Thursday, May 31, 2012

మనసుకి కితకితలు




ఆ బుగ్గల్లో ఎరుపుసిగ్గు .. చూసి 
పువ్వులే కుల్లుకుంటుంటే...
గిల్లిపోయే బుగ్గను నీ చిలిపి చనువు
కందిపోయే లా...

తేలికైపోదా హృదయం ... 
నీ మాటల మధువు తాగి
ఎన్ని పదాల పూలేతికి తెచ్చిందో 
మనసు తుమ్మెదై 
నీ తీపి దాచుకోడానికి గుండె తట్టేలో..

మాటలకి హోయలద్దే
నీ భావాల జల్లులో తడిచేందుకు 
ఎప్పుడు సిద్ధమే..
వర్షమై నను తడిపి 
మనసుకి కితకితలు పెడతావని 

♥♥ BY- Mercy Margaret (30/5/2012) ♥♥

Wednesday, May 30, 2012

సిరి సిరి మువ్వలు (FEMTO's)


నాతో ఉన్నావన్నఅబద్ధమే 
హాయిగుంది .. నిజంగా నువ్వులేని శూన్యం కన్నా ...


ఓడిపోవడం కూడా హాయే .. 
నీ సాంగత్యపు రుచి కోసం ....


నీదైన ఏదో జ్ఞాపకం ... 
నిశబ్దాన్ని చీల్చి నన్ను హత్తుకుంది ...


విమర్శల దారుల్లో ..
విజయ రహస్యాల సొరంగాలు వెతుకు....


మనసు పొగలు కక్కుతుంది .. 
ఎవరో ప్రేమ నిప్పు అంటించారు ..




Tuesday, May 29, 2012

సిరి సిరి మువ్వలు (FEMTO's)

నువ్వు కరిగే మంచు చూస్తావ్ ... 
నే ప్రకృతిని మెత్తగా తడిమే ప్రేమ చూస్తా...!!

నీ పేరు వినగానే ... 
నవ్వు వెనక పెదాల ఆలింగనం చూడు .. !!

ఎదురౌతావ్ .. ఎదనుగిల్లి .. 
మాట్లాడక మౌనంతో మనసు పలికిస్తావ్ ...!!

ఈ రోజు నవ్వు చెల్లించలేదు ..
అందుకే నా శ్వాస జప్తు చేసుకున్న ప్రేమ ... !!

చావెక్కడిది ..
శరీరంతో పని లేని నీకు - ప్రేమా ??!!.

నీ గుండె లోతెంతని కళ్ళను -
ప్రశ్నిస్తే ... కన్నీళ్లనడిగి తెలుసుకోమంది ..!!

మనసు పొగలు కక్కుతుంది .. 
ఎవరో ప్రేమ నిప్పు అంటించారు ..!!

ప్రేమ..మాటలనే 
మరిచిపోయేలా చేసే మౌన శిక్ష !!

నీ ఊపిరి మాలలల్లి 
నా హృదయం తో మాట్లాడించకు .,..!!

మూలాన కూర్చొని ఏడుస్తున్న
ప్రేమ ..తనకు పట్టిన దౌర్భాగ్యాన్ని చూసి ..!!

తన తలపులతో 
నా గొడవ ... నా ప్రశాంతత నాకిచ్చేయమని ..

నీ మాటలే నా చెవిపోగులు ..
నువ్వు లేనప్పుడు నీ స్వరం వినిపిస్తూ ...!!

తెలుసుకోవాలని కోరిక ... 
తుమ్మెద పూవు చెవులో చెప్పే గుస గుస ..!!

అర్ధం లేకుండా 
నువ్వే పని చేయవు కదా ....

ఆ పొగరుకి కళ్ళెం వేసి ... నా
...బానిస చేస్కోని స్వారి చేయాలనీ కోరిక ....!!


Monday, May 28, 2012

బడి

నా కన్నీలు 
నిన్ను అడుగుతున్నాయి .. 
ఇంకా అలాగే నాబాల్యాన్ని 
దాచుకున్నవా అని ??..

మనసు బాగోలేదు ..
అందుకే 
మళ్ళోసారి నా బాల్యాన్ని 
దాచుకున్న నిన్ను 
చూడాలని వచ్చా ... 

