Saturday, May 12, 2012

ఫేం టో స్

ముద్దాడన వాన చినుకు
పాదాల్ని... నీ పెదవులపై తచ్చాడినందుకు ..

చూపుల తాళపు గుత్తులతో .. 
ఇంకా ఎన్ని గదులు తెరవాలి నా గుండెలో ..

కళ్ళు రాజీనామా చేస్తాయట 
ఎదురు చూపుల ఉద్యోగం చేయలేక ...

నా కనుల చెలమలో ఊరే 
నీరు .. నీ ప్రేమ పాదాలు తాకాలని .

జీవితకాలం గడిచింది .. 
మళ్ళీ మొలకెత్తడానికి విత్తనం అవ్వు ..

ముక్కుపై కూర్చున్న కోపం ..
ముక్కెరై తన అందాన్ని పెంచుతూ ...

చీకటి మూటలో నేను ఉన్నా
... జ్ఞాపకం అని నన్ను అందులో చుట్టేసాడుగా ...

గుండె గిల్లావ్ ...
కందిపోయేది నీ బుగ్గే అని తెలియక ..

తలబడుతున్న చూపులు .. 
గెలుపు ఓటముల్లో ఒకటవుతూ ...

రాలిపోతున్న ఆకును .. 
పండలేదు .. నీ జ్ఞాపకం కోసివెల్లింది ..

తన మాటల్లో కత్తెర ... 
నా కోరికలు చెప్పకుండానే కత్హరిస్తూ ..

నిన్ను కాపాడుకోడానికి 
నేను ముళ్ళు లాగానే వుండాలి ...

ఎర్రబడ్డ కళ్ళు .. 
చీకటిలో కూడా నిన్ను చూస్తూ ...

నీ మాటలో లోతులు .. 
మునిగిపోతున్న నాకు మాత్రమే తెలుసు ..

అదరాల మీదే ఆసినమై
నీ పేరు .. ప్రతి మాటను దాటి పోనివ్వక 

తన జేబుకెన్ని కుట్లో ..
గుండెని జారి పోనివ్వకుండా కుటుంబ పెద్ద .

తనకు -" ఇంకా " అనే పదమే
సర్వం ... సంద్రంలా నా మాటల నీరు కావాలంటూ ...

గాలి ఇంటికి దారి చెప్పరూ ?? 
తన శ్వాస నింపుకొని రావద్దని చెప్పాలి ...