నేనేక్కడికొచ్చి ఆగాను ?
తెలియని చోటులాగా లేదు
తెలిసిన మనుష్యులు
కనిపించడం లేదు ..!
తలుపు తట్టాను
తను తలుపు తెరిచింది
ఆశ్చర్యం ..వెతుకుతున్న
ప్రేమ ఇక్కడుంటుందని..
నా కాళ్ళ కెలా తెలుసు ..?
అవును నా మనసంతా
తను నిండుకొనివుంటే
నాకు తెలియని ఆకర్షణ శక్తి
ఏదో ..తనపై నన్ను
తనకు తెలియకుండా
లాగుతుంటే ..!!
తన కళ్ళలో నన్ను చూసా
నా కళ్ళలో తనను నింపుకున్నా
తలుపు మోహనా వేసినా
కళ్ళలో నింపుకున్నా తనను
గుండెల్లో పెట్టుకొని
జీవితాంతం తన ప్రేమకై
గువ్వ పిట్టలా కనిపెడుతూనే
ఉంటా ..!!
తను నన్ను చూసి నవ్వింది
వెంటనే చుక్కల వర్షం
జల్లులై నా మీద కురిసింది
నాలో ఉన్న ప్రేమ
తనలోకెప్పుడు చేరి
రెండు హృదయాలకి
దారి ఎప్పుడు వేసిందో
తెలియదు కాని ..!!
నాలో నుంచి నీలోకి
నీలో నుంచి నాలోకి
తెలియకుండానే నన్ను నిన్ను
తడుముతూ ..పెనవేసుకుంది
ఆహ్వానిస్తుంది ..!!
చిరునవ్వు సంతకం
తన హృదయం నాదైన
ఆస్తిగా చేసుకోమంటూ
ఒట్టు ఎవరి మొహం చూసానో
ఉదయమే ..
రుణపడి ఉంటానని నవ్వుకుంటూ ..
నడుస్తూ నడుస్తూ ..
నేను నా ప్రేమని
నా జంటను చేసుకున్నానని ..