Wednesday, December 28, 2011

నా కనులకు ప్రేమ పొరలు కమ్మాయి
నీవు తప్ప వేరే ఏది కనిపించకుండా 
నా గుండె కి నీ మాటల  సెగ తగిలింది 
ఇంకే మాటలు చల్ల బరచ లేనంత ..!!


నేను ఆనందంగా ఉండడం 
నీకిష్టం లేదు కదా.. 
అయిన తప్పు నీది కాదు 
నా మనసు మీద నా అధికారం 
నీకు ఇవ్వడం తప్పు 
ఇప్పుడు అది నన్ను నువ్వెవరని 
ప్రశ్నిస్తుంది .. !!


నీ కళ్ళలో కాంతి కోసం 
నేను తపన పడడం కాదు 
నా కళ్ళల్లో కన్నీరు నిన్ను
 చూడమనడం  కోసం 
తపసు చేయమంటుంధీ ..


నీకు ..నీ మనసుకు 
అర్ధమయ్యే భాష ఏదో 
చెప్తావా .. జీవిత కాలం
పట్టినా నేర్చుకుంటాను .... 
నీకు అర్ధమయ్యేలా 
నా మనో వ్యధ అర్ధమయ్యేలా 
 చెప్పాలని.. ...!!!

Tuesday, December 27, 2011

నిన్ను నీ ఇష్ట ప్రకారంగానే 
వదిలేయాలని నిర్ణయించుకున్నాను !!!!
అయినా ఇరుకుగా భావించే నా హృదయం లో
నిన్ను పెట్టడం ద్వార నిన్ను ఇబ్బంది 
పెడుతున్నానేమో.. 
క్షమించు ...
రెక్కలు విరిచి నాతోనే నిన్ను
ఉంచుకోవాలని నా ఉద్దేశ్యం కాదు 
నా ప్రేమను పంజరంలా భావించేవరకు 
ఇబ్బంది పెడుతున్నానని 
అనుకోలేదు ...
హృదయాన్ని కోవెల చేసానని అనుకున్నా 
కాని ....
నువ్వు భయపడే  రక్తపు లోగిలిలో ఉంచానని 
 అనుకునేంత భయపడుతున్నావని 
అనుకోలేదు ....
క్షమించు .....
నీకు కాంతిని అవ్వడం  కోసం ఎదురు చూస్తూ కాలిపోయే 
క్రోవ్వత్తిని అవుదామనుకున్నాకానీ 
నిప్పులాంటి నా ప్రేమన్ను 
నిన్ను కాలుస్తున్న అగ్ని 
అనుకుంటున్నా వను కోలేదు ...
క్షమించు ...
కన్నీటితో నీ దారిని శుభ్రం 
చేశా నిర్భయంగా వెళ్ళు ...
వెనక్కి తిరిగి చూడకు ....
మళ్లీ నీకు దగ్గర అవ్వాలనిపిస్తుందేమో ....
నీ సంతోషం కోసం నా ప్రేమ 
మోడు బారిన ... నీ ప్రేమ చిగురులు 
చూసి సంతోషించే ..
నీ ప్రేమ పిపాసిని ..... 

Monday, December 26, 2011



నువ్వైన కాంతి 
నువ్వెక్కడో వున్నావ్
అయిన నా ప్రక్కనే వున్నటువుంటావ్ 
నువ్వెప్పుడు నన్ను పట్టించుకోవు
అయినా నా మనసులో నీ కోసం ఆత్రుత ఆగదు
నీ వైపు నడిచే నా మనసు అడుగులకు
ఏన్ని వేల మైళ్ళు వేళ్ళలో తెలియదు
ఎందుకంటే అన్ని వేల మైళ్ళ దూరంలో 
నీ మనసును నాకు దూరంగా తీసుకేల్లావ్
అయినా పర్లేదు నీ మనసు అడుగులో అడుగు వేస్తూ
నిన్ను చేరేంత ఓపిక నాకుంది 
నువ్వు నా వైపు చూడక పోయిన 
నీ దృష్టి నా వైపు మల్లెంత వరకు  
నువ్వైన కాంతి నన్ను చేరేవరకు
ఒంటరి తనపు చీకటి లో ఎదురు చూసే
సహనం సాహసం నాకుంది .. 

