నా గాయం
నాకు కూడా ఒక అంతముందని తెలుసు...
నేను కూడా జీవితపు చివరిమెట్టు .. ఎక్కుతానని
తెల్సూ ..
నా జీవితపు పాట చివరి చరణపు చివరి అక్షం
వరకు
పాడుతా నని తెలసు...
.
నా జీవితపు పుస్తకపు చివరి పేజి వరకు
రాయాలని తెలుసు చదవాలని తెల్సూ ..
కానీ ఈ నా ప్రయాణం లో వెనకకి తిరిగి చూస్తే
ఏదో ఒక మూలాన ..
ఏదో ఒక ముద్రలో .. నీ జ్ఞాపకాల గుర్తులతో నా
గుండెలో గాయాన్ని
గుచ్చి గుచ్చి భాదించి గాయాన్ని మననివ్వని తెలసు
.
..
నువ్వు చేసిన గాయానికి .. నువ్వే మందు అని తెల్సి కూడా ...
నీ సహాయం అర్దించలేని నిస్సహాయతతో ...