నీ స్పందన రాళ్ళతో నా మదిని కదిలించకు
నేను రాగం తెలియని వేణువు
నీ పెదవుల తాకిడితో రాగం పలికించకు
నేను రంగులు తెలియని వర్షం
నాతో పాటు నువ్వు హరివిల్లులా రాకు
నా మనసు ఆకారం లేని శిలా పర్వతం ఉలివై నన్ను చెక్కి ఆకారం అర్ధం నాకు తేకు ..
నేను తిమిరం నిండిన మేఘం
నీ ప్రేమ కాంతులతో నన్ను చీల్చకు ..
నేను ఏ భావనల విషయమే లేని ఖాళి పుస్తకం
నీ ప్రేమ ఊసులతో నన్ను నింపకు ...
నేను విచుకున్న పరిమళ సుమం
భ్రమరమై నాపై వాలకు
ఎప్పుడు వినని క్రొత్త అందాల రంగులను
నా హృదయంపై అద్దకు..
నన్ను నాలాగే ఉండనివ్వు
నీలాగా మార్చకు ...
నన్ను వున్న చోటనే ఉండనివ్వు
నాలో కదలిక తెచ్చి ప్రేమ పిపాసిని చేయకు..