Monday, December 5, 2011

ఒక సారి పిలిచా పలకను అన్నావ్
మరో సారి పిలవాలని వున్నా 
పిలవలేని అసహాయత ...
నువ్వు నీ మనసు చెవులను
మూసుకొని 
నా మాటలను వినను అని మొండి
చేస్తే ...
ఏమి చేయలేని  నిస్సహాయత 


ప్రశ్నించే అధికారం 
నాకివ్వలేదు 
సమాదానం చెప్పే 
సమయం ఇవ్వట్లేదు 
తప్పు నీదా?? 
నాదా అని ఆలోచించే 
విచక్షణను కూడా నువ్వే
లాగేసుకొని ఇలా నన్ను 
ఒంటరిని చేయడం 
ఎంత వరకు న్యాయం ??


నీ మొండి తనం నా 
మనసును గాయం చేస్తే
నీ మౌనం నా మనసును 
శిక్షిస్తే ... 
వీక్షకుడిలా నీ నటన ప్రపంచానికి 
నచ్చినా .. 
నన్ను బాధించే భయంకర శిక్ష మాత్రం 
నువ్వు కనుగొన్నావనే ..
నీ ఆనందం లో నువ్వు మునిగిపోయి 
హాయిగా నన్ను చూసి నవ్వుకుంటూన్నావ్ ...


నీ సమయం .. నీ మొండితనం 
ముందు నేను ఇప్పుడు ఓడిపోయనేమో
కానీ నాది అయిన సమయం రాక పోదు
కానీ ఆ సమయం వచ్చే లోపు నా మనసు 
నీకు వేల మైళ్ళ దూరం వెళ్ళిపోయి 
నీ ఊసే మర్చిపోతుందేమో అని నా భయం


నీ మొండి తనం గెలిచింది అనుకుంటున్నావ్
నా నమ్మకం ఓడిందని నేను అనుకుంటున్నాను 
ఏది గెలుపో .. నువ్వు గ్రహించే సమయం కోసం 
ఈ ఎదురు చూపు .... !!!!



Saturday, December 3, 2011

నువ్వు నాకు చెందవని తెలుసు 
అయినా కూడా ఆశించాను..
నీ హృదయం లో 
ఎక్కడో ఒక మూలన
నా పై ఎప్పుడో ఒకప్పుడు 
ప్రేమ పుడుతుందని


నువ్వు నాకు చెందవని తెలుసు 
అయినాకూడా మనసు పడ్డాను
ఎప్పుడో ఒకప్పుడు 
నావైపు నీ దృష్టి మరలుతుంది 
ప్రేమ పుట్టిస్తుందని ...


నువ్వు నాకు చెందవని తెలుసు
అయినా కూడా వగచాను 
ఎప్పుడో ఒకప్పుడు జాలితో నైనా
నన్ను దరి చేరనిస్తావని 


నువ్వు నాకు చెందవని తెలుసు 
కాని ఆశించడం మానుకోలేను 
జీవితం అంతా  నీ జ్ఞాపకాలతోనే 
గడిపేంత సాహసం నేను చేయగలను
ఎందుకంటే
ఏదో ఒక రోజు నన్ను నీవు 
కోల్పోయవనే భావన 
నీకు కలుగక పోదని ..
నా ప్రేమకు నువ్వు కరిగిపోయే 
రోజు వస్తుందని .....!!
(by Mercy )

Tuesday, November 29, 2011

వీడుకోలు ...!!
నావిగా మిగిలిపోయిన నీ 
జ్ఞాపకాలకు 
నాలో నీవుగా నిండిన 
నా హృదయలయకు 
నా ప్రమేయం లేకుండా ఎగిసి పడే
నీ ఊహలకు 
నీకోసం తపించి ఉప్పొంగే 
నా ఎదసడులకు ... !!


