Wednesday, March 21, 2012

రాజ్యమేలుతున్న ధనం
మనిషికి మనిషికి గోడ కడుతూ 
సుఖాన్ని కొనిస్తూ 
అంతకు మించి దుఖాన్ని బహుకరిస్తూ ..
అనురాగం ఆప్యాయతలు 
అంగడి వస్తువులుగా చేస్తూ ...
రంగులు పులుముకున్న
ప్రేమనే వాస్తవమని చూపుతూ ...
మోసం ద్రోహం 
అలవోకగా బడికెల్లకుండానే నేర్పుతూ 
నా నుంచి నన్ను ..
మనం నుంచి .. నిన్ను వేరు చేస్తూ 
స్వాభిమానం మంట గలుపుతూ
స్వంత ప్రయోజనం వంటపట్టిస్తూ 
అమ్మ నాన్న .. అక్క చెల్లి 
ప్రేమలే వాణిజ్యం చేస్తూ 
సంబంధాలు స్పందించని బండలుగా 
సామిప్యాలు పక్కనే వున్నా సెల్ ఫోన్ 
కాల్ లా ..
రోజంతా నిన్ను యాంత్రికం చేస్తూ 
నా అన్నవారినే ఎవరకి వారిని చేస్తూ 
ఆలోచనలని ఆటవస్తువే చేస్తూ .. 
నన్ను నేను .. ఎవరినో చేస్తూ 
మనసునే కృత్రిమం చేస్తూ .. 


రాజ్యమేలుతున్న ధనం
మనిషికి మనిషికి గోడ కడుతూ