చెంప మీద నుంచి జారుతూ నా కన్నీరు
ప్రశ్నించింది ...
నన్నేదుకు వదిలేస్తున్నావ్ అని ..
నన్ను త్యాగం చేయాల్సినంత
కష్టం వస్తే సరే ఇష్టంగా నీ కళ్ళలో
నుంచి వెళ్ళిపోతానని ...
అది జారుతున్నంత సేపు
అన్ని రోజులు దాక్కున కంటిని
చూస్తూ వదిలి వేయలేక ఒక్కో
మెట్టు దిగుతున్నట్టు బలవంతంగానే ..
నిట్టురుస్తూ ...
కన్నీటి బొట్టుని వదిలేస్తూ కన్ను
ప్రశ్నించింది ... నీకోసం నేను త్యాగం చేసిన
దానికి ప్రతిఫలం నీ మనసు నాకు
ప్రశాంతత నివ్వాలి అని ...?
నా మట్టుకు నన్ను ప్రశ్నించే ప్రతీది ...
సమాదానం లేని నాకు మాత్రం
అర్ధం కాని వింత పరిస్థితి ..!