో చనిపోయిన "అమానత్  / నిర్భయ /దామిని  " కి అశ్రునివాలి ఘటిస్తూ ... (29/12/2012)