నువ్వేం మారలేదు 
వయసు మీద పడుతున్న 
అంతే హుందాగా 
ఎన్నో జ్ఞాపకాలని 
దాచుకొని ..తాజాగా 
వున్నావ్ ..

అవును .. మొదటి రోజు 
భయం భయంగా ..
నీ ఒడిలోకి అడుగుపెట్టిన 
నన్ను ఇంకా చూపిస్తున్నావ్ ..
నిజం ..
ఎంత తేలికగా వుందో 
నా మనసు .. ఇప్పుడు ఆ రోజును 
మళ్ళీ ఓసారి గతంలోకెళ్ళి 
చూస్తే ...కళ్ళు చెమర్చకపోతే 
ఏలా ?

అరే... ఆ బెంచి మీద నేను రాసిన 
రాతలు 
మూడో  తరగతి గదిలో ..
పాతబడ్డా
అలాగే వున్నాయి 
వెళ్ళిన నన్ను చూసి నవ్వుతూ .. 
పలకరిస్తునాయి ..
నాల్గవ తరగతి కిటికీ 
వేస్తూ నలగొట్టుకున్న వేలు 
అల్లరి చేస్తూ అయిదవ తరగతి 
టీచర్ తో తిన్న చెంపదెబ్బలు :(
ఏడవ తరగతి పుబ్లిక్ పరీక్షల్లో 
కొట్టలేక కొట్టిన కాపీలు 
శ్రమ దానం అని తొమ్మిది 
పది తరగతుల్లో ఊర్లు 
తిరుగుతూ చేసిన అల్లర్లు 
సరదాలు ..
ఇంకా తాజాగానే కనిపిస్తున్నాయి 
సుమా .. 


ఎక్కుతున్నప్పుడు 
ఒక్కోమెట్టు 
చిన్న బూట్లేసుకొని 
నేనెక్కిన చిత్రాలే చూపిస్తూ 
అప్పట్టి .. నా ఆలస్యానికి 
నా హడవిడిని 
గుర్తు చేస్తూ నవ్వుతున్నాయి .. 

నా స్నేహితురాళ్ళతో 
కలిసి పిచ్చి పిచ్చి గా 
తిరిగిన నా  బడివైన నీలో 
అడుగడున నా బాల్యం 
తాలుకు జ్ఞాపకాల 
సువాసనలు గుప్పిస్తూ .. 
నా బాధను దూరం చేస్తూనే 
నా ముందు కదలాడుతున్నాయి  .. 

నీళ్ళు తాగుతూ 
వరుసగా వున్నా ఆ 
కొల్లాయిల  దగ్గర పడ్డ 
ఆకతాయి గొడవలు ..
మద్యాహ్నం  గోడలు దూకి 
ఇంటికొచ్చిన రోజులు ...
దొంగిలించి తిన్న నేస్తం 
డబ్బాల కొద్ది చిరుతిండ్లు. 
ఎర్రసిరాతో .. టీచర్ గారిలా 
దిద్దుకొని వేసుకున్న 
మార్కులు .. 
సమయం అయిపోయినా 
బడిలోనే ఉండి  ఆడుకొని 
ఆలస్యంగా ఇంటికొచ్చి 
అమ్మతో పడ్డ దెబ్బలు ..
వర్షంలో తడిచి వేడి వేడి గా 
కొనుక్కొని తిన్న బజ్జీలు 
ఆలస్యంగా బడికెళ్ళి 
స్కూల్ గ్రౌండ్ శుభ్రం చేసిన 
శిక్షలు ..అన్నీ .. 
అన్నిభద్రంగా చుపిస్తున్నావ్ 

మనసు తేలికయి  గాలిలో తేలుతూ 
వదిలి వచ్చిన బాల్యం .. 
ఆ చిన్ననాటి 
విద్యార్ధి జీవితం 
నాకు గుర్తొచ్చి  
మళ్ళీ కావాలనిపిస్తుంది ... 
మల్లోసారి .. బాల్యం తెచ్చుకొని 
నీ ఒడిలో తిరిగి అడుగు పెట్టాలని 
ఉంది  .. 

