నువ్వెవరో తెలియక సతమతమౌతున్నా
నేను నీకేమౌతనో తెలుసుకోవాలని ...!!
అప్పుడప్పుడు అలా ప్రశ్నల ప్రవాహాలు పోట్టేతి వస్తున్నప్పుడు ...
ఎదురు నిలువలేక
వెను చూపలేక .... !! !!
నిన్ను చేరుకోవాలని పరుగెడుతూ వస్తున్నా ... నా కంటూ దారి లేకపోయినా ...
అప్పుడప్పుడు అలా నీవిచ్చే వెసలుబాటు పల్లం వైపు
నదిలా నన్నాపు కోలేక .....!!!
నిన్ను వదులుకోలేక !!!!
నీతో మెప్పు పొందాలని నిరీక్షిస్తున్నా ...
నాకు నీ ఇష్టాల జాబితాలో చోటు లేదని తెలిసిన ..
అప్పుడప్పుడు నీ ఇష్టానికి అనుగుణంగా నన్ను మలుచుకునే
ప్రతిమగా ప్రయత్నిస్తున్నా ..!!!!
నీ ఎంపికల ఉలి దెబ్బ నన్ను గాయపరుస్తున్నా
నగిషీలు దిద్దుకుని నీ సొంతమవ్వాలని ...!!!!!!...(by mercy)