Monday, May 28, 2012

బడి

నా కన్నీలు 
నిన్ను అడుగుతున్నాయి .. 
ఇంకా అలాగే నాబాల్యాన్ని 
దాచుకున్నవా అని ??..

మనసు బాగోలేదు ..
అందుకే 
మళ్ళోసారి నా బాల్యాన్ని 
దాచుకున్న నిన్ను 
చూడాలని వచ్చా ... 

నువ్వేం మారలేదు 
వయసు మీద పడుతున్న 
అంతే హుందాగా 
ఎన్నో జ్ఞాపకాలని 
దాచుకొని ..తాజాగా 
వున్నావ్ ..

అవును .. మొదటి రోజు 
భయం భయంగా ..
నీ ఒడిలోకి అడుగుపెట్టిన 
నన్ను ఇంకా చూపిస్తున్నావ్ ..
నిజం ..
ఎంత తేలికగా వుందో 
నా మనసు .. ఇప్పుడు ఆ రోజును 
మళ్ళీ ఓసారి గతంలోకెళ్ళి 
చూస్తే ...కళ్ళు చెమర్చకపోతే 
ఏలా ?

అరే... ఆ బెంచి మీద నేను రాసిన 
రాతలు 
మూడో  తరగతి గదిలో ..
పాతబడ్డా
అలాగే వున్నాయి 
వెళ్ళిన నన్ను చూసి నవ్వుతూ .. 
పలకరిస్తునాయి ..
నాల్గవ తరగతి కిటికీ 
వేస్తూ నలగొట్టుకున్న వేలు 
అల్లరి చేస్తూ అయిదవ తరగతి 
టీచర్ తో తిన్న చెంపదెబ్బలు :(
ఏడవ తరగతి పుబ్లిక్ పరీక్షల్లో 
కొట్టలేక కొట్టిన కాపీలు 
శ్రమ దానం అని తొమ్మిది 
పది తరగతుల్లో ఊర్లు 
తిరుగుతూ చేసిన అల్లర్లు 
సరదాలు ..
ఇంకా తాజాగానే కనిపిస్తున్నాయి 
సుమా .. 


ఎక్కుతున్నప్పుడు 
ఒక్కోమెట్టు 
చిన్న బూట్లేసుకొని 
నేనెక్కిన చిత్రాలే చూపిస్తూ 
అప్పట్టి .. నా ఆలస్యానికి 
నా హడవిడిని 
గుర్తు చేస్తూ నవ్వుతున్నాయి .. 

నా స్నేహితురాళ్ళతో 
కలిసి పిచ్చి పిచ్చి గా 
తిరిగిన నా  బడివైన నీలో 
అడుగడున నా బాల్యం 
తాలుకు జ్ఞాపకాల 
సువాసనలు గుప్పిస్తూ .. 
నా బాధను దూరం చేస్తూనే 
నా ముందు కదలాడుతున్నాయి  .. 

నీళ్ళు తాగుతూ 
వరుసగా వున్నా ఆ 
కొల్లాయిల  దగ్గర పడ్డ 
ఆకతాయి గొడవలు ..
మద్యాహ్నం  గోడలు దూకి 
ఇంటికొచ్చిన రోజులు ...
దొంగిలించి తిన్న నేస్తం 
డబ్బాల కొద్ది చిరుతిండ్లు. 
ఎర్రసిరాతో .. టీచర్ గారిలా 
దిద్దుకొని వేసుకున్న 
మార్కులు .. 
సమయం అయిపోయినా 
బడిలోనే ఉండి  ఆడుకొని 
ఆలస్యంగా ఇంటికొచ్చి 
అమ్మతో పడ్డ దెబ్బలు ..
వర్షంలో తడిచి వేడి వేడి గా 
కొనుక్కొని తిన్న బజ్జీలు 
ఆలస్యంగా బడికెళ్ళి 
స్కూల్ గ్రౌండ్ శుభ్రం చేసిన 
శిక్షలు ..అన్నీ .. 
అన్నిభద్రంగా చుపిస్తున్నావ్ 

మనసు తేలికయి  గాలిలో తేలుతూ 
వదిలి వచ్చిన బాల్యం .. 
ఆ చిన్ననాటి 
విద్యార్ధి జీవితం 
నాకు గుర్తొచ్చి  
మళ్ళీ కావాలనిపిస్తుంది ... 
మల్లోసారి .. బాల్యం తెచ్చుకొని 
నీ ఒడిలో తిరిగి అడుగు పెట్టాలని 
ఉంది  .. 

అమ్మ తర్వతా .. 
అమ్మలా నువ్వు బడివై 
నన్ను హత్తుకొని 
ఎన్నెన్ని నేర్పావ్ .. 
ఎన్ని మధుర స్మృతులు 
మిగిల్చావ్ .. 
ఏమిచ్చినా నీకు తక్కువే .. 
ఎలా వర్ణించినా  తక్కువే .. 
అందుకే నా కన్నీళ్లు కుడా 
నీ పాదాలను తాకి 
నవ్వుతున్నాయి ..
నీతో నీలో దాచుకున్న 
నా జ్ఞాపకాలని 
నా బహుమతులుగా ఇస్తున్నందుకు 
శిరసు వంచి నీ పాదాలను 
ముద్ధడుతున్నాయి ...