అమ్మ తర్వతా .. 
అమ్మలా నువ్వు బడివై 
నన్ను హత్తుకొని 
ఎన్నెన్ని నేర్పావ్ .. 
ఎన్ని మధుర స్మృతులు 
మిగిల్చావ్ .. 
ఏమిచ్చినా నీకు తక్కువే .. 
ఎలా వర్ణించినా  తక్కువే .. 
అందుకే నా కన్నీళ్లు కుడా 
నీ పాదాలను తాకి 
నవ్వుతున్నాయి ..
నీతో నీలో దాచుకున్న 
నా జ్ఞాపకాలని 
నా బహుమతులుగా ఇస్తున్నందుకు 
శిరసు వంచి నీ పాదాలను 
ముద్ధడుతున్నాయి ... 










Saturday, May 26, 2012

ఏడుస్తున్న ప్రేమ

ఒక మూలాన కూర్చొని 
ఏడుస్తున్న ప్రేమ 
తనకు పట్టిన
దౌర్భాగ్యాన్ని చూసి 

మారుతున్న కాలంతో పాటు 
తనను కూడా మార్చేస్తున్న 
మనుషులను చూసి 

తనను ఆటగా మారుస్తున్న 
మూర్కులైన పాషాణ 
హృదయులను చూసి 
ప్రేమనే సరిగా అర్ధం చేసుకోని  
జులాయిగా పేరు తగిలించుకున్న 
ప్రేమికులను చూసి ...

తన ఆత్మ దైవత్వం 
తన తనువు త్యాగం 
తన అందం అందరిని ఆదరించడం 
తన శ్వాస కరుణాంమృతం 
క్షమాపణ తన స్వరం 
సహనం జాలి తన స్వభావం 
ప్రోత్సాహం తన ప్రవర్తన 

అలాంటి తనను 
ఒకరు ఉరి తీస్తున్నారు 
ఒకరు గొంతు కోస్తున్నారు 
ఒకరు తగల బెడుతున్నారు 
ఒకరు ఆసిడ్ దాడులు చేస్తున్నారు 
తన పేరునే ఆట బొమ్మని చేసి 
ఆడుకుంటున్నారు 
తనను ముసుగుగా వేసుకొని 
మోసం చేస్తున్నారు 

నాలుగు దారుల కూడలిలో 
అంగడి వస్తువుని చేసి 
తన పవిత్రమైన దుస్తులు విప్పి 
నవ్వుల పాలు చేస్తున్నారు 

కరిగిపోయే తన స్వభావాన్ని 
కన్నీరోలికే వరకు వదలక 
మోసం ,అసూయా ,ద్వేషం,కుళ్ళు 
సాయంతో ..
తేనె పూసిన ఆలోచన కత్తులతో 
పొడిచి పొడిచి గాయ పరుస్తున్నారు 

సంతోషానికి నెలవైన తనని 
ఒంటరికి బానిస చేస్తూ 
ఓడిస్తూ ఉంటే  ...
ఏమి చేయలేక 

ఒక మూలాన కూర్చొని 
ఏడుస్తున్న ప్రేమ 
తనకు పట్టిన
దౌర్భాగ్యాన్ని చూసి ...

(శుక్రవారం రోజున 25/5/2012 న అమలాపురం లో  వరలక్ష్మి అనే అమ్మాయి మీద కిరణ్ కుమార్ అనే వ్యక్తి 
ప్రేమోన్మదియై కత్తి దాడి చేసి గొంతు కోసిన వార్తను చదివి చలించి రాసినది )

మొక్క

తన పచ్చని దుస్తులను 
తను వేడి వేడి చేతులతో లాగుతూ 
రంగులు  మారుస్తుంటే 
తన కెంత కోపమో ..

అలా నీడ కూడా లేకుండా 
తనని అక్కడే నాటి 
మంటపెట్టక పోయినా 
తన తనువంతా 
వేడి శగల  మంటలతో 
ఎండల కాలంలో 
కౌగలించుకొనే భానుడంటే  
ఆ మొక్కక్కెంత కోపమో 

కిరణజన్య సంయోగం సరే 
కాని తనకి ప్రాణసంకటమై 
తన అస్థిత్వమే  ప్రశ్నార్ధకమయ్యే 
ఈ సంయోగామంటే దానికిష్టం 
లేదట ..

