వాకిలి ఈ పత్రికలో వచ్చిన నా కవిత
***
ఘనీభవించిన చీకటిపై
మొలకెత్తుతున్న పాదాల ముద్రలు వేస్తూ
కిరణాలు సోకని పుస్తకంలో అక్షరాల విత్తనాలు
కొన్ని జారవిడిచి
భావాలకు దాహమైనప్పుడల్లా చీకటి నీటిని త్రాగించి
నడుస్తున్నాను ఉదయం వైపు
తొలికిరణంతో
నేనే మొదట మాట్లాడాలని
ఆలోచనలన్నీ దాడి చేస్తే పగిలిపోయిన లాంతరు వెలుగుకు
నా పాదాలనుంచి కారిన రక్తపు బొట్లను తోడుగా వదిలి
కన్నీటి వర్షం ప్రతి సారి చెరిపేస్తున్న కలల కధలను చేతి గోళ్లకు
రంగుగా అద్దుకుంటూ
శూన్యం తరుముతుంటే రాల్చుకున్న
సీతాకోకచిలుకల రెక్కల స్వేచ్చని
ఏరుకుంటూ నడుస్తున్నాను
ఉదయం వైపు
నాలోకి వెలుగు ఒంపుకుని
వెనక్కి చూడకుండా వెలుగై ప్రవహించాలని
నాతోడుగా మిగిలి ,నా నోట నలిగి చినిగిపోయిన పాటకు
కుట్లు వేసుకుంటూ
నిశబ్దపు దుప్పటిలో దూరి నన్ను వెంబడిస్తున్న గాలికి
ఊపిరి నిట్టూర్పులను జత చేసి
కొన్ని భయంకర యుద్ధాల తరువాత ఆ చీకట్లో వర్షిస్తున్న
నిశ్శబ్దంలో తడుస్తూ
నడుస్తున్నాను ఉదయం వైపు
కొత్త పాట నొకటి నా పెదాలపై అల్లుకుంటూ
తూరుపు తలుపులు తెరిచి
విజయగీతం సూర్యునితో పాటు ఆలపించాలని
------------------------