వీడుకోలు ...!!
ఒకటని భావన నిచ్చి  వీడిపోయిన 
నీ తోడు నీడకు 
రెండక్షరాల ప్రేమ పదంలో 
కలయికల రహస్యాలకు ...
మనం అనే మాటను వాడుతూ 
మనసును కట్టడి చేసే నీ మాటలకూ 
నన్ను కప్పి ఉంచే నావి అనుకున్న 
నీ భావనలకు ...


చెప్పలేక చెపుతూ 
వీడిపోమ్మంటూ
ఆర్దత నిండిన 
గొంతుతో .. వేడుకోలు  
వీడుకోలు .....
(By Mercy )
సూర్యోదయం సూర్యాస్తమయం 
చక్రంలా తిరుగుతున్న జీవిత కాలం..
ఉదయిస్తున్న కొత్త ఆలోచనలు 
అస్తమిస్తూ ఆలోచింప చేస్తున్న ఓటములు ...!!


లేలేత చిగురులా ఒక్కో కాలం జీవితంలో  
ఏదో నేర్పిస్తూ 
నేరవేరుతున్న ఆశయాల పుష్పాల 
గుబాళింపులు విరజిమ్ముతూ ...
నిస్సహాయంగా రాలి పోతున్న 
మొగ్గలాంటి కోరికల నిట్టూర్పులు 
యెదలో భారంగా మూల్గుతూ 
గుచ్చుతున్న నిస్సహాయ ముళ్ళు ..!!


జీవ్తితం సూర్యోదయంలా మొదలై 
ఎన్నో ధ్యేయాలు ఆశయాల విత్తనాలు 
సాధన భూమిలో వెదజల్లి 
విజయపు పంట కోయాలని ఎదురుచూస్తున్న
 జీవన మనోనేత్రాలు ..... !!!! 
(By Mercy)



Monday, November 28, 2011

గడియారం శబ్దం చేస్తూ 
నువ్వు నన్ను మరిచి పోయిన క్షణాలను
లెక్క పెట్టిస్తుంది ...!!


తిరుగుతున్న పంకా
నీతో గడిపిన జ్ఞాపకాలను
చూపిస్తూ గేలి చేస్తుంది ...!!


శబ్దం చేస్తున్న కేలండర్ 
నీ కోసం నేను కన్నకలలు 
కలలాగే మిగిలిపోతాయని
 గుసగుసలడుతూ శబ్దం చేస్తున్నాయ్ ...!!


ఆ కిటికిలోంచి నన్ను తొంగి చూస్తూ 
మేగాలతో కలిసి దోబూచులాడుతూ చంద్రుడు 
నువ్వు ఒంటరివి అని పగలబడి నవ్వుతూ
నా హృదయాన్ని రంపంతో కోస్తునట్టుంది ...


ఏమి చేయమంటావ్ ??
ఎవరిని నిందించమంటావ్??
అందుకే ఒంటరి తనపు చెరసాలలో 
జీవిత ఖైదిగా మిగిలిపోవాలని శిక్ష వేసుకున్నా..!!
ప్రేమ లేని చోట 
అంటే నువ్వు లేని చోట 
నేను ఉండలేక ....
(By Mercy)


తొలికిరణం స్పర్శకు 
మంచు తెర తాళలేక కరిగినట్టు 
తొలి చినుకు స్పర్శకు 
చిగురాకు పులకరించినట్టు
మలయ మారుతం తాకి 
మది లో ఊహలు ఎగిసిపదినట్టు 
నీ ప్రేమ నాలో ఏవేవో 
భావాలకి ఊపిరి పోసింది ...
(by mercy)



Thursday, November 24, 2011

ఒక నువ్వు 
ఒక నేను  కూడితే
మన  ప్రేమ ...