తనని ఇష్టంగా తెచ్చుకొని 
తోటమాలి చేతిలో పెట్టినందుకు 
యజమానిని ..
తీసుకొచ్చి అన్ని మొక్కల మధ్యలో 
ప్రత్యేకంగా నాటినందుకు 
తోటమాలిని 
మరీ కాలిపోయేలా మంటపెడుతూ 
సూర్యుని అగ్నిశకల తాపాన్ని 
పెంచుతున్న ఈ ఋతువును
తిట్టుకుంటూ ...

సత్తువ సరిపోక 
కాళ్ళు చేతులను తన 
ఆధీనం  ఉంచుకోలేక  
వంగిపోతూ ...
నెల వైపు దీనంగా చూస్తూ ...

ఆ మొక్క నోరు తెరచి 
ఎండిపోతున్న తనకు నీరు కావాలని 
నోరు తెరచి అడుగుతుంటే 
దాన్ని చూసేవారేరి ??
వినేవారేరి ?
దాని దాహం సమయానికి 
తీర్చి తన పచ్చదనం 
కాపాడేవారేరి?? 


Friday, May 25, 2012

నా జ్ఞాపకాల సంద్రలో 
నువ్వే నా మత్స్య కన్యక
స్తబ్దుగా ఉండకుండా 
అన్ని వైపులా  ఈదుతూ 
నా అనుభవాల 
తరంగాలన్నిటిని  స్పృశిస్తూ 
నువ్వు హోయలొలుకుతూ 
ఈదుతుంటే ..
నా మస్తిష్కానికి కూడా 
కలిగే చక్కిలిగింతలే ...!!

ఆ మేనిని తాకి 
నా జ్ఞాపకాలు 
పరవశిస్తునాయేమో   ..లేక 
నా జ్ఞాపకాలలో తనే 
ప్రాణమున్న జ్ఞాపకాల చరమని 
మురిసిపోతుందేమో ..!!

తనకు ఇబ్బందని 
నా కన్నీల చేదును కుడా 
గుండెలో దాచుకొని 
తనని అలాగే సంతోషంగా 
చలిస్తూ చరించమని 
నా ఆలోచనలలో  తను 
సహజీవిస్తు ...
తన జ్ఞాపకాలతో 
నేను తరిస్తూ ... 

నేరం..!

మేఘం లా నన్ను కమ్ముకొని 
రగులుతున్న నా గుండె మంటను 
చల్లార్చే ప్రయత్నం 
నా అనుమతి లేకుండా చేయడం 
నీ నేరం..!!

సుగంధమై నా గతాన్ని 
కౌగలించుకొని 
దాన్ని పరిమళ భరితం చేసి 
నన్నే మైమరిపించేట్టు చేయడం 
నీ నేరమే ...!!

ప్రశ్నల పుట్టలోనే దాగున్న 
సమాధానాలను నీ మాటల 
నాదస్వరంలో రప్పించి 
నా భ్రాంతి చీకట్లను తొలగించే 
ప్రయత్నం చేయడం 
నీ నేరమే ..!!

నా ఒంటరి దారుల్లో 
నా అడుగులతో జతకలిసి 
నేనడక్కుండానే నా ప్రయాణం 
పంచుకోవడం కూడా 
నీ నేరమే ...!!

గుండెగదిలో ఒంటరిగా కూర్చొని 
ఆశల తలుపులు మూసుకున్న 
నా చేత తోడుంటావని
తెరిపించడం కూడా 
నీ నేరమే ..!!

నీ జీవితాన్ని నా గుండెవాకిట నాటి 
నమ్మకపు దారి వేసుకొని 
నా గుండెలో ప్రవేశించి 
నా ప్రేమని నీ బానిస చేసుకొని 
ఇప్పుడలా నన్ను వదిలి వెళ్ళకుండా 
నన్ను నేను మరిపిచిపోయేలా 
క్షమించలేని నేరం నువ్వు చేసి 
నీ ప్రేమ నంతా పెట్టుబడి పెట్టి 
దాన్ని అనుభవించమంటూ 
రోజుకో కమనీయ కావ్యంలా 
నా జీవితాన్ని మార్చుకునే శిక్ష 
నాకు వేస్తావా ?

