అదంతా ఆకుపచ్చ సముద్రం
ఎన్ని చెట్ల ఆకులు తెంపి ఆ సముద్రాన్ని
సృష్టించారో?
ఎన్ని మ్రానులు నరికి
ఎన్ని మొక్కలు నాటి నిర్మించారో ??
ఆ సముద్రపు తీరానికి కొట్టుకొచ్చే అలలు
ఎండుటాకులు
సారంపోయి ప్రాణంపోయిన వాటిని
ఆ సముద్రం తనలో ఉంచుకోదు
గాలికి ఎప్పటికప్పుడు పని చెప్పి
శుభ్రం చేయిస్తూ ఉంటుంది
బయటికెప్పుడు ప్రశాంతంగానే కనిపిస్తుంది
పచ్చగానే ఉన్నట్టు భ్రమ కలిగిస్తుంది
లోలోపల అగ్ని పర్వతాలు
భూకంపాలూ
జంతుబలులు నరహత్యలు జరుగుతూనే ఉంటాయి
అకస్మాత్తుగా ఒక రోజు
ఆ సముద్రంలో సగం కొట్టేసిన మ్రానొకటి గర్భం
దాల్చింది
గర్భం కోల్పోయి మోడురారిన
ప్రతి మొద్దు గుస గుసలు
మొదలుపెట్టాయి
ఇంతకు
ఆ మ్రానులో పడ్డ విత్తనపు వీర్యం
ఆడదా ??
మగదా ?? అని
----------
( ఈ కవిత మంచి స్పందనను తెచ్చిపెట్టింది ,నౌదురి మూర్తి గారు ఈ కవితను ఆంగ్లం లో అనువదించి అనువాదలహరి అనే తన బ్లాగులో పోస్ట్ చేసారు )
ఎన్ని చెట్ల ఆకులు తెంపి ఆ సముద్రాన్ని
సృష్టించారో?
ఎన్ని మ్రానులు నరికి
ఎన్ని మొక్కలు నాటి నిర్మించారో ??
ఆ సముద్రపు తీరానికి కొట్టుకొచ్చే అలలు
ఎండుటాకులు
సారంపోయి ప్రాణంపోయిన వాటిని
ఆ సముద్రం తనలో ఉంచుకోదు
గాలికి ఎప్పటికప్పుడు పని చెప్పి
శుభ్రం చేయిస్తూ ఉంటుంది
బయటికెప్పుడు ప్రశాంతంగానే కనిపిస్తుంది
పచ్చగానే ఉన్నట్టు భ్రమ కలిగిస్తుంది
లోలోపల అగ్ని పర్వతాలు
భూకంపాలూ
జంతుబలులు నరహత్యలు జరుగుతూనే ఉంటాయి
అకస్మాత్తుగా ఒక రోజు
ఆ సముద్రంలో సగం కొట్టేసిన మ్రానొకటి గర్భం
దాల్చింది
గర్భం కోల్పోయి మోడురారిన
ప్రతి మొద్దు గుస గుసలు
మొదలుపెట్టాయి
ఇంతకు
ఆ మ్రానులో పడ్డ విత్తనపు వీర్యం
ఆడదా ??
మగదా ?? అని
----------
( ఈ కవిత మంచి స్పందనను తెచ్చిపెట్టింది ,నౌదురి మూర్తి గారు ఈ కవితను ఆంగ్లం లో అనువదించి అనువాదలహరి అనే తన బ్లాగులో పోస్ట్ చేసారు )