Tuesday, November 29, 2011

వీడుకోలు ...!!
నావిగా మిగిలిపోయిన నీ 
జ్ఞాపకాలకు 
నాలో నీవుగా నిండిన 
నా హృదయలయకు 
నా ప్రమేయం లేకుండా ఎగిసి పడే
నీ ఊహలకు 
నీకోసం తపించి ఉప్పొంగే 
నా ఎదసడులకు ... !!


వీడుకోలు ...!!
ఒకటని భావన నిచ్చి  వీడిపోయిన 
నీ తోడు నీడకు 
రెండక్షరాల ప్రేమ పదంలో 
కలయికల రహస్యాలకు ...
మనం అనే మాటను వాడుతూ 
మనసును కట్టడి చేసే నీ మాటలకూ 
నన్ను కప్పి ఉంచే నావి అనుకున్న 
నీ భావనలకు ...


చెప్పలేక చెపుతూ 
వీడిపోమ్మంటూ
ఆర్దత నిండిన 
గొంతుతో .. వేడుకోలు  
వీడుకోలు .....
(By Mercy )