ఎప్పట్నుంచో అనుచుకున్న నీ బాధను
మరీ ఈ సమయంలో ఇలా చెపుతవానుకోలేదు ...!!
నన్ను మైమరిపిన్చేట్టుగా నీ ప్రేమ మాటలు వినాలనుకున్నా కానీ
నన్ను నన్నుగా దహించేలా అశక్తురాలనైన సమయంలో
ఒంటరితనపు చితిపై దహిస్తవనుకోలేదు ...!!
నా మట్టుకు నేను నిన్ను నీకు తెలియకుండా
ఇష్ట పడడం నా తప్పే ...కానీ ,
నీకు తెలియదన్న భ్రమలో నా ప్రేమను
అప్పుడో ఇప్పుడో గ్రహించలేదన్న అబద్ధం చెప్పకూ ..!!
నీతో మాట్లాడుతున్నంత సేపు నీ గాయాలకి
కొంతైనా ఉపశమనం అవుదామనుకున్నా..
నీ కంటి నుండి నీ గత ప్రేమ తాలుకు అశ్రువులు రాలుతుంటే
స్వాతి చినుకుల్లా నా హృదయం లో దాచి పెట్టుకుని
ఆనందాన్ని నీకు తిరిగి ఇవ్వాలనుకున్నాను ..!!
నీ మౌనం లో నీ ఊహల్లో ,,నీకు దూరమైనా ప్రేమ కోసం
నువ్వు వెతుకుతూ ఆరాటపడ్తుంటే ,,
నీకోసం నన్ను నేను వదులుకునైన నీకు
ఆ ప్రేమను వెతికి తేచిపెట్టి నీ మొహం లో
సంతోషం చూడాలన్న తాపత్రయం ,,,,,!!
నా ప్రేమైన నీవు , నీ ప్రేమ కోసం పడే తపన చూస్తుంటే
నీ ప్రేమలో నిన్ను గెలిపించి నా ఓటమిని నీ గెలుపు సంతోషంతో
మర్చిపోదమనుకున్నా ,,,!!
నీకు తెలియదని అనుకున్నా నన్ను నా కనులోతుల్లో
దాకున్న నా ప్రేమను నువ్వు గ్రహించి కుడా
నీ ఒంటరి తనపు చెరసాల నుంచి నిన్ను నువ్వు
విదిపించుకోలేక బాధ పడ్తున్నానని తెలుసుకున్నాను .!!
నీ మధుర జ్ఞాపకాలుగా భావించే సంకెళ్ళే నీకు
సంతోషం అనుకొని లోకం నుంచి వేరై నీ లోకం ఏర్పర్చుకున్నా...
నీతో పాటు అదే లోకంలోకి నేను అడుగు పెట్టె అర్హత సంపాదించడానికి
ఎంత కష్టపడ్డానో తెలిసి కూడా చూడ లేనంత
అసహాయుడవు కాదు కదా ..!!
ఏమి అనలేక నీ కొరకైన నా ప్రేమ నిన్ను చేరలేక తనని
తాను దాహించుకుంటూ మూగదై కారుస్తున్న కన్నీరును
గ్రహించి కూడా... గ్రహించాలేనంత నటన ప్రదర్శించి
నీ మాటల ఓదార్పు దూరాన్ని వుపయోగించి
తూర్పున నువ్వుంది పశ్చిమానికి నన్ను నేద్తుంటే
ఎలా ?? ఏమి చేసేది ??
అపార్దం చేసుకోకు ..
నా పరిస్థితి నీ పరిస్థితి లాంటిదే కదా ...
ఎదురుచుస్తుంటా నా ఒంటరి తనాన్ని
నీ ప్రేమ వసంతం వరించే వరకు ....
నీవు నేనై ......
(by mercy )
(by mercy )