Monday, January 30, 2012

నా జ్ఞాపకాల మైలురాళ్ళ పై 
నీ ముఖ చిత్రమేల ?
నాకై వినిపించే సంగీతానికి నీ పేరు 
అది ఎలా ... ?
ప్రేమ మధువుకు తప్ప 
ఇంత కైపు దేనికి కలుగు ?
నువ్వు నీ జ్ఞాపకం నాకు 
సంధ్యా వేళ పిల్లన గ్రోవి స్వరం ..!!
నీ మాటల వెన్న 
నా హృదయ గాయానికి మందు ..!!
నా ఉదయం నీ ప్రేమామృతం 
తోనే మొదలు ..!!
అల్లంత దూరాన కలిసీ కలవని 
భూమి సముద్రం కాదు మనం  
ఎగసి పడుతూ తీరాన్ని చేరి
ప్రేమను సాదించుకునే  సైనికులం ..!!
నేను  దైవ కులం ..
నాది ప్రేమ కులం ..!!
నువ్వెప్పుడు నాతోనే  ఉంటావన్న నమ్మకం
నా కంటి కన్నీరును అడ్డుకుంటుంది ...
 ఏడిచేందుకు  సిద్దంగా ఉన్న కన్ను 
ఊహల్లో నీ స్వరం విని ఆగిపోతుంది 

ఎందుకు శ్వాసిస్తున్నానో నాకే తెలియదు 
ఏవరికోసం జీవించాలో కూడా ఏనాడూ అర్ధం అవదు
ఒంటరి మనిషికి ఒర్చుకోలేనంత బాద 
ఎందుకు అని నన్ను నేను ప్రశ్నించుకునే 
తీరిక దొరికితే ఆ సమయం ఎందుకు దొరికిందా 
అని భయం ..??

వాస్తవ ప్రపంచం కన్నా 
కలలోనే జీవితం అందంగా అనిపిస్తుంది
ఆ అందమైన జీవితం కోసం 
ఎప్పడికి నా కళ్ళు అలాగే మూసుకుపోయినా 
ఇష్టంగా అంగీకరిస్తాను ....

Sunday, January 29, 2012

చెంప మీద నుంచి జారుతూ నా కన్నీరు 
ప్రశ్నించింది ...
నన్నేదుకు వదిలేస్తున్నావ్ అని .. 
నన్ను  త్యాగం చేయాల్సినంత 
కష్టం వస్తే సరే  ఇష్టంగా  నీ కళ్ళలో 
నుంచి వెళ్ళిపోతానని ...
అది జారుతున్నంత సేపు 
అన్ని రోజులు దాక్కున కంటిని 
చూస్తూ వదిలి వేయలేక ఒక్కో 
మెట్టు దిగుతున్నట్టు   బలవంతంగానే ..
నిట్టురుస్తూ ...
కన్నీటి బొట్టుని వదిలేస్తూ కన్ను 
ప్రశ్నించింది ... నీకోసం నేను త్యాగం చేసిన 
దానికి ప్రతిఫలం నీ మనసు నాకు 
ప్రశాంతత నివ్వాలి అని ...?
నా మట్టుకు నన్ను ప్రశ్నించే ప్రతీది ...
సమాదానం లేని నాకు మాత్రం 
అర్ధం కాని వింత పరిస్థితి ..!

వెలుగుతున్నంత  సేపు ... 
వెలుగు పంచుతున్నాను 
అన్న ఆనందం చాలు నాకు ...

కాసినంత కాలం 
మంచి ఫలాలను ఇస్తున్నాను 
అన్న తృప్తి చాలు నాకు ....

ప్రవహిన్చినంత కాలం ..
ఎందరి దాహమో తీరుస్తున్నాను
అన్న ఆనందం చాలు నాకు ..

ఈ మాటలు వినడానికి బాగున్నై కదా 
అని రాసా... కానీ వాటి వెనక అవి పడే బాద
నాది .... ఎవరికీ తెలియకుండా 
కార్చే కన్నీరు నాది
ఆనందాన్ని నటిస్తూ ..నవ్వు పంచాలనుకునే 
నాకు ఆనందం కూడా 
ఒక వస్తువే అనుకునే స్థితికి 
దిగజారిన  గెలుపులో ఓటమి నాది 

Tuesday, January 24, 2012

నువ్వంటే నాకు ఒక నమ్మకం 
నన్ను ఎప్పుడు వదిలి వేయవని 
తోడు నీడలా నాతో ఎల్లప్పుడూ 
ఉంటావని ...

నువ్వంటే నాకు ఒక నమ్మకం 
నా మాట జవ దాటవని 
వర్షంతోనే వుండే ఇంద్ర ధనస్సులా
నావెంటే ఉంటావని.....

నువ్వంటే నాకు ఒక నమ్మకం 
నా కోసం ఏదైనా చేస్తావని
నా ఇష్టం కోసం నీ ఇష్టం 
త్యాగం చేస్తున్నప్పుడు చూసి ... 

