Thursday, March 29, 2012


ప్రేమకి నమ్మకమనే
కొత్త బట్టలు వేసా ..
ఇప్పుడింకా అందంగుంది ..!!!
అనుమానపు చినిగి పోయిన
చొక్కయితో చింపిరిగా కనిపించి
నన్ను ఇబ్బంది పెట్టింది .. !!
ఎంత మొరాయించింది
అనుమానాన్ని మార్చడానికి
బద్ధకం ఎక్కువైంది దానికి
అందుకే బుజ్జగింపుతో సరిపెడదాం
అనుకున్న కాని మందలింపుతో కూడా
కాని పని .. ఆకలింపుతో
ఆప్యాయత స్పర్శతో అయ్యింది .. !!
నమ్మకంతో ఇప్పుడు కనిపిస్తున్నంత
అందంగా ఎప్పుడు లేదది
చూడ ముచ్చటేస్తున్న ప్రేమ
నా బంగారం ఇప్పుడది .. !!!


ప్రపంచం నీక్కొక్కటే కావచ్చు
కాని ప్రపంచానికి కోట్లలో నువ్వొక్కడివి ...
ప్రాణం నీకొక్కటే కావచ్చు 
కానీ ఎన్నో ప్రాణాలకి ఆశవి ...
జీవితం నీకొక్కటే కావచ్చు 
కాని కొన్ని జీవితాల మనుగడకు ఆధారానివి... 
నీకు నీవు ఒక్కడివే కావొచ్చు
కాని ఉత్తేజమై ఎగిసే శక్తికి 
చీకటినిండిన జీవితాలకు వెలుగయ్యే దీపానివి 
ఆత్మీయత కోసం ఎదురు చూసే హృదయాలకు స్నేహానివి .. 
ప్రతి తప్పును కప్పి అందరికి సమాధానం పంచే ప్రేమవి !!!

Monday, March 26, 2012

గాయపడ్డ హృదయం

ఏముంది నాలో నీకివ్వడానికి 
గాయపడ్డ హృదయం 
మతి తప్పిన మనసు తప్ప ..

నువ్వు త్రవ్వి  వెళ్ళిన గుంటలు 
గుండెల్లో జ్ఞాపకాల
మూల్గులు వినిపిస్తుంటే ..

నువ్వు విడిచి వెళ్ళిన 
పాదముద్రలు మనసున 
నీ స్మృతుల జాడలు 
చూపిస్తుంటే ...

ఆశలను కప్పి ..అయువునే చుట్టి 
ఆవేశాన్ని గుప్పి .. ఆప్యాయతను జొప్పి 
నన్ను నేనే మరుగుచేసుకున్నా
నేను అనే దాన్ని కనిపించి మళ్లీ
నీ గతమై నిన్ను ఇబ్బంది పెట్టకుండా ..
నీకోసం వసంతం అవకపోయినా 
దారి తొలగి దాన్ని ఆహ్వానించే 
నీ ప్రేమ ద్వారపాలకురాలిగా .. 
నీకు కాలేని నీ దానిలా ..  


Friday, March 23, 2012

ఎవరో వినాలని మెచ్చుకోవాలని
 కోయిల  పాడదుగా ..
నిరుత్సాహం ఎందుకు ?
నీరుగారడం ఎందుకు ?
నీకు నీవే సాటిగా ..!!

నీలో జిజ్ఞ్యాస
నీ పై నీకే ఆశ 
నీ పనిలో నైపుణ్యం
నీకుండగా ..
ప్రశంసలకోసం .. ప్రోత్సహంకోసం
ఎదురుచూడడం  ఎందుకు ?
నీకై నీవు చేసే ప్రతిపనిలో 
విజయం కోసం ఆశించు 
విజయమే నీకోసం 
వెతుక్కుంటూ రాదా ?
విజయం యశస్సులు 
నీ బానిసలవగా .. !!! 


Thursday, March 22, 2012

ఎంత భాగ్యం ...

యేసు 
నిన్ను చూచిన కనులకు 
ఎంత భాగ్యం ...
నీ సమయంలో నైనా పుట్టకపోతిని ..!!
యేసు 
నీ మాటలు విన్న చెవులకు
ఎంత భాగ్యం...
నే లాజరు నైనా కాకపోతిని ..!!
క్రీస్తు 
నిన్ను తాకిన చేతులకెంత భాగ్యం..
మగ్దలేనే మరియనైన కాకపోతిని ..!!
యేసు
నీ శ్వాస తాకిన శరీరాలకెంత భాగ్యం 
నే నీ శిష్యులలో ఒకడినైన కాకపోతిని ..!!
క్రీస్తు 
నీ చేతులు తాకిన జీవితాలకెంత భాగ్యం 
శవమై తిరిగి లేచిన యాయిరు కుమార్తేనైన 
కాకపోతిని ..!!
యేసు ... నన్ను తాకుము 
నా క్రీస్తు నీ మాటలతో హృదయ శుద్ధి నిమ్ము ..
నిన్ను చూడగా నా కనులు వెతుకుచుండగా 
నీకై పరుగెత్తగా నా పాదములే 
నీవిగా చేసి 
నీకై నేను యేసు 
నాకై నీవుగా ...   

