Saturday, May 26, 2012

మొక్క

తన పచ్చని దుస్తులను 
తను వేడి వేడి చేతులతో లాగుతూ 
రంగులు  మారుస్తుంటే 
తన కెంత కోపమో ..

అలా నీడ కూడా లేకుండా 
తనని అక్కడే నాటి 
మంటపెట్టక పోయినా 
తన తనువంతా 
వేడి శగల  మంటలతో 
ఎండల కాలంలో 
కౌగలించుకొనే భానుడంటే  
ఆ మొక్కక్కెంత కోపమో 

కిరణజన్య సంయోగం సరే 
కాని తనకి ప్రాణసంకటమై 
తన అస్థిత్వమే  ప్రశ్నార్ధకమయ్యే 
ఈ సంయోగామంటే దానికిష్టం 
లేదట ..

తనని ఇష్టంగా తెచ్చుకొని 
తోటమాలి చేతిలో పెట్టినందుకు 
యజమానిని ..
తీసుకొచ్చి అన్ని మొక్కల మధ్యలో 
ప్రత్యేకంగా నాటినందుకు 
తోటమాలిని 
మరీ కాలిపోయేలా మంటపెడుతూ 
సూర్యుని అగ్నిశకల తాపాన్ని 
పెంచుతున్న ఈ ఋతువును
తిట్టుకుంటూ ...

సత్తువ సరిపోక 
కాళ్ళు చేతులను తన 
ఆధీనం  ఉంచుకోలేక  
వంగిపోతూ ...
నెల వైపు దీనంగా చూస్తూ ...

ఆ మొక్క నోరు తెరచి 
ఎండిపోతున్న తనకు నీరు కావాలని 
నోరు తెరచి అడుగుతుంటే 
దాన్ని చూసేవారేరి ??
వినేవారేరి ?
దాని దాహం సమయానికి 
తీర్చి తన పచ్చదనం 
కాపాడేవారేరి??