Saturday, May 26, 2012

ఏడుస్తున్న ప్రేమ

ఒక మూలాన కూర్చొని 
ఏడుస్తున్న ప్రేమ 
తనకు పట్టిన
దౌర్భాగ్యాన్ని చూసి 

మారుతున్న కాలంతో పాటు 
తనను కూడా మార్చేస్తున్న 
మనుషులను చూసి 

తనను ఆటగా మారుస్తున్న 
మూర్కులైన పాషాణ 
హృదయులను చూసి 
ప్రేమనే సరిగా అర్ధం చేసుకోని  
జులాయిగా పేరు తగిలించుకున్న 
ప్రేమికులను చూసి ...

తన ఆత్మ దైవత్వం 
తన తనువు త్యాగం 
తన అందం అందరిని ఆదరించడం 
తన శ్వాస కరుణాంమృతం 
క్షమాపణ తన స్వరం 
సహనం జాలి తన స్వభావం 
ప్రోత్సాహం తన ప్రవర్తన 

అలాంటి తనను 
ఒకరు ఉరి తీస్తున్నారు 
ఒకరు గొంతు కోస్తున్నారు 
ఒకరు తగల బెడుతున్నారు 
ఒకరు ఆసిడ్ దాడులు చేస్తున్నారు 
తన పేరునే ఆట బొమ్మని చేసి 
ఆడుకుంటున్నారు 
తనను ముసుగుగా వేసుకొని 
మోసం చేస్తున్నారు 

నాలుగు దారుల కూడలిలో 
అంగడి వస్తువుని చేసి 
తన పవిత్రమైన దుస్తులు విప్పి 
నవ్వుల పాలు చేస్తున్నారు 

కరిగిపోయే తన స్వభావాన్ని 
కన్నీరోలికే వరకు వదలక 
మోసం ,అసూయా ,ద్వేషం,కుళ్ళు 
సాయంతో ..
తేనె పూసిన ఆలోచన కత్తులతో 
పొడిచి పొడిచి గాయ పరుస్తున్నారు 

సంతోషానికి నెలవైన తనని 
ఒంటరికి బానిస చేస్తూ 
ఓడిస్తూ ఉంటే  ...
ఏమి చేయలేక 

ఒక మూలాన కూర్చొని 
ఏడుస్తున్న ప్రేమ 
తనకు పట్టిన
దౌర్భాగ్యాన్ని చూసి ...

(శుక్రవారం రోజున 25/5/2012 న అమలాపురం లో  వరలక్ష్మి అనే అమ్మాయి మీద కిరణ్ కుమార్ అనే వ్యక్తి 
ప్రేమోన్మదియై కత్తి దాడి చేసి గొంతు కోసిన వార్తను చదివి చలించి రాసినది )