ఒక మనసు 
ఒక మమత కూడితే 
మన ప్రేమ ..


నీ శ్వాస 
నా నిచ్వాస కూడితే 
మన ప్రేమ ...

నీ కోపం 
నా సహనం కూడితే 
మన ప్రేమ...


నీ గమ్యం 
నా గమనం కూడితే 
మన ప్రేమ ...


నీ పిలుపు
నా పలుకు కూడితే 
మన ప్రేమ 


నీ మౌనం
నా స్వరం కూడితే 
మన ప్రేమ 


నీ అంగీకారం 
నా అంగీకారం ఏకమైతే
మన ప్రేమ


నన్ను నీవు
నిన్ను నేనుగ 
మార్చుకోవడమే
మన ప్రేమ 
(by Mercy )


Wednesday, November 23, 2011

నీ కళ్ళలోకి చూసా 
సుడులు తిరుగుతున్న కన్నీళ్ళు 
ఏవో చెప్పాలను కుంటున్నాయి ..!!


నా చేతిని గట్టిగ పట్టుకున్న నీ చేయి
నా చెయ్యితో మాట్లాడుతుంది 
విశ్వప్రయత్నం చేస్తున్న కానీ నా మనసున్న భ్రాంతిలో 
అర్ధం చేసుకోలేకపోతున్నా ...!!


నీ నిట్టూర్పుల్ని అర్ధం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నా...
నీ గుండె లోతులోంచి ఉబికే భావాలను అర్ధం 
చేసుకోవాలని .. కాని అదేదో నీ కనులను 
చూస్తూ నిచేష్టురాలనయ్య ఏం చేయాలో తెలియక ,,!!


కనులు మనసుకు తలుపులు అంటారు కదా 
నువ్వు నీ భావాలను బయటికి రాకుండా 
ముసుకు వేద్దామని ప్రయత్నించినా..
అర్ధం చేసుకోలేనంత పిచ్చి దాన్ని కాదు కదా..!!
నీ కన్నీటి భాషను అర్ధం చ్సుకోలేనంత 
వెర్రి దాన్ని కాదు కదా ..!!
(By Mercy)

Tuesday, November 22, 2011

నీతో మాట్లాడకూడదు అనుకుంటాను 
కానీ , , మనసు ఊరుకోదు 
చంద్రుని కోసం ఎదురు చూసే కలువలా 
నీ ఒక్క పిలుపు కోసం ఎదురుచూస్తూ .. !!



నీతో మాట్లాడకూడదు అనుకుంటాను 
కానీ , ,నా తలపులు ఊరుకోవు 
భూమి చుట్టూ పరిభ్రమించే చంద్రునిలా
నీ చుట్టూ తిరుగుతుంటాయి 
నీ ఒక్క పిలుపు కోసం ఎదురుచూస్తూ .. !!


నీతో మాట్లాడకూడదు అనుకుంటాను 
కానీ , ,నీ ఊహలు ఊరుకోవు 
తీరాన్ని అలల ఘోషతో నింపే సముద్రంలా
నీ ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ .. !!



నీతో మాట్లాడకూడదు అనుకుంటాను 
కానీ , ,నా జ్ఞాపకాలు ఊరుకోవు 
తరుముకొస్తున్న సంధ్యా వేళలా 
ప్రతి రోజు నన్ను చుట్టి ఏవేవో భావాలను
స్పృశిస్తుంటే ...
నాకు మతిపోగోడుతుంటే .... !!!
( By Mercy)