Sunday, January 22, 2012

నిన్ను ఒకటిఅడగనా 
ఎందుకు నువ్వు నాకు 
నచ్చావ్ ... ?? 
నువ్వు నచ్చిన తరువాత 
నా పరిస్థితి నువ్వే ...
నా మాటల మొత్తం నీవే ..
నా సంతోషపు కూడిక నీవే ..
నా ఒంటరి తనపు తీసివేత నీవే 
నా ఉల్లాసపు గుణకారం నీవే ...
నా బాధలను భాగహారం చేసే 
ఆనందపు శేషం నువ్వే ....


మేఘం నిండిన వర్షం లా
నా హృదయం నిండా 
నువ్వే ....
నా భావనలను చిలికితే 
వచ్చిన ప్రేమామృతం 
నువ్వే ...
నువ్వే ప్రియా .. నువ్వే ..!!



Friday, January 20, 2012


వెతుకుతున్నా నిన్ను 
ఎక్కడ వదిలేసుకున్నానో అని 
వదిలేసెంత వరకు నాకు తెలియలేదు 
నువ్వు నాకు ఎంత ముక్యమో అని 

నా చిరునవ్వు నీతోనే ఉంటానంటుంది 
ఎందుకు నేను నచ్చలేదా ??
నీ దగ్గర వున్నది 
నా దగ్గర లేనిది ఏంటి ??

నా ప్రశాంతత నువ్వు వచ్చేవరకు 
నా హృదయం లోకి తొంగి చూడనని 
ధర్నా చేస్తుంది 
ఎందుకు ఇంత కొంత సమయంలో 
అది నీదై పోయింది ..??

సంతోషం అదిగో చూడు ..ఏంటో 
నన్ను దోషిని చూసి నట్టు చూస్తుంది 
కోర్టులో దోషిలా అన్ని పోగొట్టుకున్నట్టు
నేనెందుకు ఒంటరికి నేస్తం అవ్వాలి ...??
ఎక్కడ నువ్వేక్కడా  ??


Wednesday, January 18, 2012

ఆశల పొద్దు పొడిచింది 
నిన్నే తూరుపుగా చేసుకొని 
ఆహ్వానం పలికే నా  హృదయం 
నిండా నీ ఊసులే నింపుకుని ...!!

ప్రేమ నది బయల్దేరింది 
నిన్నే స్థానంగా చేసుకొని 
దాహార్తి తీర్చుకునేందుకు 
నా మనసునే ఖాలిగా చేసుకొని ...!!

మది తలపులు తెరుచుకుంది 
నీకై ఎదురుచుపుల దీపం వెలిగించి
నీ అడుగులు నా హృదయాన్ని తాకి 
ప్రేమ వనంగా మారడం చూడాలని ...!!


Tuesday, January 17, 2012

ప్రేమ వ్యవసాయం చేస్తున్న ... 
ప్రేమ పంట కోయాలని ....
ప్రేమ విత్తనాలు జల్లి ఎదురుచూస్తూ 
ప్రేమ పలుకులు వల్లే వేస్తూ ....


చిగురించిన ప్రేమ మొలకలు 
చూడగానే పట్టలేనంత సంతోషం ...
ఎదుగుతున్న మొలకలు చూస్తూ 
ఆపుకోలేనంత ఆనందం ...


ఎన్ని జాగ్రత్తలో .. 
ప్రకృతి నుంచి .. పంట పురుగు నుంచి ..
కాపాడుకునే ప్రయత్నం ..
కాపాడమని ప్రార్థన ...


సమయం వచ్చింది ..
ప్రేమ పంట కోసే కాలం వచ్చింది 
ఇంతలో నాకు చెందాల్సిన పంట 
కాలం  మాయలో ..ప్రక్రుతి చేతిలో 
నాకు చెందకుండా ...!!
వరనుడి ప్రతాపానికి 
తలవంచక తప్పదని నేలపాలయింది ...
నా ఆశలన్నిటిని బూడిద పాలు చేసింది ..  !!
దేవా నువ్వు కావాలి 
నేనేంటో నేను తెలుసు కోడానికి 
నా గమ్యం ఏంటో నాకు తెలియడానికి 
నా నావలో నాతో పాటు 
ప్రయాణించడానికి 
నాకు తోడుగా నా వెంటే ...
యేసు  నువ్వు కావాలి ... 

దేవా నువ్వు కావాలి 
నా తల్లివి తండ్రివిగా నాతో 
ఉండడానికి ...
నా కలిమిలో లేమిలో 
సమృద్దినివ్వడానికి 
నాకు తోడుగా నాలో నీవుగా 
యేసు నువ్వు కావాలి ... 

Monday, January 16, 2012

నీ నుంచి దూరం వెళ్ళే
 ప్రయత్నం చేస్తున్నా...
నీ జ్ఞాపకాల తాళ్ళు ఇంత 
బలంగా అల్లుకుపోతాయని 
తెలియక .. ఆ ముడులను 
విప్పే చేతనవక ..
అచేతనంగా పడివున్న ....!!

