నీ ఓరచూపు చాలు నాకు
అలసిన వేళ అమృతం కురిపిస్తూ
నీ నోటి మాట చాలు నాకు
నిదురపోతున్న నా ప్రేమను తట్టి లేపుతూ
నీ నవ్వులోని సవ్వడి చాలు నాకు
నా ఒంటరి తనాన్ని తరిమివేస్తూ
నీ చేతి స్పర్శ చాలు నాకు
నేనున్నానని అనుకునే ఆప్యాయత పంచుతూ ...
నీవుంటే నాకు చాలు
ఏదైనా నీకోసం ,నీతోనే అని ధైర్యాన్ని నింపుతూ ..