Monday, November 21, 2011

ప్రేమ స్వేఛ్చ కాదు 
చెరసాల ...!!
ప్రేమ అమృతం కాదు 
తీపి విషం !!
ప్రేమ పండువెన్నెల లాంటి
అమావాస్య !!
ప్రేమ అందరు వున్నా ఒంటరిని 
చేసే ఆట !!
ప్రేమ మాటలనే మరిచిపోయేలా చేసే
మౌన శిక్ష !!
ప్రేమ ఎదలోతుల్లో చేరి హృదయాన్ని
త్రవ్వే బాధ !!
ప్రేమ నన్నే మరిపింప చేసే 
మతిమరుపు రోగం 
ప్రేమ తనకు తనే ఎవరో తెలియని
అంగవైకల్యపు అస్తిత్వం 
అయినా 
అయినా
ఎందుకు దాని తోనే సాగించాలని 
వుంది నా ప్రయాణం ?? 
(By Mercy )

Saturday, November 19, 2011

ఎవరు రాయని భావనివి నీవు
ఎవరు నడవని రహదారికి గమ్యానివి నీవు 
ఎవరూ కనని కలలకి ప్రతి రూపం నీవు
కవితంటే తెలియని నా మనసులోని భావాలకి
నా తొలి అక్షరం నీవు ... 

Friday, November 18, 2011

సంతోషాన్ని కూడా దుకాణాల్లో
కిలోల లెక్కన అమ్మితే ??
నవ్వు నవ్వు కి నోట్లోనుంచి
ముత్యాలు రాలితే ??
కోపం తో చుసిన వెంటనే కంట్లోంచి
అగ్ని బాణాలు దాడి చేస్తే ??
ప్రేమ కలిగినప్పుడు ప్రేమ దేవతలు
దిగి చుట్టూ నాట్యమాడి వీణలు వాయిస్తే ??
ఊహలకు జీవం వచ్చి పుష్పక విమానంలోకి
ఎక్కించుకొని ఊహ లోకంలోకి తీసుకెళ్తే ??
ఎలా వుంటుందంటావు చెప్పు
ఎగతాళి కాదు ఆ చట్రం లోనుంచి
బయటకొచ్చి ఆలోచించు .....

Thursday, November 17, 2011

అస్తమిస్తున్న సూర్యుడు
 నీ జ్ఞాపకాల నిధి తెరిచాడు
ఏమి ?చేయను ?


మది తలపులు బార్ల తెరిచి
నీ ఆలోచనకి 
ఆహ్వానం తెలిపాడు నా ప్రమేయం లేకుండా
ఏమనను ??


నీ జ్ఞాపకాల పుస్తకాన్ని తెరిచి 
మళ్లీ మళ్లీ చదవమంటున్నాడు 
ఎవరికీ చెప్పను ??


నీ జ్ఞాపకాల మూట విప్పి 
నీ ముద్ర లున్న ప్రతీది చూపుతున్నాడు
ఎలా ఆపను ??


నీవు రావని తెలిసిన విషయం 
చెబుదామంటే 
ఎగతాళి చేస్తాడేమో 
ఏమి చేయను ??

Wednesday, November 16, 2011

సముద్రమంత ప్రేమ తీసుకొని 

దోసిలంత ఇస్తాన్నన్నావ్ ... 
ఆ దోసిలంత ప్రేమ కోసం 
నేను దాహం తీర్చుకోడానికి 
తపిస్తుంటే ...
ఇవేమీ పట్టనట్టు నువ్వు దోబుచులడుతున్నావ్ ??

మేఘం అంత ప్రేమ నిస్తే  
చినుకంత చిరునవ్వు ఇస్తా అన్నావ్ 
ఆ చిరునవ్వు కోసం నేను నిరిక్షిస్తే 
నీ పరిస్థితుల భూమిని తాకి 
నా వైపుకే చూడకున్నావ్  ??


ఆకాశమంత ప్రేమ నిస్తే 
అణువంత కౌగిలి ఇస్తా అన్నావ్ ...
ఆ కౌగిలి కోసం నేను తపిస్తుంటే 
ఇదేమి పట్టనట్టు 
నన్ను నీ ఆటలో బాగం చేసి నా ఆటకు బదులు 
నీ ఆట ఆడమంటున్నావ్ ??
by mercy ...