ఇంత అదృష్టం నాకివ్వడానికి 
జీవితాన్నే త్యాగం చేసేంత 
వెల  చెల్లించిన ..
నా ప్రియమైన శత్రువా 
నన్ను గెలుచుకొని నీవు 
జీవితాంతం నీకు ప్రేమించే 
ప్రియమైన శిక్ష నాకేసావ్ ...  
  

Sunday, May 20, 2012

నాకు నేను ..ఒంటరి

నాకు నేను ..ఒంటరి 
అలాగే  నాకు నేను అనంతం ..!!
నాకు నేను గెలుపు
అలాగే నాకు నేను ఓటమి ..!!
నాకు నేను -నాలో నేను 
నాతో నేనై - నాలో చేరే భావాల నీరై 
నన్ను చుట్టిన అనుబంధాల .. అనుభవాల 
సారలై ..
మనసు రాగాలు .. మౌనంగా ఆలపిస్తూ 
నా మనసుని నేను తిరిగి చదవడం కోసం 
పరుచుకుంటున్నా భావాల పచ్చదనంపై 
నా మనసులో కురిసే ఆలోచనల వర్షపు 
తుంపరలే .. 
నా హృదయ వేణువు  మనసుతో
పలికించే భావాలే ..
నా మనసు పలికే మౌన గీతం 

Saturday, May 19, 2012

మైలు రాయిని

అలసిపోయా ...
రోడ్డు పక్కన ,అలాగే నిలబడి 
వచ్చే,పోయే వాళ్ళకి 
ఇంత కాలం దూరం
ఇంతని చెప్తూ ...

గమ్యాన్ని చూపుతూ ..
వయసు మీద పడిందని 
వానకు తడిచి 
ఎండకు ఎండి 
అప్పుడేప్పుడో ..నన్ను ముస్తాబు 
చేస్తూ వేసిన రంగులు 
అందంగా నా ముఖంపై 
వ్రాసిన ,
తమ గమ్యాన్ని నన్ను చూసి 
తమ ప్రయాణం లెక్కించుకోమని
వేగాన్ని సరిచేసుకొని 
లక్ష్యంతో శ్రద్ధగా గమ్యాన్ని చేరుకోమని 
నా కిచ్చిన , నా మనుగడ 
ఉద్దేశ్యం , ఉద్యోగం 
పూర్తి చేస్తూ ..
ఇంత కాలం సంతోషించా ...

రెండు చక్రాలతో మాట్లాడుతూ 
మొదలు పెట్టి 
కాల క్రమంలో ఎన్ని మార్పులు 
చెందినా వాహనాలను చూసానో ...!
మట్టి దారులు ,తారుతో 
అందంగా మారిపోతుంటే   
చూసి ..నేను వాటితో సంబరపడ్డాను..!!

అప్పుడప్పుడు 
నాలాగే మిగిలున్న పాత మిత్ర 
వాహనాలు ,తమ నవ్వు 
విసురుతూ నన్ను పలకరిస్తాయి 
ఎన్నో ప్రమాదాలు  చూస్తూ  
విలపించిన క్షణాలు ఇంకా జ్ఞాపకమున్నాయి ..

అదో కిలోమీటర్ 
ముందుకు ఎత్థుగా ఒక కొత్త 
హోర్డింగ్ని నిలబెత్తారట ..
తన పరిచయమే నాకు లేదు ..
మార్పుల్లో నేను " పాత "అయ్యాను ..

మార్పుల్లో పడి ..
నేను మార్పును చూస్తూ !!
ఎవరో మార్చితే గాని మారలేని నన్ను 
పట్టించుకునే తీరిక లేని వారు ...
ఎలా నా వైపు చూసేది .. 
చుట్టుపక్కన ఉన్న మనుషులనే 
పట్టించుకోలేనివారు 
ఎలా ప్రయత్నం చేస్తారు 

ఎన్నో జ్ఞాపకాలను
అలా గుండెల్లో దాచుకొని 
విరిగిపోతున్నా .. రాలిపోతున్నా 
నేను " మైలు  రాయిని "...
ఇలా రోడుపక్కన నిల్చొని 
గతంలో భాగమవుతూ 
గమ్యాన్ని దగ్గర చేస్తూ ...
ఒంటరి ప్రయాణాల్లో 
అడుగు కలపకపోయినా ..
లక్ష్యం చేరమని నవ్వుతూ  సాగనంపుతూ .. !! 