Wednesday, March 21, 2012

రాజ్యమేలుతున్న ధనం
మనిషికి మనిషికి గోడ కడుతూ 
సుఖాన్ని కొనిస్తూ 
అంతకు మించి దుఖాన్ని బహుకరిస్తూ ..
అనురాగం ఆప్యాయతలు 
అంగడి వస్తువులుగా చేస్తూ ...
రంగులు పులుముకున్న
ప్రేమనే వాస్తవమని చూపుతూ ...
మోసం ద్రోహం 
అలవోకగా బడికెల్లకుండానే నేర్పుతూ 
నా నుంచి నన్ను ..
మనం నుంచి .. నిన్ను వేరు చేస్తూ 
స్వాభిమానం మంట గలుపుతూ
స్వంత ప్రయోజనం వంటపట్టిస్తూ 
అమ్మ నాన్న .. అక్క చెల్లి 
ప్రేమలే వాణిజ్యం చేస్తూ 
సంబంధాలు స్పందించని బండలుగా 
సామిప్యాలు పక్కనే వున్నా సెల్ ఫోన్ 
కాల్ లా ..
రోజంతా నిన్ను యాంత్రికం చేస్తూ 
నా అన్నవారినే ఎవరకి వారిని చేస్తూ 
ఆలోచనలని ఆటవస్తువే చేస్తూ .. 
నన్ను నేను .. ఎవరినో చేస్తూ 
మనసునే కృత్రిమం చేస్తూ .. 


రాజ్యమేలుతున్న ధనం
మనిషికి మనిషికి గోడ కడుతూ 




Monday, March 19, 2012

నీ మాటల ద్రాక్షలు 
ఇంత తీయనా ?
నీ చూపుల బాణాలు 
ఇంత పదునా ?
నీ శ్వాస వదిలే గాలి 
ఇంత వెచ్చనా ?
నీ పేరులో పదాలకు 
ఇంత మాధుర్యమా ?
నీ చేతి స్పర్శకు 
ఇంత సౌఖ్యమా ?
నీ ఆలోచనే ఇంతా సుఖమైనా 
ఎలా ఉండగలను నిన్ను వదిలి 
క్షణమైనా ..

Sunday, March 18, 2012

మేఘమై వచ్చావ్ 
వర్షమై తడిపావ్
నీ జ్ఞాపకాల నదులు నింపి 
నీ ఆలోచనల ప్రవాహంలో 
నన్ను ముంచి 
నీలోనే నన్ను దాచిఉంచి 
బయట ప్రపంచానికే నన్ను దూరం చేసావ్ 
నేస్తమా , నా ప్రియతమా
నీలో కలవనా నదినై
నీలో తిరిగి చేరనా సింధువునై 
నేనే ... నీవై 

Saturday, March 17, 2012

నువ్వు అలా చూడకు 
ఒక్కసారే ప్రపంచం అంతా మల్లెలు 
విచ్చుకుంటే ??

నువ్వు అలా పిలవకు 
ఒక్కసారే కోకిల రాగం ,మోహన రాగాలను 
మించిపోతే ??

నువ్వలా అలగకు 
ప్రంపంచంలోని పుష్పాలన్నీ మూతి
ముడుచుకుంటే ??

నన్నిలా తాకకు 
మతి తప్పి నా హృదయం 
పిచ్చిదైతే..??
నా గుండెలయ తప్పి కొట్టుకోవడం
మరిచిపోతే ...??


Tuesday, March 13, 2012

నీ ఓరచూపు చాలు నాకు
అలసిన వేళ అమృతం కురిపిస్తూ
నీ నోటి మాట చాలు నాకు
నిదురపోతున్న నా ప్రేమను తట్టి లేపుతూ 
నీ నవ్వులోని సవ్వడి చాలు నాకు 
నా ఒంటరి తనాన్ని తరిమివేస్తూ
నీ చేతి స్పర్శ చాలు నాకు 
నేనున్నానని అనుకునే ఆప్యాయత పంచుతూ ...
నీవుంటే నాకు చాలు
ఏదైనా నీకోసం ,నీతోనే అని ధైర్యాన్ని నింపుతూ ..
జీవితం ఎన్ని పాఠాలు నేర్పిందో 


ఆ నవ్వుకు అందుకే అంత ధీమాగా వుంది ..