జీవితం నేలకు తలవచింది... 
ప్రేమ ఓడిందా .. ??
అడుగులు తడబడుతున్నాయి 
ప్రేమ  వీడి పోయిందా ..??

ఆశల ఆకులు రాల్చుతున్న 
నిరీక్షణ వృక్షం ...
రెక్కలు తెగిపడిపోయిన ఊహల 
పక్షి స్వరం ...
కరిగిపోతున్న హృదయ క్రొవ్వత్తి 
రోదనం .....
కుప్పకూలిన నీతో నా ప్రపంచం 
వేరు చేస్తున్నయి  నన్ను ,, నా నుంచే 
నీ ఎడబాటు అలచనలు ప్రతిక్షణం ...

నేలకు తలవంచిన జీవితం తలనెత్తనివ్వు..
ప్రేమ కన్నా ఎక్కువైనా ప్రత్యామ్న్యాయం 
ఏముందో ఇప్పుడే ఇవ్వు  .... 
నీవైపు తిరిగానని హేళనగా చూడకు ...
నీ సమయం వచ్చిందని ఎగతాళి చేయకు..
నువ్వు తప్ప ఇప్పుడు ఎవరు లేరు 
నన్నునమ్ము సర్వాంతర్యామి నువ్వు ... 


Tuesday, November 15, 2011

నువ్వు నేను భూమి ఆకాశం 
తూరుపు పడమరల మద్య
 తెలియనంత దూరం ....
కలుసుకునే వీలు లేని గడియారపు 
ముళ్ళంత యెడం...
అందుకునేంత ప్రక్కనే వున్నా 
అందుకోలేని రైలు పట్టాలం ...!!


Sunday, November 13, 2011

నీ ప్రేమ కోసం
ఏడేడు సముద్రాలను నేను ఈదలేను
కానీ అన్ని సముద్రాలంత ప్రేమ ఉందని
నిరూపించే నీవైన ధైర్యం ఉందని చెప్పగలను ...


నీ ప్రేమ కోసం
ఆకాశ నక్షత్రాలన్నీ తెంచుకొని రాలేను
కాని నువ్వు కాదంటే ఆ తారల్లో ఒకటై
నిన్ను సంతోష పరచ గల నీవైన స్థైర్యం ఉందని చెప్పగలను


నీ ప్రేమ కోసం
తాజ్ మహల్ నేను కట్టలేను
కాని నా హృదయాన్ని నీ కోసం తీసివ్వగలను అనే
నిన్ను ఆరాదించే నీ పూజారిని నేను


నీ ప్రేమ కోసం
జీవితకాలం ఎదురు చూడగలనని చెప్పలేను
కానీ జీవితకాలం సరిపడే ప్రేమను
ఒక్క రోజుననే చూపి
ఆ ఒక్క రోజే చాలు అనుకొనే నీ బానిసను నేను ......

Saturday, November 12, 2011



నా మది  నిశ్చల తటాకం  
నీ స్పందన రాళ్ళతో నా మదిని కదిలించకు
నేను రాగం తెలియని వేణువు 
నీ పెదవుల తాకిడితో రాగం పలికించకు 

నేను రంగులు తెలియని వర్షం 
నాతో పాటు నువ్వు హరివిల్లులా  రాకు 
నా మనసు ఆకారం లేని శిలా పర్వతం ఉలివై నన్ను చెక్కి ఆకారం  అర్ధం నాకు తేకు ..

                                                                                                                                             నేను తిమిరం నిండిన మేఘం 
నీ ప్రేమ కాంతులతో నన్ను చీల్చకు ..
నేను ఏ భావనల  విషయమే లేని ఖాళి పుస్తకం 
నీ ప్రేమ ఊసులతో నన్ను నింపకు ...

నేను విచుకున్న పరిమళ సుమం 
భ్రమరమై నాపై వాలకు 
ఎప్పుడు వినని క్రొత్త అందాల రంగులను
నా హృదయంపై అద్దకు..

