నన్నెందుకు అని ప్రశ్నించే నువ్వు ...
నిన్ను నువ్వెందుకు ప్రశ్నిన్చుకొవూ ...??
అలా తనపై పడిన తొలి చినుకు
చిగురును ప్రశ్నిస్తుందా...??
నిన్ను తాకగానే ఎందుకు పులకరించావని ..??
చినుకు చిగురును ప్రశ్నిస్తుందా..??
నా లోనే ఎందుకు పడ్డావని స్వాతి చినుకుని
ముత్యపు చిప్ప ప్రశ్నిస్తుందా.. ??
నన్ను పదే పదే ఎందుకు తాకుతున్నావని..
తీరం సముద్రాన్ని ప్రశ్నిస్తుందా ..??
ఆవిరై మేఘాన్ని చేరిన నీరు, వర్షమై
విడిపోతూ మేఘాన్ని ప్రశ్నిస్తుందా ?
ఇప్పుడెందుకు నాకు వీడ్కోలు చెప్పడానికి వచ్చావని
ఇంద్ర ధన్నుసు వర్షం ప్రశ్నిస్తుందా ..??
నువ్వ్వెందుకు కూస్తున్నవని వసంతం కోయిలను
ప్రశ్నిస్తుందా ,...??
నీ రాగం ఎందుకు పాడాలని కోయిల వసంతాన్ని ప్రశ్నిస్తుందా??
అన్నీప్రశ్నలతోనే ముడి పెడితే
నీకు నేనెలా సమాధానం చెప్పేది ??
నన్ను ప్రశ్నగా మిగల్చకుండా
సమాధానమై నాకు జంటగా నువ్వెప్పుడు నిలిచేది ??
నీవడిగే ప్రతి ప్రశ్నకి ప్రతిబింబం నువ్వే అని నేను చెప్పే సమాధానాన్ని ..
వినమని నీకెలా చెప్పేది ??.....
(by mercy ...)