ఎంత కష్టాల కొలిమిలో

కాలిందో ఆ నవ్వు ... అందుకే అందంగా వుంది

మూగ బోయిన కోరికలు ఏమి నూరిపోసాయో 

ఆ నవ్వుకి 

నేలకొరిగిన ఆశలు ఏమని హామీ ఇచ్చాయో 

ఆ నవ్వుకి 

ఇబ్బందుల ముళ్ళ మద్య విచ్చుకున్న నవ్వుకి ..

జోహార్లు ..పెదాలపై  నాట్యం నేర్పిన పరిస్థితులకి ...!!

 నోటినిండా నవ్వి ఎన్నేళ్ళు  అవుతుందని 

అడుగుతున్న నవ్వుకి ...

సమాదానం చెప్పే సమయం వచ్చిందేమో ??

సమస్యకి పరిష్కారం అయ్యే నవ్వుకి

బదులిచ్చే సమయం వచ్చిందేమో .. ?

పెదాల పలకలపై నవ్వును దిద్దే సమయం

ఇదేనేమో .. 

నేస్తమా ..



Saturday, March 10, 2012

గుండెను గుచ్చే బాణం నీ అనుమానం ... 


అయినా నీ మీద కోపం రాదే ?



కంటిని కన్నీటితో నింపే ప్రేమ



అర్ధం నీకెందుకు తెలియదే ..?



మనసును తెలుసుకున్నా అనుకునే



నీ అమాయకపు ముర్కత్వం 



మనసు ముక్కలవుతుంటే నీకు అగుపడదే ..?



పొడి పొడి మాటలతో నా మనసును తడి చేసే నీకు 



నా కన్నీటి స్వరం విన్పించే అవకాశం నువ్వివ్వలేదే ?



అయినా .. వదలలేను మార్పు వసంతం 



వస్తుందని ఎదురు చూపు ..



తొలకరిలా మళ్లీ నమ్మకం కురుస్తుందని



ఎదురు చూపుల ఆశలు ..

Thursday, March 8, 2012

మమతాను రాగాలు పంచుతూ 

పెంచుతాను కడుపులోనుంచే 
అమ్మనై ...
ఆత్మీయను రాగాలు నేర్పుతూ 
సాగుతాను అడుగడుగునా 
తోబుట్టువునై ....
ప్రేమాను బంధాలు  రుచి చూపుతూ 
కూడుతాను ఇరుకటుంబాలను  
ఆలినై, అర్ధాంగినై ,
చెలినై ,నిచ్చెలినై ..
సామిప్యాలు సమస్యలను తెల్సుకుంటూ 
ప్రోస్త్సహిస్తూ బలపరుస్తాను 
ఆడబిడ్డనై.. 
వృద్దాప్యంలో కూడా లాలిస్తూ 
అనుభవాలు నెమరు వేస్తూ 
జీవితాన్ని  నేర్పుతాను 
అమ్మమనై.. 
మూర్తీభవించి అణువనువు 
సహనం ..క్షమా .. జాలి .. కరుణలకు 
మారు పేరై

ఎవరు అంగీకరించినా ... అంగీకరించకున్న
నా అస్తిత్వాన్ని 
ఎవరు బలపరిచినా .. ప్రోత్సహ పరచకపోయినా 
నా ఆత్మ విశ్వాసాన్ని ..
ఎవరు దైర్య పరిచినా లేకున్నా 
నా జయపజయాలని ..
గురై నలిగి పోయినా మోసానికి 
కీచకుల దురశాలకి 
కరిగి పోతున్నానని  తెలిసినా 
జీవిత చక్రంలో 
నన్ను నేను మరిచిపోతున్నా .. 
సాగుతున్నా ..
అబలనై .. సబలనై ..ఆత్మ బలాన్నై
నేను స్త్రీనై ..

కలలదేరంగు .. ?

కలలదేరంగు .. ?

కన్నీటిదేరంగు .. ?


మనసుదేరంగు..?


ప్రేమదే రంగు ..?


నీ జ్ఞాపకాల మొత్తనిదేరంగు ..?


మన పరిచయాల సుమానిదేరంగు ?


తెలుపు నలుపుల 


వెలుగు నీడల..


సుఖ దుఃఖ 


పసుపు ఎరుపుల ..


ప్రేమ విరహాల 


నీలి మేలిమివర్ణపు .

.
కలగలుపుల చిత్రపటమై 


ఆస్వాదించని ఆనందం జీవితం


ఆసాంతం రంగులమయమై 


సాగని జీవితం రోజు హొలీఅయి ..