....నేనొకబిందువును ... కోటి వర్షపు చినుకుల్లో ఒకటై మీతోనే ... నేనొక భావాన్ని కోటి భావాలు పలికించే మానస వీణ మౌనాన్ని .. హృదయంలో ఊరే భావాలను తోడుకోవాలనుకునే గవాక్షాన్ని .. మనసు పాడే మౌనగీతాన్ని
Thursday, March 8, 2012
కలలదేరంగు .. ?
కలలదేరంగు .. ? కన్నీటిదేరంగు .. ? మనసుదేరంగు..? ప్రేమదే రంగు ..? నీ జ్ఞాపకాల మొత్తనిదేరంగు ..? మన పరిచయాల సుమానిదేరంగు ? తెలుపు నలుపుల
వెలుగు నీడల..
సుఖ దుఃఖ
పసుపు ఎరుపుల ..
ప్రేమ విరహాల
నీలి మేలిమివర్ణపు . .
కలగలుపుల చిత్రపటమై
ఆస్వాదించని ఆనందం జీవితం
ఆసాంతం రంగులమయమై
సాగని జీవితం రోజు హొలీఅయి ..