నాలో నాకే తెలిసిన గతం
తనలో నేనై కనిపించి
కబుర్లు చెప్పిందట
తన మనసు పుస్తకంలో
గతాన్ని సిరాగా నింపుకొని
వ్రాస్తూ ఉందట
వ్రాయలేని ,చెప్పలేని ,విప్పలేని
మనసు సంగతులు ...
నా గతం ..కాల గర్బంలో
కప్పి పెట్టి ..
కళ్ళకు మనసుకు
గంతలు కట్టి ..
మరిచిపోవాలని
భాధలు సంతోషపు గుళికలను
మింగితే ...
వికటించి ఒంటరితనాన్ని
ఇచ్చి .పక్కున నవ్విందట ...
అయినా నేనంటే
తనకు ఇష్టమే అని
హృదయాన్ని నా కోసం
రాసి ఇవ్వడానికి
సుముఖత తెలిపే తన
సహ్రుదయం..సంతోషం
-నటనగా మారిన ప్రేమలు
కుడా సిగ్గుపడేలా..
నిజమైన ,నిష్కపటమైన ప్రేమ ఇది
అని చెప్పుకునేలా
తాను చేసిన సాహసానికి
నా ఆజన్మాంతం నేను తనకు
భానిసనే ..
నా గతం సాక్షిగా ..
వ్రాసి ఇస్తున్నా ..తనకు
నన్ను నేనే
నా అప్పగింతల పత్రం
నాకు నేనై ..