ఎలాగోలాగ
ఇలాగే ఇలాగే
ఈ రాత్రిలాగే నిలిచిపోవాలి
నిట్టనిలువునా ?? నేలమట్టంగానా ??
భూప్రపంచ కాగితంపై ఎక్స్ యాక్సిసో , వై యాక్సిస్ల లాగానో ?
ఎటైనా ఈ రాత్రినెత్తుకెళ్ళి పునాదుల్లో కప్పేసి
ఈ రోజునిక్కడే ఆగిపోనివ్వండి
ఏదో ఒక మంత్రమేయండి
యే రాక్షసున్నోపంపి సూర్యున్ని రాకుండా మింగేయమనండి
లేదా ఈ రాత్రి నెవరైనా అపహరించుకెళ్ళి ఇష్టమొచ్చినంత
అనుభవించనీయండి
కాని
ఈ రాత్రినిలాగే నిలిచిపోనివ్వండి
ఈ రాత్రి కొందరికి అప్సరస
ఇంకొందరికి అడవి తేనెతుట్టె
కవిత్వరసం పంచే తుంటరి ప్రేమిక
మరి కొందరికి తమ మొహం పై జారిన
ఆకాశపు పయిట
కాని, నాకెందుకో ఈ రాత్రిని
నా ఇంటి తలుపు లోపలే బంధించి ఉంచాలనుంది
సూర్యుడ్ని ఎవరైనా ఆకాశమంత గొంగలిలో కప్పెట్టేస్తే
ప్రశాంతంగా నిదురపోవాలనుంది
ఆ క్యాలెండర్ ని చుట్ట చుట్టి పడేయండి
అసలంకేలూ రోజుల లెక్కలే లేకుండా చేయండి
కనుల రెప్పలమీద నెలల నాట్యాలను ఈ రాత్రితో పాటే
మోసుకెళ్ళండి
ఉదయమయ్యిందో
వాడొస్తాడు .. ఇంటి అద్దె అడుగుతాడు
తాను లేస్తుంది రోజు చెప్పినట్టే ఇంటి లెక్కల చిట్టా ముందుంచుతుంది
వాళ్లొస్తారు పోస్ట్ డేటడ్ చెక్ అడుగుతారు
పిల్లలు లేచి ఈ వారమైన బయటికి తీసుకెళ్తావా నాన్న??
అన్నట్టు చూస్తారు
ఒక్క విషయం
నాకు రాత్రంటే ప్రేమ కాదు
ఉదయమంటే భయం లేదు
కాని ఫలితం లేని ఇంకో రోజున నా వాళ్ళను
నిరాశపర్చలేను
నాతో అల్లుకు పోయిన వాళ్ళ కలల మొక్కలకు
నీళ్ళు పోసి ఎరువేయలేని నన్ను ఊహించుకోలేను
నేను తండ్రిని .. నేను తండ్రిని