నీ కోసం నా ఎదురు చూపు నిరాశను మిగిల్చింది ..
ఎంతో ముస్తాబయి నీ కోసం వెళ్ళింది అన్నీపోగొట్టుకున్న దానిలా
మళ్లీ నా దగ్గరకొచ్చింది ....!!!
అందరికి అందని నిన్ను అందుకోవలనుకుంది ...
అందలం అందనంత ఎతునుంటుందని తెలిసి కూడా
మరిచిపోయింది..!!
ఆశల పల్లకిని నీ కోసం సిద్ధం చేసుకుంది ...
అది ఆవిరై పోతుంటే చూసి రోదిస్తుంది ...!!
విశ్వవ్యాప్తం అనుకున్న నిన్ను హృదయంలో
ఉంచుకోవలనుకొని శ్వాసించింది...
వేడి నిట్తుర్పై బయటకు వస్తున్న నిన్ను వదిలి వేయలేక ..
ప్రాణం కోల్పోతున్నంతగా తల్లడిల్లుతుంది...
ఇక చాలు ఈ పరీక్ష దానికి...
ఇక చాలు ఈ పరీక్ష ఎదురుచుపుకి ..
జీవించేలా నీ కౌగిలినివ్వు ..జీవించేలా నీ కౌగిలి నివ్వు
నా నిరీక్షణకీ ......... (by mercy)