ఏదో ఒక చిన్న ఆశ
నా మనసును తను ఎక్కడుంటే
అటు నడిపిస్తూ
మారు ప్రశ్నించలేని మనసును
తన బానిసను చేసుకుంటూ ...
నీ పిలుపుకై వేచి ఉన్న
హృదయంలో
ఒక్క మాటతో స్పందన కలిగించి
నన్నే మరచిపోయేలా
మతిమరుపును బహూకరించి
నీ అడుగులు వెతుకుతూ
నీ మాటలనే వెంబడిస్తుంటే
నీకిప్పుడు సంతోషమే కదా ..?
అలసిపోయిన కళ్ళకు
సేదతీరే తీరికెక్కడిది ?
నీ మాటలను ఏరుకునేందుకు
మనసు నన్నే మరిచిపోతే ?
సుదూర తీరాలలో
ఆ వెన్నెల వెలుగుల్లో
నీ చిలిపి మాటలతో
నాకు నేను కాని నన్నులా
నీ హృదయాన్ని నీ చెప్పు
చేతల్లోకి తీసుకున్న
మాంత్రికుడిలా
ఆ నవ్వు చూడు ..!!
మారు ప్రశ్నించలేని మనసును
తన బానిసను చేసుకుంటూ ...
నీ పిలుపుకై వేచి ఉన్న
హృదయంలో
ఒక్క మాటతో స్పందన కలిగించి
నన్నే మరచిపోయేలా
మతిమరుపును బహూకరించి
నీ అడుగులు వెతుకుతూ
నీ మాటలనే వెంబడిస్తుంటే
నీకిప్పుడు సంతోషమే కదా ..?
అలసిపోయిన కళ్ళకు
సేదతీరే తీరికెక్కడిది ?
నీ మాటలను ఏరుకునేందుకు
మనసు నన్నే మరిచిపోతే ?
సుదూర తీరాలలో
ఆ వెన్నెల వెలుగుల్లో
నీ చిలిపి మాటలతో
నాకు నేను కాని నన్నులా
నీ హృదయాన్ని నీ చెప్పు
చేతల్లోకి తీసుకున్న
మాంత్రికుడిలా
ఆ నవ్వు చూడు ..!!