తెలుసు కోవాలి ....!!
చెప్పే మాట ప్రతీది హృదయం లో నుంచి
వస్తున్దంటావు గా ...!!
మరి వచ్చే ప్రతి మాట వెనక దాని ఉద్దేశాని
అర్ధం చేసుకోలేనంత వెర్రి దాన్ని కాదు కదా !!
ఎవరు ఆరిపోతున్న దివ్వేని వెలిగించ మన్నారు ...??
ఎవరు కలలే తెలియని నా కనులకి కలలు నేర్పించామన్నారు ??
ఎవరు నా ప్రయాణం లో నా బాటసారిగా నా వెంట రమ్మన్నారు ??
అడిగితే సమాదానం కూడా చెప్పలేని నిన్ను నేను ఎందుకు
నా మనసులోకి అనుమతిచ్చాను ??
ఇప్పుడు బాధపడ్డం వల్ల ప్రయోజనం లేదని తెలుసు ...
కాని దిద్దుకోడాని సమయం దాటిపోలేదని అర్ధం చేస్కున్నాను ...
ఇది చెపుదామనే ఇక్కడున్నాను ...
చెప్పానుగా ఇక సెలవు తీస్కుంటున్నాను ....
నీ జీవితం నీదే ఎప్పుడైనా ... నాది చేయమని అదగలెదూ ...
కానీ నాదని చెప్పిన మనసును ఇంకేవరికోసమో ఆలోచించేట్టు
చేయడం జీర్నిన్చుకోలేను ....అందుకే ఇరుకైన నీ మనసునుంచి
స్వచ్చందంగా తప్పుకోవలనుకుంటూన్నాను ....