ఎవరో వినాలని మెచ్చుకోవాలని
కోయిల పాడదుగా ..
నిరుత్సాహం ఎందుకు ?
నీరుగారడం ఎందుకు ?
నీకు నీవే సాటిగా ..!!
నీలో జిజ్ఞ్యాస
నీ పై నీకే ఆశ
నీ పనిలో నైపుణ్యం
నీకుండగా ..
ప్రశంసలకోసం .. ప్రోత్సహంకోసం
ఎదురుచూడడం ఎందుకు ?
నీకై నీవు చేసే ప్రతిపనిలో
విజయం కోసం ఆశించు
విజయమే నీకోసం
వెతుక్కుంటూ రాదా ?
విజయం యశస్సులు
నీ బానిసలవగా .. !!!