జేబులో కొన్ని నవ్వుల్ని వేసుకుని
ఉదయమే ఇంటినుంచి బయలుదేరుతాం
భలే నేర్చుకున్నాం
ఎలాగో , ఎక్కడ్నుంచో
ఏ మొహం ఎదురైతే ఏ నవ్వు పెదాలకు అంటించుకోవాలో
ఏ అవసరానికి ఏ నవ్వు సరిపోతుందో
ఏ నవ్వుతో ఏ నవ్వును మారకం చేయొచ్చో వెన్నతో పెట్టిన విద్యల్లో జీవితం
ఉచితంగా ఇచ్చే ఆఫర్లలో ఇదొకటేమో
ఎంతైనా మనుషులకే సాధ్యం
పాపం జంతువులకు ఆ అవకాశం లేదుగా
నానార్ధాలు తెలిసిన నవ్వుల్ని మనిషి ఉపయోగించినంత
వాటికి ఉపయోగించడం తెలియదుగా
అందుకే నవ్వు నాలుగు విధాలా
నా నా అవసరాల కోసం ..
exclusively for "being who is called human "