ఒక అడుగు నీ వైపునుంచి 
వెనక్కి వెళ్ళిన వెంటనే ...
నీ మాటల వల వేసి లాగి 
రెండడుగు నీ వైపు మళ్లేలా చేస్తావ్ ...
ఎలా దీన్ని సమర్దించుకుంటావ్ ??

జారి పోతున్న చినుకులా 
నీకు దూరమయ్యే ఆలోచనలు 
వస్తున్నప్పుడు ...
నీకు నన్ను దూరం చేసే పరిస్థితిని 
కలిగించిన సమయాన్ని ఎలా 
నిందించాలో తెలియక 
నీ పై కోపడ్డ క్షణాలను నువ్వు 
గుర్తుంచుకోకూ....

Saturday, January 14, 2012

నువ్వు పిలవగానే పలికేంత ప్రేమ నాది 
కానీ నేను మాట్లాడేప్పుడు 
వినలేనంత ప్రేమ నీది ....

నీ మొహం లోని సంతోషం తో 
నా మనసు వెలిగి పోయేంత ప్రేమ నాది ...
కానీ నా మనసు వెలుగును అర్ధం చేసుకోలేనంత 
ప్రేమ నీది ...

నీ కళ్ళలోని కన్నీరును చూడలేక నా కళ్ళు 
కన్నీళ్ళతో నిండే ప్రేమ నాది ..
కాని నా కన్నీటి వెనుక కధ
అర్ధం చేసుకోలేని ప్రేమ నీది ... 

నీ హృదయ స్పందన అర్ధం చేసుకొని 
నీకై జీవిన్చాలనుకునే ప్రేమ నాది ..
కాని నా హృదయాన్ని
 చులకనగా చూసే ప్రేమ నీది ...

Wednesday, January 11, 2012

నా పేరు మరిచి పోయా ...
నీ పేరు మాత్రమే పిలవడం 
మొదలు పెట్టిన నేను ....


నా జాడ మరిచి పోయా
నీ కోసం వెతకడం 
మొదలు పెట్టిన నేను ..


నా స్థితి మరచి పోయా 
నీ కోసం నన్ను మార్చుకోవడం 
మొదలు పెట్టిన నేను ....


నన్ను నేను మర్చిపోయా 
నీ కోసం నీ ప్రేమ కోసం 
తప్పస్సు చేయడం 
మొదలు పెట్టిన నేను ...

Friday, January 6, 2012

కనులకు విందు చేసే
 నా రంగుల కల నీవు 
నా మనసును ఊరట పరిచే
 మోహన రాగానివి నీవు ..
హృదయపు అంచుల్లోంచి
మనసు లోతులోక్కి 
దూకే జలపాతనివి నీవు ...
మొగ్గలాంటి నా కోరికలను 
పుష్పింప చేసే 
కోమల స్పర్శ నీవు ..
మాటలే రాని నాతో 
భావుకాతను వ్యక్తం చేయిస్తున్న 
భావోష్ణ శక్తివి నువ్వు ..


Thursday, January 5, 2012

ఏదో చెప్పాలని ఆశ 
నువ్వు వినకపోయినా ...
ఎన్నో భావాలను రాసుకొని 
నిండి  పోయిన హృదయ పుస్తకం 
భాద అర్ధం చేసుకోమనగా ...!!!


నా చిరునవ్వు నువ్వు చూడాలని ఆశ 
 నీకు కనిపించక పోయినా ..
ఆ చిరునవ్వు చిరునామా నీ పేరు కనుక ..!!


నా నిచ్చ్వాస నీకు చూపించాలని ఆశ 
నీ నిరీక్షణలో గుండేలోనుంచి జారిపోతున్న 
ఆశల ఆవిరి ఆదుకోమనగా ..!!


నా కన్నీరు ఆజ్యని పోసి ఆరిపోకుండా
నీ ప్రేమ ప్రమిదను వెలిగిస్తున్నప్పుడు 
నీవే నా సర్వస్వం అని చూపించాలని ఆశ ...
చూసైన  అర్ధం చేసుకుంటావని 
నా ఆశల దివ్వేని ఆరిపోకుండా కాపాడుతావని..!!
నువ్వే నా ఆశ ..
నా ప్రేమ కాంతి శ్వాస ....  

Sunday, January 1, 2012

కొత్త ఉదయం
కొత్త ఆశలు ఆశయాలు
కొత్త ఆలోచనలు 
కొంగొత కోరికలు 
కొత్త కొత్త అవకాశాల ఎదురు 
చూపులు ....
నేస్తమా ... అన్ని క్రొత్తవైన
విశేషాలు నీ జీవితం లో 
మొదలవ్వాలని ఆశిస్తూ ...
నూతన్ సంవత్సర 
శుభాకాంక్షలు ..