Thursday, April 5, 2012

ఆ ముడతల్లో అమ్మ అందం 
తాను ధారపోసిన జీవితమై కనిపించే ..
పరితపించే ప్రేమకి 
నిలువెత్తు సాక్షమై చూపించే ..
ప్రవహించే నది స్వచ్ఛత ఆ నవ్వులోనే 
నీకై ఆలోచించిన సమయమంతా 
ఆ నెరసిన వెంట్రుకల తెల్లదనమే 
నిన్ను లాలించిన ఆ చేతుల వణుకు 
నీ చేయి ఇప్పుడు తనను పట్టుకోవాలనే
తన మాటలోని అస్పష్టత నీ మాటల
సహాయం కావాలనే ..
తడబడే తన అడుగులకు నీవున్నావనే   
ధైర్యం కావాలనే 
నీరుకారే ఆ కళ్ళలో ఊసులు నీకై 
కన్న ఆ  తల్లి ఆశల కలలే ..
మురిపాల పాలు తాగి పెరిగి 
మరిచేవా తనను నీ వ్యాపకాలతో 
లక్ష్యం అని సుదూరలకువెళ్లి 
లక్షలతో  నువ్వు లేని నవ్వు తెచ్చేవా తన 
పెదాలపై 
బోసిపోయిన తన నవ్వు నీ పసిపాప కాదా
నాన్నా అని పిలిచే పిలుపు నీ కూతురుదే 
అనిపించలేదా ... ?
ఇంకెంత సమయమో ఆ గుండె పరుగు 
ఆ కొంత సమయం కూడా నీ కోసమే 
పరితపించు ...
హత్తుకునేందుకు ఇంకెందుకు ఆలోచన 
ఇవ్వడమే కాని ఆశించని ప్రేమకు
నీవు వెలకట్టలేని ప్రేమకి 
చుపలేవా చిటికెడు ఆదరణ ..ఆప్యాయతలు ..?
ఇవ్వలేవా తను వాల్చేందుకు నీ భుజంపై 
జానెడు స్థలం నిండు ప్రేమల ఆత్మీయతలు