నా జ్ఞాపకాల సంద్రలో
నువ్వే నా మత్స్య కన్యక
స్తబ్దుగా ఉండకుండా
అన్ని వైపులా ఈదుతూ
నా అనుభవాల
తరంగాలన్నిటిని స్పృశిస్తూ
నువ్వు హోయలొలుకుతూ
ఈదుతుంటే ..
నా మస్తిష్కానికి కూడా
కలిగే చక్కిలిగింతలే ...!!
నా జ్ఞాపకాలు
పరవశిస్తునాయేమో ..లేక
నా జ్ఞాపకాలలో తనే
ప్రాణమున్న జ్ఞాపకాల చరమని
మురిసిపోతుందేమో ..!!
తనకు ఇబ్బందని
నా కన్నీల చేదును కుడా
గుండెలో దాచుకొని
తనని అలాగే సంతోషంగా
చలిస్తూ చరించమని
నా ఆలోచనలలో తను
సహజీవిస్తు ...
తన జ్ఞాపకాలతో
నేను తరిస్తూ ...