ఏముంది నాలో నీకివ్వడానికి
గాయపడ్డ హృదయం
మతి తప్పిన మనసు తప్ప ..
నువ్వు త్రవ్వి వెళ్ళిన గుంటలు
గుండెల్లో జ్ఞాపకాల
మూల్గులు వినిపిస్తుంటే ..
నువ్వు విడిచి వెళ్ళిన
పాదముద్రలు మనసున
నీ స్మృతుల జాడలు
చూపిస్తుంటే ...
ఆశలను కప్పి ..అయువునే చుట్టి
ఆవేశాన్ని గుప్పి .. ఆప్యాయతను జొప్పి
నన్ను నేనే మరుగుచేసుకున్నా
నేను అనే దాన్ని కనిపించి మళ్లీ
నీ గతమై నిన్ను ఇబ్బంది పెట్టకుండా ..
నీకోసం వసంతం అవకపోయినా
దారి తొలగి దాన్ని ఆహ్వానించే
నీ ప్రేమ ద్వారపాలకురాలిగా ..
నీకు కాలేని నీ దానిలా ..