రా
నా గుండె గుడిలో
సావాసం
చేద్దాం
నీ పేరుతో
కట్టిన తోరణాలు
ఎంత ప్రేమగా
ఆహ్వానిస్తున్నాయో
చూడు
గుమ్మంపైన
చెక్కిన
నీ పేరు
నిన్ను చూడగానే
మురిసిపోతుంది
ఏంటి
అంతలా నివ్వేరపోయావ్
నీ రూపామే అది
నా ప్రాణం పోసుకొని
చలిస్తుంది
ఇక
నువ్వోచ్చావ్ గా
తను లోపల
కకెల్తుందిలే
గది వేడిగా ఉందా ?
యుగాల ప్రేమా ఆ మాత్రం
ఉండదా ?
ఓ కౌగిలి అందించు
నిరీక్షనకి కరిగి కన్నీటి
ధారగా
నా కౌగిలి వస్త్రాన్ని తడిపి
చల్లదనం తో నిన్ను
కప్పుతుంది
ఓయ్
బెంగ పడకు
ఈ గుండె గదిని లోపలి
ఆస్థిని
తర తరాలకు నీకే రాసిచ్చా
ఋజూవు కావాలా?
ఆ యెర్రని సిరాతో
నుదుటిపై బొట్టులా పెట్టనా ?
గాయమైన పర్లేదు
నువ్వు నమ్మితే చాలు