జీవితం నేలకు తలవచింది...
అడుగులు తడబడుతున్నాయి
ప్రేమ వీడి పోయిందా ..??
ఆశల ఆకులు రాల్చుతున్న
నిరీక్షణ వృక్షం ...
రెక్కలు తెగిపడిపోయిన ఊహల
పక్షి స్వరం ...
కరిగిపోతున్న హృదయ క్రొవ్వత్తి
రోదనం .....
కుప్పకూలిన నీతో నా ప్రపంచం
వేరు చేస్తున్నయి నన్ను ,, నా నుంచే
నీ ఎడబాటు అలచనలు ప్రతిక్షణం ...
నేలకు తలవంచిన జీవితం తలనెత్తనివ్వు..
ప్రేమ కన్నా ఎక్కువైనా ప్రత్యామ్న్యాయం
ఏముందో ఇప్పుడే ఇవ్వు ....
నీవైపు తిరిగానని హేళనగా చూడకు ...
నీ సమయం వచ్చిందని ఎగతాళి చేయకు..
నువ్వు తప్ప ఇప్పుడు ఎవరు లేరు
నన్నునమ్ము సర్వాంతర్యామి నువ్వు ...