నాకు నేను ..ఒంటరి
అలాగే నాకు నేను అనంతం ..!!
నాకు నేను గెలుపు
అలాగే నాకు నేను ఓటమి ..!!
నాకు నేను -నాలో నేను
నాతో నేనై - నాలో చేరే భావాల నీరై
నన్ను చుట్టిన అనుబంధాల .. అనుభవాల
సారలై ..
మనసు రాగాలు .. మౌనంగా ఆలపిస్తూ
నా మనసుని నేను తిరిగి చదవడం కోసం
పరుచుకుంటున్నా భావాల పచ్చదనంపై
నా మనసులో కురిసే ఆలోచనల వర్షపు
తుంపరలే ..
నా హృదయ వేణువు మనసుతో
పలికించే భావాలే ..
నా మనసు పలికే మౌన గీతం