Saturday, May 12, 2012

ఫేం టో స్

ముద్దాడన వాన చినుకు
పాదాల్ని... నీ పెదవులపై తచ్చాడినందుకు ..

చూపుల తాళపు గుత్తులతో .. 
ఇంకా ఎన్ని గదులు తెరవాలి నా గుండెలో ..

కళ్ళు రాజీనామా చేస్తాయట 
ఎదురు చూపుల ఉద్యోగం చేయలేక ...

నా కనుల చెలమలో ఊరే 
నీరు .. నీ ప్రేమ పాదాలు తాకాలని .

జీవితకాలం గడిచింది .. 
మళ్ళీ మొలకెత్తడానికి విత్తనం అవ్వు ..

ముక్కుపై కూర్చున్న కోపం ..
ముక్కెరై తన అందాన్ని పెంచుతూ ...

చీకటి మూటలో నేను ఉన్నా
... జ్ఞాపకం అని నన్ను అందులో చుట్టేసాడుగా ...

గుండె గిల్లావ్ ...
కందిపోయేది నీ బుగ్గే అని తెలియక ..

తలబడుతున్న చూపులు .. 
గెలుపు ఓటముల్లో ఒకటవుతూ ...

రాలిపోతున్న ఆకును .. 
పండలేదు .. నీ జ్ఞాపకం కోసివెల్లింది ..

తన మాటల్లో కత్తెర ... 
నా కోరికలు చెప్పకుండానే కత్హరిస్తూ ..

నిన్ను కాపాడుకోడానికి 
నేను ముళ్ళు లాగానే వుండాలి ...

ఎర్రబడ్డ కళ్ళు .. 
చీకటిలో కూడా నిన్ను చూస్తూ ...

నీ మాటలో లోతులు .. 
మునిగిపోతున్న నాకు మాత్రమే తెలుసు ..

అదరాల మీదే ఆసినమై
నీ పేరు .. ప్రతి మాటను దాటి పోనివ్వక 

తన జేబుకెన్ని కుట్లో ..
గుండెని జారి పోనివ్వకుండా కుటుంబ పెద్ద .

తనకు -" ఇంకా " అనే పదమే
సర్వం ... సంద్రంలా నా మాటల నీరు కావాలంటూ ...

గాలి ఇంటికి దారి చెప్పరూ ?? 
తన శ్వాస నింపుకొని రావద్దని చెప్పాలి ...

Thursday, May 10, 2012

మనసు పుస్తకంలో

నాలో నాకే తెలిసిన గతం 
తనలో నేనై కనిపించి 
కబుర్లు చెప్పిందట 

తన మనసు పుస్తకంలో 
గతాన్ని సిరాగా నింపుకొని 
వ్రాస్తూ ఉందట 
వ్రాయలేని ,చెప్పలేని ,విప్పలేని 
మనసు సంగతులు ...

నా గతం ..కాల గర్బంలో 
కప్పి పెట్టి ..
కళ్ళకు మనసుకు 
గంతలు కట్టి ..
మరిచిపోవాలని
భాధలు సంతోషపు గుళికలను 
మింగితే ...
వికటించి ఒంటరితనాన్ని 
ఇచ్చి .పక్కున నవ్విందట ...

అయినా  నేనంటే 
తనకు ఇష్టమే అని 
హృదయాన్ని నా కోసం 
రాసి ఇవ్వడానికి 
సుముఖత తెలిపే తన 
సహ్రుదయం..సంతోషం 
-నటనగా మారిన ప్రేమలు 
కుడా సిగ్గుపడేలా..
నిజమైన ,నిష్కపటమైన ప్రేమ ఇది
అని చెప్పుకునేలా 
తాను చేసిన సాహసానికి 
నా ఆజన్మాంతం నేను తనకు 
భానిసనే ..

నా గతం సాక్షిగా ..
వ్రాసి ఇస్తున్నా ..తనకు 
నన్ను నేనే 
నా అప్పగింతల పత్రం
నాకు నేనై  .. 

