Wednesday, December 28, 2011

నా కనులకు ప్రేమ పొరలు కమ్మాయి
నీవు తప్ప వేరే ఏది కనిపించకుండా 
నా గుండె కి నీ మాటల  సెగ తగిలింది 
ఇంకే మాటలు చల్ల బరచ లేనంత ..!!


నేను ఆనందంగా ఉండడం 
నీకిష్టం లేదు కదా.. 
అయిన తప్పు నీది కాదు 
నా మనసు మీద నా అధికారం 
నీకు ఇవ్వడం తప్పు 
ఇప్పుడు అది నన్ను నువ్వెవరని 
ప్రశ్నిస్తుంది .. !!


నీ కళ్ళలో కాంతి కోసం 
నేను తపన పడడం కాదు 
నా కళ్ళల్లో కన్నీరు నిన్ను
 చూడమనడం  కోసం 
తపసు చేయమంటుంధీ ..


నీకు ..నీ మనసుకు 
అర్ధమయ్యే భాష ఏదో 
చెప్తావా .. జీవిత కాలం
పట్టినా నేర్చుకుంటాను .... 
నీకు అర్ధమయ్యేలా 
నా మనో వ్యధ అర్ధమయ్యేలా 
 చెప్పాలని.. ...!!!

Tuesday, December 27, 2011

నిన్ను నీ ఇష్ట ప్రకారంగానే 
వదిలేయాలని నిర్ణయించుకున్నాను !!!!
అయినా ఇరుకుగా భావించే నా హృదయం లో
నిన్ను పెట్టడం ద్వార నిన్ను ఇబ్బంది 
పెడుతున్నానేమో.. 
క్షమించు ...
రెక్కలు విరిచి నాతోనే నిన్ను
ఉంచుకోవాలని నా ఉద్దేశ్యం కాదు 
నా ప్రేమను పంజరంలా భావించేవరకు 
ఇబ్బంది పెడుతున్నానని 
అనుకోలేదు ...
హృదయాన్ని కోవెల చేసానని అనుకున్నా 
కాని ....
నువ్వు భయపడే  రక్తపు లోగిలిలో ఉంచానని 
 అనుకునేంత భయపడుతున్నావని 
అనుకోలేదు ....
క్షమించు .....
నీకు కాంతిని అవ్వడం  కోసం ఎదురు చూస్తూ కాలిపోయే 
క్రోవ్వత్తిని అవుదామనుకున్నాకానీ 
నిప్పులాంటి నా ప్రేమన్ను 
నిన్ను కాలుస్తున్న అగ్ని 
అనుకుంటున్నా వను కోలేదు ...
క్షమించు ...
కన్నీటితో నీ దారిని శుభ్రం 
చేశా నిర్భయంగా వెళ్ళు ...
వెనక్కి తిరిగి చూడకు ....
మళ్లీ నీకు దగ్గర అవ్వాలనిపిస్తుందేమో ....
నీ సంతోషం కోసం నా ప్రేమ 
మోడు బారిన ... నీ ప్రేమ చిగురులు 
చూసి సంతోషించే ..
నీ ప్రేమ పిపాసిని ..... 

Monday, December 26, 2011



నువ్వైన కాంతి 
నువ్వెక్కడో వున్నావ్
అయిన నా ప్రక్కనే వున్నటువుంటావ్ 
నువ్వెప్పుడు నన్ను పట్టించుకోవు
అయినా నా మనసులో నీ కోసం ఆత్రుత ఆగదు
నీ వైపు నడిచే నా మనసు అడుగులకు
ఏన్ని వేల మైళ్ళు వేళ్ళలో తెలియదు
ఎందుకంటే అన్ని వేల మైళ్ళ దూరంలో 
నీ మనసును నాకు దూరంగా తీసుకేల్లావ్
అయినా పర్లేదు నీ మనసు అడుగులో అడుగు వేస్తూ
నిన్ను చేరేంత ఓపిక నాకుంది 
నువ్వు నా వైపు చూడక పోయిన 
నీ దృష్టి నా వైపు మల్లెంత వరకు  
నువ్వైన కాంతి నన్ను చేరేవరకు
ఒంటరి తనపు చీకటి లో ఎదురు చూసే
సహనం సాహసం నాకుంది .. 

Monday, December 5, 2011

ఒక సారి పిలిచా పలకను అన్నావ్
మరో సారి పిలవాలని వున్నా 
పిలవలేని అసహాయత ...
నువ్వు నీ మనసు చెవులను
మూసుకొని 
నా మాటలను వినను అని మొండి
చేస్తే ...
ఏమి చేయలేని  నిస్సహాయత 


ప్రశ్నించే అధికారం 
నాకివ్వలేదు 
సమాదానం చెప్పే 
సమయం ఇవ్వట్లేదు 
తప్పు నీదా?? 
నాదా అని ఆలోచించే 
విచక్షణను కూడా నువ్వే
లాగేసుకొని ఇలా నన్ను 
ఒంటరిని చేయడం 
ఎంత వరకు న్యాయం ??


నీ మొండి తనం నా 
మనసును గాయం చేస్తే
నీ మౌనం నా మనసును 
శిక్షిస్తే ... 
వీక్షకుడిలా నీ నటన ప్రపంచానికి 
నచ్చినా .. 
నన్ను బాధించే భయంకర శిక్ష మాత్రం 
నువ్వు కనుగొన్నావనే ..
నీ ఆనందం లో నువ్వు మునిగిపోయి 
హాయిగా నన్ను చూసి నవ్వుకుంటూన్నావ్ ...


నీ సమయం .. నీ మొండితనం 
ముందు నేను ఇప్పుడు ఓడిపోయనేమో
కానీ నాది అయిన సమయం రాక పోదు
కానీ ఆ సమయం వచ్చే లోపు నా మనసు 
నీకు వేల మైళ్ళ దూరం వెళ్ళిపోయి 
నీ ఊసే మర్చిపోతుందేమో అని నా భయం


నీ మొండి తనం గెలిచింది అనుకుంటున్నావ్
నా నమ్మకం ఓడిందని నేను అనుకుంటున్నాను 
ఏది గెలుపో .. నువ్వు గ్రహించే సమయం కోసం 
ఈ ఎదురు చూపు .... !!!!



Saturday, December 3, 2011

నువ్వు నాకు చెందవని తెలుసు 
అయినా కూడా ఆశించాను..
నీ హృదయం లో 
ఎక్కడో ఒక మూలన
నా పై ఎప్పుడో ఒకప్పుడు 
ప్రేమ పుడుతుందని


నువ్వు నాకు చెందవని తెలుసు 
అయినాకూడా మనసు పడ్డాను
ఎప్పుడో ఒకప్పుడు 
నావైపు నీ దృష్టి మరలుతుంది 
ప్రేమ పుట్టిస్తుందని ...


నువ్వు నాకు చెందవని తెలుసు
అయినా కూడా వగచాను 
ఎప్పుడో ఒకప్పుడు జాలితో నైనా
నన్ను దరి చేరనిస్తావని 


నువ్వు నాకు చెందవని తెలుసు 
కాని ఆశించడం మానుకోలేను 
జీవితం అంతా  నీ జ్ఞాపకాలతోనే 
గడిపేంత సాహసం నేను చేయగలను
ఎందుకంటే
ఏదో ఒక రోజు నన్ను నీవు 
కోల్పోయవనే భావన 
నీకు కలుగక పోదని ..
నా ప్రేమకు నువ్వు కరిగిపోయే 
రోజు వస్తుందని .....!!
(by Mercy )