Saturday, May 5, 2012

కలల నావ

కలల నావ నెక్కి 
నిన్ను చేరా ..
చీకటి దారుల్లో 
ఎంత కష్టమయ్యిందో ..!!

చీకటిలో దారివెత్త్తుక్కోవడం
కష్టమే కాని 
చలువ చూపుల 
కాంతులు విరజిమ్ముతూ ..
కనీ, కనిపించకుండా 
చూపి ,చూపించకుండా  
దారులు చూపింది నాపై 
ప్రేమతోనే కదా ..
అందుకోసమే 
విస్సుక్కోలేదు ..!!

ఆశల తెడ్లు వేస్తూ 
శూన్యంలో ..
నా నావ ప్రయాణం 
నిన్ను చేరేదాక 
సాహస ప్రయోగమే 
సుమా ..!!

వెండి మబ్బులో దాక్కుని 
దోబుచులాటలో నువ్వు 
తీరిక లేకుండా వున్నా 
నీ కోసం .."నా మనసు "
నిన్ను హత్తుకోవడం కోసం 
.."నా కనులు "
తెగ ఆరాటపడుతున్నాయి ...!!

ఆ పూర్ణ బింబం నా మనసును 
నీదిగా చేసుకుంది 
అందుకేనేమో 
నీ అందమైన తనువుకు 
ఆ నల్లటి మచ్చలు 

నా రేడువైన నిన్ను 
నా హృదయసీమలో 
అలాగే ప్రతిష్టించ్చుకోవాలని 
నా తపస్సు ..
వరమిస్తావా ? 
నిన్ను ఆ జన్మాంతం 
ఇలాగె చూడాలని కోరిక ..
చోటిస్తావా ?
నీతో ఇలాగే గడిపే ..
ఆనందం సొంతమవ్వాలని ... !!
నీ ప్రేమ లోగిలిలో 
నీతోనే ఉండాలని ... !!