Monday, May 7, 2012

నడుస్తూ నడుస్తూ

నడుస్తూ నడుస్తూ 
నేనేక్కడికొచ్చి ఆగాను ?
తెలియని చోటులాగా లేదు 
తెలిసిన మనుష్యులు 
కనిపించడం లేదు ..!

తలుపు తట్టాను 
తను తలుపు తెరిచింది 
ఆశ్చర్యం ..వెతుకుతున్న 
ప్రేమ ఇక్కడుంటుందని..
నా కాళ్ళ కెలా  తెలుసు ..?

అవును నా మనసంతా 
తను  నిండుకొనివుంటే
నాకు తెలియని ఆకర్షణ శక్తి 
ఏదో ..తనపై నన్ను 
తనకు తెలియకుండా 
లాగుతుంటే ..!!

తన కళ్ళలో నన్ను చూసా 
నా కళ్ళలో తనను నింపుకున్నా 
తలుపు మోహనా వేసినా 
కళ్ళలో నింపుకున్నా తనను 
గుండెల్లో పెట్టుకొని 
జీవితాంతం తన ప్రేమకై 
గువ్వ పిట్టలా కనిపెడుతూనే 
ఉంటా ..!!

తను నన్ను చూసి నవ్వింది 
వెంటనే చుక్కల వర్షం 
జల్లులై నా మీద కురిసింది 
నాలో ఉన్న ప్రేమ 
తనలోకెప్పుడు చేరి 
రెండు హృదయాలకి 
దారి ఎప్పుడు వేసిందో 
తెలియదు కాని ..!!

నాలో నుంచి నీలోకి 
నీలో నుంచి నాలోకి 
తెలియకుండానే నన్ను నిన్ను 
తడుముతూ ..పెనవేసుకుంది 
ఆహ్వానిస్తుంది ..!!
చిరునవ్వు సంతకం 
తన హృదయం నాదైన 
ఆస్తిగా చేసుకోమంటూ 
ఒట్టు ఎవరి మొహం చూసానో 
ఉదయమే ..
రుణపడి ఉంటానని  నవ్వుకుంటూ ..
నడుస్తూ నడుస్తూ ..
నేను నా ప్రేమని 
నా జంటను చేసుకున్నానని ..    

Saturday, May 5, 2012

కలల నావ

కలల నావ నెక్కి 
నిన్ను చేరా ..
చీకటి దారుల్లో 
ఎంత కష్టమయ్యిందో ..!!

చీకటిలో దారివెత్త్తుక్కోవడం
కష్టమే కాని 
చలువ చూపుల 
కాంతులు విరజిమ్ముతూ ..
కనీ, కనిపించకుండా 
చూపి ,చూపించకుండా  
దారులు చూపింది నాపై 
ప్రేమతోనే కదా ..
అందుకోసమే 
విస్సుక్కోలేదు ..!!

ఆశల తెడ్లు వేస్తూ 
శూన్యంలో ..
నా నావ ప్రయాణం 
నిన్ను చేరేదాక 
సాహస ప్రయోగమే 
సుమా ..!!

వెండి మబ్బులో దాక్కుని 
దోబుచులాటలో నువ్వు 
తీరిక లేకుండా వున్నా 
నీ కోసం .."నా మనసు "
నిన్ను హత్తుకోవడం కోసం 
.."నా కనులు "
తెగ ఆరాటపడుతున్నాయి ...!!

ఆ పూర్ణ బింబం నా మనసును 
నీదిగా చేసుకుంది 
అందుకేనేమో 
నీ అందమైన తనువుకు 
ఆ నల్లటి మచ్చలు 

నా రేడువైన నిన్ను 
నా హృదయసీమలో 
అలాగే ప్రతిష్టించ్చుకోవాలని 
నా తపస్సు ..
వరమిస్తావా ? 
నిన్ను ఆ జన్మాంతం 
ఇలాగె చూడాలని కోరిక ..
చోటిస్తావా ?
నీతో ఇలాగే గడిపే ..
ఆనందం సొంతమవ్వాలని ... !!
నీ ప్రేమ లోగిలిలో 
నీతోనే ఉండాలని ... !!