జ్వలించే జీవ వాక్కు చేత పట్టుకొని
జ్యోతినై వెలుగని తామస లోకంలో
వెలుగుతూ ఉండనిమ్మనావు దీపాలు
పరమ తండ్రిని ప్రచురించాలన్నావు ప్రదీపాలు
నీ అమృత వాక్కుల్ని పటించనీ
దేహానికి దీపాలై నా కళ్ళు
వాక్కును స్వీకరించని ఈ వాకిళ్ళు
కుంచం తొలగించుకునే బలమివ్వు
దీపం చక్కబెట్టుకునే వరమివ్వు
జీవన స్థంభంపై నిల్చి వెలుగనీ ఆత్మ దీపిక
తరుముకు వచ్చే చరమ కాలపు ఝుంఝూ మారుతంలో
తుఫాను భీభత్సంలో
లోకానికి వెలుగై క్రీస్తును
ప్రకటించే మినుగురునై పరవసించనీ
నీ మహిమాగమనపు నిరీక్షణా
శీధువు నాస్వదిస్తూ
కళ్ళు వత్తులు చేసుకుని
మెలుకువ కలిగి బ్రతకనీ ప్రభూ !!
వెలుగనీ స్వామీ దీపాలు ...
స్వయంభు ప్రసరించనీ
దశ దిశల సువార్త మయుఖాలు
by: DR. KONDEPOGU B. DAVID LIVINGSTON