Tuesday, March 13, 2012

జీవితం ఎన్ని పాఠాలు నేర్పిందో 


ఆ నవ్వుకు అందుకే అంత ధీమాగా వుంది ..

ఎంత కష్టాల కొలిమిలో

కాలిందో ఆ నవ్వు ... అందుకే అందంగా వుంది

మూగ బోయిన కోరికలు ఏమి నూరిపోసాయో 

ఆ నవ్వుకి 

నేలకొరిగిన ఆశలు ఏమని హామీ ఇచ్చాయో 

ఆ నవ్వుకి 

ఇబ్బందుల ముళ్ళ మద్య విచ్చుకున్న నవ్వుకి ..

జోహార్లు ..పెదాలపై  నాట్యం నేర్పిన పరిస్థితులకి ...!!

 నోటినిండా నవ్వి ఎన్నేళ్ళు  అవుతుందని 

అడుగుతున్న నవ్వుకి ...

సమాదానం చెప్పే సమయం వచ్చిందేమో ??

సమస్యకి పరిష్కారం అయ్యే నవ్వుకి

బదులిచ్చే సమయం వచ్చిందేమో .. ?

పెదాల పలకలపై నవ్వును దిద్దే సమయం

ఇదేనేమో .. 

నేస్తమా ..