విడిపోవటం అంటే ఏంటని..
మేఘం నుండి వర్షిస్తున్న చినుకు నడుగు ...!!
విరహం అంటే ఏంటని పుప్పొడి బరువుతో నేల కొరుగుతూ
ఇంకా భ్రమరానికై ఎదురుచూసే పువ్వు నడుగు ..!!!
మౌనం అంటే ఏంటని
అడవి కాసిన వెన్నల నడుగు ...!!
అమృతం అంటే ఏంటని ఐదు రోజులుగా ఆకలితో
ఉన్న కడుపు నడుగు...!!
ప్రేమంటే ఏంటని చెంపలపై జారుతూ
ఓదార్పుకై ఎదురు చూసే కన్నీరునడుగు ..!!
త్యాగమంటే ఏంటని తన శరీరాన్ని కాల్చుకునే కోవత్తి నడుగు ..!!
అనుమానం అంటే ఏంటని ...
అనుమానం అటే ఏంటని ....
ముక్కలు ముక్కలుగా పగిలి పోయిన నా హృదయాన్ని అడుగు ..!!!
(by mercy)