నన్ను నాలాగే ఉండనివ్వు
నీలాగా మార్చకు ...
నన్ను వున్న చోటనే ఉండనివ్వు 
నాలో కదలిక తెచ్చి ప్రేమ పిపాసిని చేయకు..





నీవు 
నేను
హిమము 
ఆవిరి 

శ్వాస 
నిచ్వాస 
ఆట 
విడుపు

మదిలో 
కౌగిలిలో 
ఇష్టంగా 
ఒదిగి

ప్రేమ 
ఝరుల
వర్షమై
కురిసి

ఏకమై
మేఘమై
చినుకుకు
స్థానమై

నిత్యం
నీవై
నాకు
నువ్వై 



Tuesday, November 8, 2011

తొలి చినుకై నన్ను చేరుకో ..
నా హృదయమే నీ కిస్తాను ,,!!
నదిలా నన్ను చేరుకో ...
నేనే నువ్వవుతాను... !!
ప్రకృతినే వరించే వసంతమై 
నా కోసం నువ్వస్తే ...
ప్రేమ చిగురుల పుష్పాలు నీ కందిస్తాను ....!!
ఒకసారి విశ్వాసంతో నీ ప్రేమ పంచు ...
జీవితకాలం నీ గుమ్మపు తోరణం అవుతాను ...
నా గుండెలో నిన్ను దాచుకొని నీ కోసం వెలిగే
దివ్వెనవుతాను...  (by mercy )

Wednesday, November 2, 2011


నీకు మాటలు వస్తాయని ఇంతవరకు నేను అనుకోలేదు ..
ఎప్పట్నుంచో అనుచుకున్న నీ బాధను 
మరీ ఈ సమయంలో ఇలా చెపుతవానుకోలేదు ...!!

నన్ను మైమరిపిన్చేట్టుగా నీ ప్రేమ మాటలు వినాలనుకున్నా కానీ 
నన్ను నన్నుగా దహించేలా  అశక్తురాలనైన సమయంలో 
ఒంటరితనపు చితిపై దహిస్తవనుకోలేదు ...!!

నా మట్టుకు నేను నిన్ను నీకు తెలియకుండా 
ఇష్ట పడడం నా తప్పే ...కానీ ,
నీకు తెలియదన్న భ్రమలో నా ప్రేమను 
అప్పుడో ఇప్పుడో గ్రహించలేదన్న అబద్ధం చెప్పకూ ..!!

నీతో మాట్లాడుతున్నంత సేపు నీ గాయాలకి 
కొంతైనా ఉపశమనం అవుదామనుకున్నా..
నీ కంటి నుండి నీ గత ప్రేమ తాలుకు అశ్రువులు రాలుతుంటే 
స్వాతి చినుకుల్లా నా హృదయం లో దాచి పెట్టుకుని 
ఆనందాన్ని నీకు తిరిగి ఇవ్వాలనుకున్నాను ..!!

నీ మౌనం లో నీ ఊహల్లో ,,నీకు దూరమైనా ప్రేమ కోసం 
నువ్వు వెతుకుతూ  ఆరాటపడ్తుంటే ,,
నీకోసం నన్ను నేను వదులుకునైన నీకు 
ఆ ప్రేమను వెతికి తేచిపెట్టి నీ మొహం లో 
సంతోషం చూడాలన్న తాపత్రయం ,,,,,!!

నా ప్రేమైన నీవు , నీ ప్రేమ కోసం  పడే తపన చూస్తుంటే 
నీ ప్రేమలో నిన్ను గెలిపించి నా ఓటమిని నీ గెలుపు సంతోషంతో 
మర్చిపోదమనుకున్నా ,,,!!

నీకు తెలియదని అనుకున్నా నన్ను నా కనులోతుల్లో 
దాకున్న నా ప్రేమను నువ్వు గ్రహించి కుడా 
నీ ఒంటరి తనపు చెరసాల నుంచి నిన్ను నువ్వు 
విదిపించుకోలేక బాధ పడ్తున్నానని తెలుసుకున్నాను  .!!

