Wednesday, February 29, 2012

ఆకులా రాలి పోతున్నా .. 


ఇకనైనా నన్ను తాకవా చల్లగా 


మోడులా మిగిలిపోతున్న


ఇకనైనా నన్ను చేరవ తొలకరిలా 


.
దావానంలా దహిస్తున్న నీ ఎడబాటు నా హృదయాన్ని...



నీ ప్రేమ వర్షం తో తడపవా ?



దూరమవుతున్నా తూరుపుకు పడమరలా 



దూరాన్ని నీ ప్రేమ దారంతో జోడించవా ?



ఆవిరవుతున్న ఆశలను మేఘమై బిగపట్టి 



తిరిగి క్రొత్త వెల్లువలా కురిపించవా?!


గుచ్చుతున్నా నీ ప్రేమ బాణాలు

గుండె గాయానికి  మందు నీవు కావా ?

Sunday, February 12, 2012

ముళ్ళ పొదను కుడా పూతీగలా 
అల్లుకు పోవడమే ప్రేమేమో ..!!?
నటిస్తున్నావని  తెలిసిన 
జీర్ణించుకుని ..మార్పులేకుండా 
నీతో ఉండడమే ప్రేమేమో ..!!?
మోసం చేస్తున్నావని తెలిసినా 
వెనక్కి తగ్గకుండా నీతోనే వుండడం 
ప్రేమేమో ...!! ?
నమ్మకాన్ని వమ్ము చేసావని తెలిసినా 
మళ్లీ అదే నమ్మకంతో నిన్ను హత్తుకోవడం 
ప్రేమేమో ...!! ??
హింసించి అయినా
నా ప్రేమ పొందుకోవాలనుకోవడమే 
నీ దృష్టిలో ప్రేమేమో !!?
నాకు అర్ధం కానీ ప్రతిది ..
అర్ధం చేసుకునే అవసరం లేకుండా 
నీ చుట్టూ నా మనుసుని తిప్పుకునేదే నీ ప్రేమేమో ..!?

Thursday, February 9, 2012

నా కలలకి పై పై మెరుపులు దిద్దుతున్నా 
అందంగా కనిపించాలని ...
దీనంగా నేలకి మొహం వేసుకున్న వాటికీ 
అబద్దపు ఆనందం అయినా ఇవ్వాలని ..

నా కలలు నీ చిరునామాకి పంపించనా ...?
ఎందుకంటే నా కలల్లో 
నాకన్నా నువ్వే ఎక్కువున్నావ్ ..!!

నా కలలు నీ కలలతో కలుస్తాయట
నేనేం తక్కువ చేసానో నాకు తెలియదు 
నీ పేరుతో జతగా గుర్తింపు కావాలని 
వాటి ఆశ మరి ఏమంటావ్ ??

కలలు కాలంతో కరిగి పోకుండా 
నా నిచ్వసతో కలిసి ఆవిరి అవకుండా 
నీ తోడు కౌగిలిని వాటికిస్తావా ?
నా కలలకు ఊపిరిని అందిస్తావా ??

Sunday, February 5, 2012

కలల దుకాణం తెరిచే వేళయ్యింది 
నిద్రకు ..
ఏ కల ఎంతకు దొరుకుతుందో ..??
నా ప్రశాంతత వెల చెల్లించాలా ?? లేక 
నా సంతోషాన్ని వెలగా చెల్లించాలా ?
నా కోరికల్ని ఈ దుకాణం లో కొంటే 
ఎంతవుతుందో ..?
నాకు సంబందించిన మనుషుల్ని 
కొనాలంటే ఎంత అవుతుందో ?
సమాదానం .. సంతోషాలకు 
ఎంతవుతుందో ..?
కలుషితం లేని నిద్రకి ఎంత ఇవ్వాలో 
కలత చెందించని కలకు ఎంత ఇవ్వాలో ??
నిజ జీవితం కన్నా ... కలలోనే నా లోకం
బాగున్నట్టుంది ...
అందుకే కలల దుకాణం ఇంత పొంగిపోతుంది ...
బలవంతంగా నా కళ్ళను కూడా మూసేస్తుంది 

Friday, February 3, 2012

నా కళ్ళకి నువ్వు గుర్తొచ్చి మాట్లాడం మొదలెట్టాయ్
అందుకే గోడవైపుకు తిరిగా ...
గోడకి కన్నీరు తుడిచేందుకు చేతుల్లుంటే బాగుండును...!!

నా పెదాలకి నువ్వు గుర్తొచ్చి మాట్లాడడం మొదలెట్టాయ్
అందుకే ఏకాంతంలోకి వెళ్ళా 
ఏకాంతానికి చెవులున్నాయో లేవో తెలియదు ..!!

నా మనసుకి నువ్వు గుర్తోచ్చావ్ మాట్లాడడం మొదలెట్టింది 
అందుకే నీ జ్ఞాపకాల గుడి దగ్గరకొచ్చా ..
నువ్వు ఇకనైనా నన్ను కరునిస్తావని ...!!