Thursday, July 1, 2010

రాజశేఖర రెడ్డికి అంకితం

అదో
హర్షిస్తున్న ఆకాశం
రాజ నక్షత్రం చేరికతో
ద్విగునీకృతమైన
దాని అందం ..

అదో
ప్రేమ వనంలో చోటుచేసుకున్న
విషాదం
తోటమాలి ఇక లేడే అని
విచ్చుకున్న కుసుమాలు
విలపిస్తూ చేస్తున్న గానం

అదో 
పేద హృదయ  ఆలయం
నీవు చూపిన
ప్రేమ చిహ్నంగా మారిన వైనం ...
అదో  
అభిమాని గళం
నీవెలా వెళ్లిపోగలవని
చేస్తున్న ఆర్తనాదం .....

అదో  
ఆగిన గుండెల స్వరం
నీకోసమే మేమంటూ
నీవెంటే అయినాయి పయనం .......

అదో
ఆంద్ర ప్రజల నయనం
ఆపుకోలేక
ఉప్పొంగుతున్న
శోక సంద్రం ....

అదో
నల్లమల అరణ్యం
విధికి తలవంచి నందుకు
చరిత్రలో మిగిలిపోయే అంతగా
పొందుతున్నాయి చీత్కారం ...
.
ఇదో
నా ప్రియమైన ఆదర్శం ..
ఇకపై నీవుగా
నీలా ఉండాలనే తాపత్రయం ...
అందుకే
అందుకో జోహారుల సమర్పణం
ఏమి చేయలేని నిస్సహాయులం
అందిస్తాం నీకు జల యజ్ఞ ఫలం
నీ ఆదర్శాల అడుగుల వెంటే సాగిస్తాం
ప్రయాణం
అందిస్తాం నివాళిగా ...........
హరితాంధ్ర రాష్ట్రం .......                             (by mercy)