ఆహా ఏమి భాగ్యం నీ ....
ప్రేమ దొరకటం ప్రభువా ...!
ఆనవాలుగా నీ రక్తమిచ్చి
పాపవిముక్తి చేసిన దేవా ..!!
అవని అంతా నీ దయామృతం నింపి
అంబరం అంతా కృప చూపి
అందులో నన్ను నిలిపితివా..!!
అమోఘం ..
అహో మహాద్భుతం నా కిచ్చిన ఈ బహుమానం ...
ఆనందించనా ..
మరలా మరలా ఆనందించనా ...
ఆ ప్రశస్త నామ గాన మాలపించనా ..
అభాగ్యురలైన నాకు అపూర్వ కృప చూపిన
అద్వతీయుడా నీకు నా హృదయ పాన్పు వేయనా ..
ఆహా మహాత్మా నా ..
హృదయ కుసుమం అర్పించనా ... !! (by...mercy)