Tuesday, May 29, 2012

సిరి సిరి మువ్వలు (FEMTO's)

నువ్వు కరిగే మంచు చూస్తావ్ ... 
నే ప్రకృతిని మెత్తగా తడిమే ప్రేమ చూస్తా...!!

నీ పేరు వినగానే ... 
నవ్వు వెనక పెదాల ఆలింగనం చూడు .. !!

ఎదురౌతావ్ .. ఎదనుగిల్లి .. 
మాట్లాడక మౌనంతో మనసు పలికిస్తావ్ ...!!

ఈ రోజు నవ్వు చెల్లించలేదు ..
అందుకే నా శ్వాస జప్తు చేసుకున్న ప్రేమ ... !!

చావెక్కడిది ..
శరీరంతో పని లేని నీకు - ప్రేమా ??!!.

నీ గుండె లోతెంతని కళ్ళను -
ప్రశ్నిస్తే ... కన్నీళ్లనడిగి తెలుసుకోమంది ..!!

మనసు పొగలు కక్కుతుంది .. 
ఎవరో ప్రేమ నిప్పు అంటించారు ..!!

ప్రేమ..మాటలనే 
మరిచిపోయేలా చేసే మౌన శిక్ష !!

నీ ఊపిరి మాలలల్లి 
నా హృదయం తో మాట్లాడించకు .,..!!

మూలాన కూర్చొని ఏడుస్తున్న
ప్రేమ ..తనకు పట్టిన దౌర్భాగ్యాన్ని చూసి ..!!

తన తలపులతో 
నా గొడవ ... నా ప్రశాంతత నాకిచ్చేయమని ..

నీ మాటలే నా చెవిపోగులు ..
నువ్వు లేనప్పుడు నీ స్వరం వినిపిస్తూ ...!!

తెలుసుకోవాలని కోరిక ... 
తుమ్మెద పూవు చెవులో చెప్పే గుస గుస ..!!

అర్ధం లేకుండా 
నువ్వే పని చేయవు కదా ....

ఆ పొగరుకి కళ్ళెం వేసి ... నా
...బానిస చేస్కోని స్వారి చేయాలనీ కోరిక ....!!