నీ మధుర జ్ఞాపకాలుగా భావించే సంకెళ్ళే నీకు 
సంతోషం అనుకొని లోకం నుంచి వేరై నీ లోకం ఏర్పర్చుకున్నా...
నీతో పాటు అదే లోకంలోకి నేను అడుగు పెట్టె అర్హత సంపాదించడానికి 
ఎంత కష్టపడ్డానో తెలిసి కూడా చూడ లేనంత 
అసహాయుడవు కాదు కదా ..!!

ఏమి అనలేక నీ కొరకైన నా ప్రేమ నిన్ను చేరలేక తనని 
తాను దాహించుకుంటూ మూగదై కారుస్తున్న కన్నీరును
గ్రహించి కూడా... గ్రహించాలేనంత నటన ప్రదర్శించి 
నీ మాటల ఓదార్పు దూరాన్ని వుపయోగించి 
తూర్పున నువ్వుంది పశ్చిమానికి నన్ను నేద్తుంటే 
ఎలా ?? ఏమి చేసేది ??
అపార్దం చేసుకోకు ..
నా పరిస్థితి  నీ పరిస్థితి లాంటిదే కదా ...
ఎదురుచుస్తుంటా నా ఒంటరి తనాన్ని
నీ ప్రేమ వసంతం వరించే వరకు ....
నీవు నేనై ...... 
(by mercy )

Wednesday, October 26, 2011

నా దృష్టిలో ప్రేమ

ప్రస్తుతం నా దృష్టిలో ప్రేమ అనే అర్ధం ఏంటంటే ...
-" నాకేం వస్తుందని అలోచించి మొదలయ్యే ..
అవకాశ పూరిత ఆకర్షణకు లోనైనా హృదయాల ..
కలయికకాక పోయిన ,కలయిక అనే పేరుతో ..
భ్రమలో వుండే ఒక స్థితి .."
అందుకే దాన్ని నా దరి చేరనివ్వదు అనుకుంటున్నా .....
(by mercy)

Tuesday, October 25, 2011

ఇక సెలవు

హృదయాన్ని కోయడం ఎలాగో నీ నుంచే 
తెలుసు కోవాలి ....!!
చెప్పే మాట  ప్రతీది హృదయం లో నుంచి 
వస్తున్దంటావు గా ...!!
మరి వచ్చే ప్రతి మాట వెనక దాని ఉద్దేశాని 
అర్ధం చేసుకోలేనంత వెర్రి దాన్ని కాదు కదా !!
ఎవరు ఆరిపోతున్న దివ్వేని వెలిగించ మన్నారు ...??
ఎవరు కలలే తెలియని నా కనులకి కలలు నేర్పించామన్నారు ??
ఎవరు నా ప్రయాణం లో నా బాటసారిగా నా వెంట రమ్మన్నారు ??
అడిగితే సమాదానం కూడా చెప్పలేని నిన్ను నేను ఎందుకు 
నా మనసులోకి అనుమతిచ్చాను ??
ఇప్పుడు బాధపడ్డం వల్ల ప్రయోజనం లేదని తెలుసు ...
కాని దిద్దుకోడాని సమయం దాటిపోలేదని అర్ధం చేస్కున్నాను ...
ఇది చెపుదామనే ఇక్కడున్నాను ...
చెప్పానుగా ఇక సెలవు తీస్కుంటున్నాను ....
నీ జీవితం నీదే ఎప్పుడైనా ... నాది చేయమని అదగలెదూ ...
కానీ నాదని చెప్పిన మనసును ఇంకేవరికోసమో ఆలోచించేట్టు 
చేయడం జీర్నిన్చుకోలేను ....అందుకే  ఇరుకైన నీ మనసునుంచి
స్వచ్చందంగా తప్పుకోవలనుకుంటూన్నాను ....